Newly Wed Couple Ravinder, Mahalakshmi Reacts On Trolls Over Body Shaming - Sakshi
Sakshi News home page

Actress Mahalakshmi-Ravinder: కొత్త జంటపై నెగిటివ్‌ కామెంట్స్‌, ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన నటి

Published Sun, Sep 4 2022 10:50 AM | Last Updated on Sun, Sep 4 2022 11:40 AM

Newly Wed Couple Ravinder, Mahalakshmi Reacts On Trolls Over Body Shaming - Sakshi

ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, సీరియల్ నటి మహాలక్ష్మీ పెళ్లి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. సెప్టెంబర్‌ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం​. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల సమ్మతితో సెప్టెంబర్‌ 1న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం ఒక్కటయ్యామంటూ ఇద్దరు పెళ్లి ఫొటోలు షేర్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ కొత్త జంట ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడమే కాదు వీరిద్దరి వివాహం నెట్టింట చర్చనీయాంశమైంది.

చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్‌, మండిపడుతున్న నెటిజన్లు!

దీనికి కారణం నిర్మాత రవీందర్‌ భారీ కాయం.. మహాలక్ష్మీ సన్నగా ఉండటమే. అప్పటి నుంచి ఈ జంటను ట్రోల్‌ చేయడం, రవిందర్‌పై బాడీ షేమింగ్‌ చేయడం చేస్తున్నారు నెటిజన్లు. ‘అలాంటి వ్యక్తిని మహాలక్ష్మి ఎలా పెళ్లి చేసుకుంది.. ఇది నిజమా?’,‘డబ్బు కోసమే ఆయనను ఆమె పెళ్లి చేసుకుంది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ తెలుగు యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌పై స్పందించింది ఈ జంట. ఆయన బరువు తనకు పెద్ద సమస్య కాదని చెప్పి ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు నటి మహాలక్ష్మి. ‘నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టపడ్డాను. ఆయన బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని చెప్పాను.

చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్‌డిస్క్‌లు

బరువు గురించి చాలా సార్లు మాట్లాడారు. ఫారెన్‌ వెళ్లి ట్రాన్స్‌ఫాం అవుతా అన్నారు. కానీ అవేవీ చేయోద్దండి, మీరు ఉన్నట్టే  ఉండండి అని చెప్పాను’ అని మహాలక్ష్మి అన్నారు. ఆ తర్వాత తమ జంటపై కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌ థంబ్‌ నేల్స్‌ చూసి ఇద్దరం నవ్వుకున్నామని చెప్పారు. ఇక నిర్మాత రవిందర్‌ మాట్లాడుతూ.. నెగిటివ్‌ కామెంట్స్‌ పెద్దగా పట్టించుకోమన్నారు. ‘మా పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. చాలా మంది మాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మరికొందరు సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నాపై బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎదుటివారి లైఫ్ అనేసరికి అందరు సులువుగా మాటలు అనేస్తారు. వాటికి నేను పెద్దగా కుమిలిపోను’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement