ప్రభుత్వ పాఠశాలను రక్షించేందుకు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పొరకలపల్లి గ్రామస్తులు నడుంకట్టారు.
ప్రభుత్వ పాఠశాలను రక్షించేందుకు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పొరకలపల్లి గ్రామస్తులు నడుంకట్టారు. మంగళవారం గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, వార్డుసభ్యులు, చైతన్యయూత్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యమం కూడా ఉండడంతో గ్రామంలోని బడిఈడు పిల్లలందరినీ సర్కారు బడిలోనే చదివించాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని, ఉల్లంఘించినవారికి రూ.5వేల జరిమానా విధించాలని సమష్టి నిర్లయం తీసుకోవడమే కాకుండా అగ్రిమెంటు పత్రం రాసుకొని దానిపై అందరూ సంతకాలు చేశారు.