
ఆంగ్లానికి ఆదరణ
ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పెరిగిన ప్రవేశాలు
ఒకటో తరగతిలో కొత్తగా చేరిన 12 వేల మంది విద్యార్థులు
మోడల్‌స్కూళ్లలో ఐదు నుంచి తొమ్మిదో క్లాస్ వరకు సీట్లు ఫుల్
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అనాసక్తి
మారుమూల ప్రాంతాల్లోనే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు నామమాత్రం
నల్లగొండ ; ప్రభుత్వ పాఠ శాలల్లో ఆంగ్ల మాధ్యమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లిష్ మీడియానికి అంకురార్పణ చేసిన నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఆంగ్ల మాధ్యమానికి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యాసంవత్సరం నుంచి మోడల్ స్కూళ్లలో సీట్ల సంఖ్యను పెంచారు. దీంతో పాఠశాలల్లో కూడా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సీట్లన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పదో తరగతి, ఇంట ర్మీడియట్‌లో మాత్రమే ఆశించిన స్థాయిలో ప్రవేశాలు జరగడం లేదు. మారుమూల ప్రాంతాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాలక ఆంగ్లానికి ఆదరణ చెందిన విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపక సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. బాలికలకు హాస్టల్ వసతి కల్పించి బాలురకు ఆ అవకాశం ఇవ్వకపోవడం తో ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా 12 వేల మంది..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 724 పాఠశాలలు బోధిస్తామని తీర్మానం చేశాయి. ఈ క్రమంలో కొత్తగా సుమారు 12,171 మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో ప్రవేశం పొందారు. మోడల్ స్కూళ్లలోనూ సీట్లు పెంచింది. మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఈ ఏడాది ఎక్కువ మందే పోటీ పడ్డారు.
పోటాపోటీగా ప్రవేశాలు...
మోడల్ స్కూళ్లలో అన్ని రకాల వసతులు ఉండటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం, బోధన సిబ్బంది కొరత లేకపోవడం వంటి అంశాలు విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడ్డాయి. ఆంగ్ల మాధ్యమానికి పెరుగుతున్న ఆదరణను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరానికి గాను ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతిలో 20 సీట్ల చొప్పున పెంచింది. ఇప్పటి వరకు 80 సీట్లు ఉన్న తరగతిలో వాటి సంఖ్య వందకు చేరింది. అదేవిధంగా ఇంటర్మీడియట్‌లో 80 నుంచి 160 సీట్లకు పెంచగా.. విద్యార్థుల ప్రవేశాలు పెరిగా యి. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 30 పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఒక్కో పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఐదు వందల చొప్పున 30 పాఠశాలల్లో 15 వేల సీట్లకుగాను 13,559 సీట్లు భర్తీ అయ్యాయి. 1,441 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నా యి. ఆరో తరగతిలో 205, ఏడో తరగతిలో 122, ఎనిమిదిలో 157 ఖాళీలు ఉండగా.. తొమ్మిదో తరగతిలో 326, పదో తరగతిలో 631 ఖాళీలు ఉన్నా యి. 36 పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులకు సం బంధించి సీట్లన్నీ భర్తీ అయ్యా యి. 16 పాఠశాల ల్లో ఎనిమిది, ఏడు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి సీట్లన్నీ భర్తీ కాగా.. టెన్‌తలో మాత్రం నిడమనూరు స్కూల్ మినహా మిగిలిన వాటిల్లో సీట్లు మిగి లాయి. ఇంటర్ అడ్మిషన్లు పరిశీలిస్తే.. 160 సీట్లు చొప్పున 30 పాఠశాలల్లో ఫస్టియర్‌లో 4,800 సీ ట్లకు 2,426 భర్తీ కాగా.. 2,374 మిగిలాయి. సెకం డియర్‌లో 4,800 సీట్లకు గాను 1,099 సీట్లు మా త్రమే భర్తీ అయ్యాయి. చందంపేట, తిప్పర్తి, ప ో చంపల్లి, మఠంపల్లి, వేములపల్లి, నడిగూడెం వం టి మారుమూల ప్రాంతాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.