కార్యక్రమంలో మాట్లాడుతున్న జెన్నిఫర్
సాక్షి, హైదరాబాద్: తప్పుడు సమాచారం, కథనాలు ప్రధాన మీడియాలో ప్రచుర ణకు నోచుకోకుండా, ప్రసారం కాకుండా జర్నలిస్టులు జాగ్రత్తపడాలని యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ కోరారు. తప్పుడు స మాచారం, కథనాల వల్ల వచ్చే ముప్పును గుర్తించి ఆదిలోనే వాటిని పరిహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుంటారని, జర్నలిస్టులు వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి జనసామాన్యానికి చేరకుండా నిలువ రిస్తున్నారని కొనియాడారు.
మంగళవారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ‘‘కౌంటెరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ తెలుగు టీవీ జర్నలిస్ట్స్’’అన్న అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో లార్సెన్ మాట్లాడారు. అనంతరం జర్నలిస్టులకు సర్టిఫికె ట్లు అందించారు. ‘‘తప్పుడు సమాచారాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తులు తాము ఎన్నుకున్నవారి గురించి చాలా అంశాలు మాట్లాడుకుంటారు. వాదించుకుంటారు. వారిని బాధ్యులుగా చేస్తారు.
తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంటే ఇదంతా సాధ్యం కాదు’’అని లార్సెన్ వివరించారు. ఉస్మాని యా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ మాట్లాడుతూ తప్పుడు సమాచారం విద్యావ్య వస్థలో సృష్టించిన సమస్యలను ఏకరవు పెట్టారు. జర్నలిజం విభాగం ప్రొఫెసర్, ఈ ప్రాజెక్టు సమన్వయకర్త స్టీఫెన్‌సన్ కోహీర్ మాట్లాడుతూ హైబ్రిడ్ పద్ధతిలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు నిర్వహించామని తెలిపారు. తప్పుడు వార్తలను గుర్తించడం ఎలా? నిర్ధారించుకోవడం ఎలా? ఫ్యాక్ట్ చెక్‌కు ఉపయోగపడే టూల్స్, టెక్నిక్‌లు, సమాచారాన్ని సేకరించడం వంటి అంశాల్లో మెళకువలను నేర్పించామని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment