పరీక్షలు ప్రశాంతం
పరీక్షలు ప్రశాంతం
అద్దంకి, :
పట్టణంలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 1352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 852 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 500 మంది గైర్హాజరయ్యారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీ రవీందర్ పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌డీసీ రవీందర్ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని కట్టా రామకోటేశ్వరరావు కళాశాల సెంటర్‌లో 312 మందికి 190 మంది, గోవిందాంబికా పరమేశ్వరి కళాశాలలో 348 మందికి 225 మంది, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో 308 మందికి 189 మంది, విశ్వభారతిలో 264 మందికి 170 మంది, ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 120 మందికి 78 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా పరీక్షకు అనుమతించడంతో చాలా మందికి మేలు జరిగిందన్నారు. విశ్వభారతీ కళాశాలలో ఒక విభిన్న ప్రతిభా వంతునికి, కేఆర్‌కే డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసిన ఒక అంధ అభ్యర్థినికి ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు.
కట్టా రామకోటేశ్వరరావు డిగ్రీ కళాశాలలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు పట్టణంలోని భవిష్య పాఠశాల యాజమాన్యం ఉచితంగా రెండు బస్సులు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎంఈఓ విజయకుమార్ లైజనింగ్ అధికారులుగా, వ్యవసాయాధికారి కే రమేష్, పంచాయతీ రాజ్ ఏఈలు రామ్ కుమార్, జే రవిబాబు, ఎంవీ నాగేశ్వరరావు, ఈఓపీఆర్డీ కవితా చౌదరి అసిస్టెంట్ లైజనింగ్ అధికారులుగా వ్యవహరించారు. పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లోని కేఆర్‌కే డిగ్రీ కళాశాల సెంటర్‌ను, ప్రకాశం జూనియర్ కళాశాల సెంటర్‌లో పరీక్షలను జెడ్పీ సీఈఓ ప్రసాద్ పరీశీలించారు.