పెరంబూరు: నటి జెన్నీఫర్ మోసగత్తె అని, ఆమె పలువురిని మోసం చేసిందని బుల్లితెర సహాయ నటుడు ఫకృద్దీన్ పేర్కొన్నాడు. సినిమా, టీవీ సీరియళ్లలో సహాయ నటిగా చేస్తున్న జెన్నీఫర్ ఇటీవల సహాయ నటుడు ఫకృద్దీన్‌పై స్థానిక వడపళనిలో ఫిర్యాదు చేసింది. అందులో.. కొంత కాలం క్రితం తనకు పరిచయమైన ఫకృద్దీన్ తనతో కలిసున్న అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు అతడిపై హత్యాబెదిరింపులు, లైంగిక వేధింపులు తదితర మూడు కేసులను నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఫకృద్దీన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నటి జెన్నీఫర్ మోసగత్తె అని, పలువురితో సంబంధాలు పెట్టుకుని మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. తన భార్యతో తనకెలాంటి మనస్పర్థలు లేవని, సినిమాల్లో రాణించాలని చెన్నైలో నివశిస్తున్నానని తెలిపారు. ఓ స్నేహితుడి ద్వారా జెన్నీఫర్ పరిచయమైందని..కష్టాల్లో ఉంటే ఒక కూతురిలా భావించి పలుమార్లు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. తనకు తెలిసిన వారి నుంచి డబ్బు తీసుకుని మోసం చేసిందన్నారు. ఆమెపై పళల్, వడపళని పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకే ఫిర్యాదు చేసిందని ఫకృద్దీన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment