Model schools
-
సర్కార్ బడికి ఉరి!
-
విజయవాడలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు
-
మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. టీజీటీ పోస్టులు జోన్ 1లో 17, జోన్ 3లో 23, జోన్ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్ 1లో 33, జోన్ 2లో 4, జోన్ 3లో 50, జోన్ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ‘హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్ సిగ్నేచర్ స్కాన్డ్ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్లోడ్ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీటీ కామర్స్ పోస్టులకు ఎం.కామ్ అప్లయిడ్ బిజినెస్ ఎకనమిక్స్ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందాలను పూర్తిచేశాక నియామకాలు పొందుతారు. ఎప్పుడైనా డీఎస్సీ ద్వారా రెగ్యులర్ టీచర్లు నియామకమైతే వీరి కాంట్రాక్టు ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది. -
16 వరకు మోడల్ స్కూళ్లలో ప్రవేశాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 16 వరకు ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల అనంతరం అభ్యర్థులు తగిన సమాచారంతో ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ అప్లికేషన్లను ఆమోదిస్తారు. దరఖాస్తుదారుల జాబితాలను జిల్లాల వారీగా ఈ నెల 22న ప్రకటిస్తారు. అనంతరం పాఠశాల వారీగా సీట్ల కేటాయింపునకు జూన్ 24 నుంచి 28వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు. స్కూళ్ల వారీగా ఎంపిక జాబితాను జూన్ 30న ప్రకటిస్తారు. జూలై 1వ తేదీన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఇదిలా ఉండగా.. మోడల్ స్కూళ్లలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం తరగతికి 80 సీట్లుండగా.. ఇప్పుడు వాటిని 100కు పెంచారు. ఇంటర్(బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ)కు సంబంధించి ప్రస్తుతం 20 చొప్పున సీట్లుండగా ఇప్పుడు 40 చొప్పున పెంచారు. రిజర్వేషన్లను అనుసరించి ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఈ పాఠశాలల్లో పూర్తిగా ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. ఇతర వివరాల కోసం https://apms.apcfss.in ను సందర్శించాలి. ఇదే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. -
ఆదర్శ పాఠశాలల పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులకు ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సురేష్‌కుమార్ తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 282 పోస్టుల్లో 71 టీజీటీ కాగా 211 పీజీటీ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు http://cse.ap.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఇతర పద్ధతుల్లో వచ్చే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినా వారి దరఖాస్తులు తిరస్కరిస్తామన్నారు.] ఇలాంటివారు ఒకవేళ ఎంపికైతే.. వారి నియామకాన్ని రద్దు చేయడంతోపాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ వంటి చర్యలు చేపడతామని హెచ్చరించారు. అభ్యర్థులు తాజా పాస్‌పోర్ట్ సైజ్ఫొటో, సంతకాన్ని స్పష్టంగా కనిపించేలా ఆన్లైన్ దరఖాస్తులో అప్లోడ్ చేయాలన్నారు. స్పష్టంగా లేని దరఖాస్తులను తిరస్కరిస్తామని చెప్పారు. పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. నోటిఫికేషన్ జారీ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా పేర్కొన్నారు. ఎంపిక ఇలా.. అభ్యర్థుల ఎంపికకు జోన్ల వారీగా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీలు) చైర్మన్లుగా.. జోన్ హెడ్‌క్వార్టర్ డీఈవో, ఆదర్శ పాఠశాలల అసిస్టెంట్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే పీజీటీలకు రూ.31,460, టీజీటీలకు రూ.28,940 చొప్పున నెలవారీ మినిమం టైమ్ స్కేల్ కింద వేతనం ఉంటుందన్నారు. ఎలాంటి అలవెన్సులు ఉండవని చెప్పారు. మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలుంటాయని వెల్లడించారు. సంబంధిత అర్హతలు, మార్కుల శాతాన్ని అనుసరించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారికి మెరిట్ ర్యాంకుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉదాహరణకు వీరికి అర్హతల శాతం 55 ఉంటే దాన్ని 60 శాతంగా పరిగణిస్తారు. అభ్యర్థులకు ఒకే ర్యాంక్ వస్తే ముందు ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు ఒకే రకంగా ఉంటే జెండర్‌ను అనుసరించి ముందు మహిళలకు అవకాశం ఉంటుంది. వయసు, జెండర్ ఒకేలా ఉంటే ముందు ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎంపికైనవారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఏడాది ఒప్పందంతో నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎంపికయ్యాక ఆయా ఆదర్శ పాఠశాలలకు కేటాయించే టీచర్లతో ప్రిన్సిపాళ్లు రూ.100 నాన్ జ్యుడిషియల్ పేపర్లపై ఒప్పందం కుదుర్చుకోవాలి. కాగా, ఈ టీచర్ల వేతనాల చెల్లింపునకు రూ.2.60 కోట్లు అదనపు బడ్జెట్ కేటాయించాలని సురేష్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
ఆంధ్రప్రదేశ్: ‘మోడల్’ టీచర్లకు శుభవార్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 165 ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, టి.కల్పలతారెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు కె.శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
మోడల్ స్కూళ్లలో 282 టీచర్ పోస్టుల భర్తీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 282 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పోస్టుల భర్తీతో మోడల్ స్కూళ్లలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. వీటిల్లో 211 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులున్నాయి. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, అనుభవం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మెరిట్ అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే మోడల్ స్కూళ్లలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లకు పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సీట్లకు పెరిగిన డిమాండ్ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 2009లో మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 355 స్కూళ్లు ఏర్పాటు కాగా విభజన అనంతరం ఏపీకి 164 స్కూళ్లు కేటాయించారు. వీటిల్లో మొత్తం 91,520 సీట్లు అందుబాటులో ఉండగా 65,600 సెకండరీ ఎడ్యుకేషన్, 25,920 ఇంటర్ విద్యకు సంబంధించినవి ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో ఇంటర్ బోధన కొనసాగుతోంది. ప్రారంభంలో ఈ స్కూళ్లలో చేరికలు తక్కువగా ఉండగా ఇప్పుడు సీట్లకు డిమాండ్ పెరిగింది. డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కొంతమేర భర్తీ అయ్యాయి. ఇంకా 565 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో 282 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. -
AP: ఆ టీచర్ల పదవీవిరమణ వయసు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 164 మోడల్ స్కూళ్లలో పనిచేస్తోన్న ప్రిన్సిపల్స్, టీచర్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవీ విరమణ వయస్సు పెంచడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయ హనుమంతరావులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: కుప్పంలో భూప్రకంపనలు.. భారీ శబ్దాలు.. -
మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందించనున్నామని, ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 100 చెల్లించాలన్నారు. విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీ.జీవోవీ.ఐఎన్’ లేదా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. దరఖాస్తును ప్రింట్ తీసుకొని జూన్ 30వ తేదీలోగా సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు అందజేయాలన్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించబోరని చెప్పారు. -
ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు; ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్)లో టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3476 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులున్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు ►ప్రిన్సిపల్–175, వైస్ ప్రిన్సిపల్–116 ► పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్–1244 ► ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్–1944 రాష్ట్రాల వారీగా ఖాళీలు ఆంధ్రప్రదేశ్–117(ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 06, టీజీటీ 97), తెలంగాణ–262(ప్రిన్సిపల్11, వైస్ ప్రిన్సిపల్ 06, పీజీటీ 77, టీజీటీ 168), ఛత్తీస్‌గఢ్–514, గుజరాత్–161, హిమాచల్‌ప్రదేశ్–08, జార్ఖండ్–208, జమ్మూ అండ్ కాశ్మీర్–14, మధ్యప్రదేశ్–1279, మహా రాష్ట్ర–216, మణిపూర్–40, మిజోరం–10, ఒడిశా–144, రాజస్తాన్–316, ఉత్తరప్రదేశ్–79, ఉత్తరాఖండ్–09, సిక్కిం–44, త్రిపుర–58. ఈఎంఆర్ఎస్ గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్). ప్రస్తుతం 17 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 3476 పోస్టుల ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతోపాటు ప్రస్తుత ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో వీరిని భర్తీచేసే అవకాశం ఉంది. విద్యార్హతలు ► ప్రిన్సిపల్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ, బీఎడ్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ► వైస్ ప్రిన్సిపల్: వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, బీఈడ్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ► పీజీటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి. ► టీజీటీ : టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ, సంబంధిత సబ్జెక్టుల్లో సీటెట్/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్ ఉండదు. ఎంపికకు సంబంధించిన అర్హత పరీక్షలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021 ► పరీక్ష తేదీ: జూన్ మొదటి వారంలో ► వెబ్సైట్: https://tribal.nic.in/ -
తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి జూన్ 5న, 6వ తరగతిలో ప్రవేశాల కోసం అదే నెల 6వ తేదీన రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.75, మిగతా వారు రూ.150 చెల్లించాలని వెల్లడించింది. మరిన్ని వివరాలు తమ వెబ్సైట్ (http://telanganams.cgg.gov.in)లో పొందవచ్చని తెలిపింది. దరఖాస్తుల ను ఏప్రిల్ 15 నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలు.. 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు 7 నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్: జూన్ 1 నుంచి జూన్ 6 వరకు 7 నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష: జూన్ 5 ఆరో తరగతిలో ప్రవేశాలకు పరీక్ష: జూన్ 6 ఫలితాల ప్రకటన, సంబంధిత ప్రిన్సిపాళ్లకు మెరిట్ జాబితాల అందజేత: జూన్ 14 విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు, జాయింట్ కలెక్టర్ల ఆమోదం: జూన్ 15, 16 సంబంధిత మోడల్ స్కూళ్లలో ఎంపికైన విద్యార్థుల జాబితాల డిస్ప్లే: జూన్ 17 సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు: జూన్ 18 నుంచి జూన్ 20 వరకు తరగతులు ప్రారంభం: జూన్ 21 -
మోడల్ స్కూళ్లకు ఫ్రాన్స్ చేయూత
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ తీర్చిదిద్దిన మోడల్ కార్పొరేషన్ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రాన్స్ ప్రభుత్వం.. మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 44 కార్పొరేషన్ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేట్ అండ్ సస్టైన్ (సిటీస్) పేరుతో ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల నిధులు సమకూర్చింది. ఈ నిధులతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలపై సిటీస్ బృందం ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జీవీఎంసీ అధికారులతో సమావేశమైంది. వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. సిటీస్ చాలెంజ్ పేరుతో ఏడాది కిందట జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్ట్‌లు ఎంపికవ్వగా.. ఇందులో కార్పొరేషన్ పాఠశాలలను ఆధునికీకరించిన జీవీఎంసీ ప్రాజెక్ట్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీనికి ఫిదా అయిన ఫ్రాన్స్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. -
ఏపీ మోడల్ స్కూల్ల్లోప్రవేశానికి నోటిఫికేషన్
వైఎస్ఆర్ జిల్లా,వల్లూరు: ప్రస్తుత సమాజంలో చదువుకు విలువ పెరిగింది. జీవితంలో చదువు ఎంత అవసరమైనదో ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. పేద, ధనిక వర్గాలకు అతీతంగా తమ పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము తిన్నా తినకపోయినా తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చేర్చడానికి ఉత్సాహం చూపుతున్నారు. పేదలకు ఆసరాగా మోడల్ స్కూల్స్ :కార్పొరేట్ చదువులు సామాన్య, మధ్య తరగతి వర్గాల నడ్డి విరుస్తున్న తరుణంలో 2013– 14 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ మోడల్ స్కూల్స్ విద్యార్థుల పాలిట వరంగా మారాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 6 వతరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో విద్యను అందించడమే ధ్యేయంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అన్ని వర్గాల వారికి నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడంలో ఆదర్శంగా నిలుస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ప్రవేశానికి పోటీ తీవ్రం మోడల్ స్కూళ్లలో ప్రవేశం పొందడానికి పోటీ తీవ్రంగా ఉంది. దీనికి తోడు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా వివిధ సౌకర్యాలతోపాటు, సుశిక్షితులైన ఉపా««ధ్యాయులు అందుబాటులో ఉండడంతో ఈ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ సీటు సాధించడానికి ముందుగానే తర్ఫీదు ఇచ్చి పిల్లలను సిద్ధం చేస్తున్నారు. దరఖాస్తుకు తుది గడువు ఫిబ్రవరి 7 :2020– 21 విద్యా సంవత్సరంలో 6 వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేయడం ఇలా.. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ.50 లను ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు నెట్ బ్యాంకింగ్ లేక క్రెడిట్ కార్డు లేక డెబిట్ కార్డులను ఉపయోగించి గేట్‌వే ద్వారా ఫీజు చెల్లిస్తే వారికి ఒక జనరల్ నంబరును కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ సెంటర్లో ఆన్లైన్లో దరఖాస్తును చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆయా కేంద్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతిభను అనుసరించి రిజర్వేషన్ మేరకు సీట్లను కేటాయిస్తారు. పరీక్ష విధానం ఇలా.. దరఖాస్తు చేసుకున్న వారికి ఇంగ్లిషు, తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులలో ఒక్కో దానిలో 25 మార్కుల చొప్పున 100 మార్కులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిషు మీడియంలో 5 వ తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఓసీ, బీసీలు కనీసం 35 మార్కులు, ఎస్సీ , ఎస్టీలు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. జిల్లాలోని ఏపీ మోడల్ స్కూళ్లవే.. వల్లూరు, ఖాజీపేట, కాశినాయన, పుల్లంపేట, పెనగలూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెంలలో ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అర్హతలు ఇవే .. ♦ 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2008 సెప్టెంబర్ 01 నుంచి 2010 ఆగస్టు 31 మధ్యన జన్మించిన ఓసీ, బీసీ విద్యార్థులు, 01– 09–2006 సెప్టెంబర్ 01 నుంచి 2010 ఆగస్టు 31 మధ్య జన్మించిన ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు అర్హులు. ♦ వీరు జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018– 19, 2019– 20 విద్యా సంవత్సరాల్లో నిరంతరాయంగా చదువుతూ వచ్చే విద్యా సంవత్సరానికి ఆరవతరగతికి ప్రమోషన్ కల్పించడానికిఅర్హత కలిగి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోవాలి ఏపీ మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 7వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా నిబంధనలను అనుసరించి సీట్లు కేటాయిస్తాం. – దిలీప్ కుమార్, ప్రిన్సిపల్, ఏపీ మోడల్ స్కూల్ -
ఇద్దరు ‘ఆదర్శ’ ఉపాధ్యాయుల సరెండర్
సాక్షి, గుడిహత్నూర్(ఆదిలాబాద్) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ఇన్చార్జి ప్రిన్సిపాల్ సైఫుల్లాఖాన్, అదే పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ గౌడ్లను సరెండర్ చేస్తూ డీఈవో రవీందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అశ్విని.. ప్రిన్సిపాల్ సైఫుల్లాఖాన్ తనపై దాడి చేశాడని గత మూడు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించి అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో విచారణ జరిపించారు. విచారణ పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సైఫుల్లాఖాన్‌ను ఆయన మాతృ పాఠశాల ఆసిఫాబాద్ మోడల్ స్కూల్‌కు సరెండర్ చేయగా సత్యనారాయణగౌడ్‌ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేశారు. వివాదాలకు బీజం పోసిన సత్యనారాయణ గౌడ్! కరీంనగర్ జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో విధులు నిర్వహించి అవినీతి అక్రమాలకు పాల్పడి పనిష్మెంట్పై ఇక్కడికి బదిలీపై వచ్చిన సత్యనారాయణ గౌడ్ వచ్చిన అనతికాలంలోనే పాఠశాలలో అనేక వివాదాలకు కారణమైనట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. పాఠశాలలో జరిగే చిన్నచిన్న పొరపాట్లను వేలెత్తి చూపి కాంట్రాక్టు సిబ్బందిని మచ్చిక చేసుకొని వర్గాలుగా చీల్చి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైఫుల్లాఖాన్ తప్పించి తానే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాలని వివాదాలు సృష్టించినట్లు తెలిసింది. అదనపు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేపట్టిన సుధీర్ఘ విచారణలో తెరవెనుక ఉండి వివాదాలు సృష్టిస్తున్న సత్యనారాయణ గౌడ్ తెరముందుకు వచ్చాడు. దీంతో అతనని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేయడంతో ఆదర్శ పాఠశాల కథ సుఖాంతం అయింది. -
సెలవులొస్తే జీతం కట్!
సాక్షి, బోథ్(ఆదిలాబాద్) : వారంతా ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే బోధిస్తారు. కాని వేతనా లు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుకుంటున్నట్లు వారు అందుకోరు. సెలవులు వ స్తే ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో ఎ లాంటి మార్పు ఉండదు. కాని హవర్లీ టీచర్లకు మాత్రం ఎటువంటి వేతనాలు ఉండ వు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. సమాన పనికి సమాన వేతనాలను అందించాలని వారు డిమాండ్చేస్తున్నారు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం గంటకు వేతనంగా నిర్ణయించి ఉపాధ్యాయులను నియమించింది. మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యాబోధన ఉంటుంది. వీరికి ప్రతి గంటకు రూ.140 చెల్లిస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయులు కనీసం ఐదు క్లాసులు బోధిస్తారు. ఈ లెక్కన ఉపాధ్యాయులకు ప్రతి రోజు రూ.700 వరకు వేతనం ఉంటుంది. పాఠశాలకు సెలవు నేపథ్యంలో తరగతులు ఉండవు. కాబట్టి వీరికి వేతనాలు అందవు. నెలలో 30 రోజుల్లో నాలుగు ఆదివారాలు, ఒక రెండవ శనివారం పో నూ 25రోజులు పనిదినాలు ఉంటాయి. అంటే సగటున వీరు రోజుకు రూ.700ల వేతనా లను పొందితే 25 రోజులకు రూ.17 వేలా 500 రావాలి. కానీ ప్రభుత్వం నెలకు కేవలం 100గంటల వేతనాలను మాత్రమే చెల్లిస్తోంది. అంటే గరిష్టంగా వీరు రూ.14 వేలు మాత్రమే వేతనాలను పొందుతున్నారు. అది కూడా సెలవులు లేకపోతేనే.. అదే సెలవులు వస్తే వారి జీతాల్లో కోతే. నెలలో మరిన్ని సెలవులు వస్తే ఆ రోజుల్లో వేతనాలను కోల్పోతారు. దీంతో సగటున తమకు 12 వేల రూపాలయ వరకు మాత్రమే అందుతున్నాయని వాపోతున్నారు. అక్టోబర్‌లో అన్నీ సెలవులే.. అక్టోబర్ నెలలో దసరా సెలవులు రావడం, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 19 వరకు సెలవులు పొడిగించడంతో ఒక్క రో జు కూడా పాఠశాలలు పని చేయలేదు. దీంతో వారికి ఈ నెల వేతనాలు అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో 31రోజులుండగా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. 21వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆదివారం, దీపావళికి రెండు రోజుల సెలవులు పోనూ మరో ఆరు రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు అక్టోబర్ నెలలో కేవలం ఆరు రోజుల వేతనాలను మాత్రమే అందుకోనున్నారు. అంటే కేవలం రూ.4200 మాత్రమే వారికి అందుతాయి. పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వకుండా హవర్టీ బేస్డ్ ఉపాధ్యాయులను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని హెచ్‌బీటీ ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ బతుకులు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలను తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 162 మంది ఉపాధ్యాయులు హవర్టీ బేస్డ్ టీచర్లుగా కొనసాగుతున్నారు. వీరు సగటుగా రూ.12 వేల నుంచి 13 వేల వరకు వేతనాలను పొందుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 1500 మంది హవర్లీ బేస్డ్ టీచర్లుగా పనిచేస్తున్నారని, వారికి సెలవుల్లో వేతనాల్లో కోతలను విధించరాదని ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యాశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ లింగయ్యను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. సమాన పనిక సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. సెలవులతో సంబంధం లేకుండా వేతనాలివ్వాలి మోడల్ స్కూళ్లో పనిచేసే హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయులకు సెలవులకు సంబంధం లేకుండా వేతనాలను అందజేయాలి. సెలవుల్లో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సెలవులతో సంబంధం లేకుండా సిలబస్‌ను పూర్తి చేసే భారం తమదే అయినప్పుడు వేతనాలను కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చౌహాన్ గోవింద్, హవర్లీ బేస్డ్ టీచర్ల సంఘం (మోడల్ స్కూల్), జిల్లా అధ్యక్షుడు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలి గంటకు వేతనం కాకుండా ప్రతీ నెల ఫిక్స్డ్ వేతనాలను అందించాలి. శ్రమ దోపిడీకి గురవుతున్నాం. సమాన పనికి సమాన వేతనాలను అందించాలి. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పని చేస్తున్నాం. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలను అందించాలి. సెలవులు వస్తే మా వేతనాల్లో కోతలు ఉంటున్నాయి. – పాలెపు గణేశ్, హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయుడు -
ఇక హుషారుగా మో‘డల్’ స్కూళ్లు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని మోడల్ స్కూళ్లు త్వరలోనే పాఠశాల విద్యలో విలీనం కానున్నాయి. ప్రభు త్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల కష్టాలు తీరనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను రెసిడెన్షియల్ తరహాలో అందించాలని దివంగ త ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి యోచించి మోడల్ స్కూల్ వ్యవస్థకు రూపక ల్పన చేయించారు. ఆయన మరణానంతరం దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో 2013 వరకు ప్రారంభానికి నోచుకోలేదు. అటు తరువాత మోడల్ స్కూళ్లు ప్రారంభం కాగా ప్రత్యేక సొసైటీ ద్వారా వీటిని నిర్వహింపజేశా రు. దీని వలన పాఠశాలలపై ఎవరి అజమాయిషీ లేకుండా పోయింది. సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ కూడా లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా పీఆర్సీ, డీఏ వం టివి అమలుకాకపోవడం, జీతా లు సకాలంలో అందకపోవడం వంటి సమస్యలు ఉండేవి. దీని వలన విద్యాశాఖ నుంచి కొంద రు మోడల్ స్కూళ్లకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చేశారు. అటు తరువాత భర్తీలు లేకపోవడంతో ప్రతి ఏటా కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయులను నియమించుకొని బోధన సాగించేవారు. వీరికి కూడా ఏళ్ల తరబడి వేతనా లు పెండింగ్ ఉండడంతో ఈ పోస్టులకు డిమాండ్ లేకుండా పోయింది. విద్యా శాఖలో విలీన నిర్ణయంతో జిల్లాలో 132 మం ది రెగ్యులర్ ఉపాధ్యాయులకు మేలు జరగనుంది. సకాలంలో జీతాలు అందుతాయని 90 మంది కాంట్రాక్టు టీచర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ.. గతంలో విద్యాశాఖలోని ఏడీ స్థాయి అధికారిని మోడల్ స్కూల్ ఇన్చార్జిగా నియమించగా ఆయన కేవలం అడ్మిషన్లను పర్యవేక్షించేందుకు మాత్రమే పరిమితమయ్యేవారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రతి జిల్లాలో ను మోడల్ స్కూళ్ల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడల్ స్కూళ్లపై అధ్యయనం చేయించిన ముఖ్యమంత్రి మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర అధికారులు అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యా రు. శ్రీకాకుళం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు ఉన్నా యి. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులను బోధిస్తుండగా ఒక్కో స్కూల్లో 600 నుంచి 700 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అన్ని స్కూళ్లలో హాస్టళ్లు ఏర్పా టు చేయాల్సి ఉండగా 8 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు వసతి గృహాలను నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం మోడల్ స్కూళ్లపై తీవ్ర వివక్ష చూపింది. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాలు కల్పించలే దు. వీరు ఇప్పటికీ ఐఆర్‌కు నోచుకోలేదు. ప్రస్తు తం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖలోకి విలీనం చేస్తే సర్వీసుకు సంబం ధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేలా అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం.. మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని ముఖ్య మంత్రి నిర్ణయించడం హర్షణీయం. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా రు. వీటిని పరిష్కరించే నాథు డే కరువయ్యారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డికి సమస్యలను వివరించాం. అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం. – బీవీ సత్యనారాయణ, మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
‘మోడల్’కు మహర్దశ
గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లకు మహర్దశ పట్టనుంది. పాఠశాల విద్యతో సంబంధం లేకుండా ప్రత్యేక సొసైటీ ద్వారా నిర్వహిస్తూ వచ్చిన మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిచాలనే ఆశయంతో మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కార్యాచరణకు రూపాంతరంగా వీటిని 2013లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ విద్యాబోధన అందించేందుకు ఉద్దేశించిన మోడల్ స్కూళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన లభించడంతో పాటు ప్రతి ఏటా సీట్లను భర్తీ చేయడంలో డిమాండ్ నెలకొంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా 165 మోడల్ స్కూళ్లు ఉండగా, జిల్లాలో 14 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ఆరుగురు ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 2,113 రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, అదనంగా మంజూరు చేసిన 990 పోస్టుల్ని ప్రభుత్వం డీఎస్సీ–2018 ద్వారా భర్తీ చేయనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 14 మోడల్ స్కూళ్లకు గానూ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ విధంగా ఒక్కో పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ 700 మంది చొప్పున విద్యార్థులు చదువుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులకు హాస్టల్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. వివక్ష చూపిన టీడీపీ ప్రభుత్వం మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులపై టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపింది. రెగ్యులర్ ప్రాతిపదికన నియమించిన ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ ఉద్యోగోన్నతులు, సాధారణ బదిలీలు వర్తింప చేయలేదు. కారుణ్య నియామకాలు, హెల్త్‌కార్డులతో పాటు మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి సదుపాయాలు వీరికి లేవు. దీంతో పాటు ఐఆర్ సైతం అమలుకు నోచుకోలేదు. విద్యాశాఖలో ఉద్యోగులుగా ఉన్నప్పటికీ వేతనం మినహా ఇతర ఎటువంటి ప్రయోజనాలు లేకుండా కాలం వెళ్లదీస్తున్న మోడల్ స్కూళ్ల టీచర్లు, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత టీడీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న పరిస్థితులు లేవు. రాష్ట్రస్థాయిలో ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోయింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రారంభించిన మోడల్ స్కూళ్లకు తొలి రెండేళ్లు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లభించగా, తరువాత కేంద్రం వీటి నిర్వహణ నుంచి పక్కకు తప్పుకుంది. మోడల్ స్కూళ్లను మూసి వేసే ఆలోచన చేసిన టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుందని భావించి మిన్నకుంది. పాదయాత్ర హామీతో విలీనానికి నాంది వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో మోడల్ స్కూళ్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలసి సమస్యల్ని చెప్పుకున్నారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా’మని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత విద్యాశాఖలో విలీనం చేసేందుకు నిర్ణయించారు. సర్వీసు సమస్యలు లేకుండా కసరత్తు మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న మూడు వేల మంది ఉద్యోగులను పాఠశాల విద్యాశాఖలోకి విలీనం చేయడం ద్వారా సర్వీసు పరమైన సమస్యలు తలెత్తకుండా ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విద్యాశాఖ గొడుగు కింద ఉన్న జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల మాదిరిగానే మోడల్ స్కూళ్లను తీసుకువచ్చి, ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌కు అనుగుణంగా ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలో విధి, విధానాల రూపకల్పన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సీఎం నిర్ణయం ఆనందదాయకం మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసింది. గతంలో నాలుగు నెలలు పాటు వేతనాలు లేక ఉపాధ్యాయుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు గురైన సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా సమస్యపై స్పందించి, ప్రభుతాన్ని నిలదీశారు. అధికారంలోకి రాగానే అన్ని సదుపాయాలు కల్పిస్తామని, పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టడం ఆనందదాయకం.–కె. హేమలత, జిల్లా అధ్యక్షురాలు,ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ -
అన్నింటా మోడల్
ఆదర్శ పాఠశాలలు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నాయి... విద్యార్థుల ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్నాయి...కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా సౌకర్యాలు ఉన్నాయి... సుందరమైన భవనాలు, విశాలమైన ఆటస్థలాలు సొంతం... ఆధునిక వసతి గృహాలు అదనపు సౌకర్యం.. అన్ని సదుపాయాలు ఉచితం...ఇదే విద్య, సౌకర్యాలను ప్రైవేటు విద్యా సంస్థల్లో పొందాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి.. ఇంకెందుకు ఆలస్యం మోడల్ స్కూళ్లలో చేరి.. డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు ఉత్తమ విద్యను అందుకోండి. ప్రత్యేకతలు • విశాలమైన తరగతి గదులు, ఆటస్థలంతోపాటు గ్రంథాలయ సౌకర్యం • ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉంటుంది. • అర్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో బోధన • చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ • ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం • మల్టీమీడియం, హెల్త్‌కేర్, బ్యూటీ కేర్ బ్యాంకింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు పలు పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. • ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ సాక్షి, కడప ఎడ్యుకేషన్ : గ్రామీణ పిల్లలకు సైతం ఆంగ్ల మాధ్యమం, కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజం వేశారు. 2012కు కార్యరూపం దాల్చింది. 2013 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బోధన అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ చదివే వారికి ఉచిత భోజనంతోపాటు వసతి కల్పిస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పుస్తకాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో పది ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఆరవ తరగతిలో చేరిన విద్యార్థి ఇంటర్ వరకు అక్కడే చదువుకోవచ్చు. అత్యాధునిక వసతులు మోడల్ స్కూల్స్ భవనాలను ఆధునిక వసతులతో, కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. విశాలమైన స్థలంలో, ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పారు. అత్యాధునిక ల్యాబ్స్, రీడింగ్ క్లాస్ కోసం కుర్చీలు, టేబుళ్లు, లైట్లు, ఫ్యాన్లు తదితరాలు ఏర్పాటు చేశారు. స్నానపు గదులు, మరుగుదొడ్ల సౌకర్యాలు బాగున్నాయి. ప్రవేశం ఇలా.. ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే సౌకర్యం ఉంది. ఇందులో ఏటా 6వ తరగతి, ఇంటర్మీ డియెట్కు ప్రవేశాలు కల్పిస్తారు. 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లను కూడా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. 6వ తరగతిలో చేరే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులకు 100కు 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 100కు 35 మార్కులు వస్తే అర్హులుగా పరిగణిస్తారు. ఇందులో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన అడ్మిషన్లు నిర్వహిస్తారు. ప్రతి ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 80 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. 6వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్‌కు 80 సీట్లు ఉంటాయి. సీట్ల రిజర్వేషన్లు 6వ తరగతికి సంబంధించి మొత్తంగా 80 సీట్లు ఉంటాయి. ఇందులో 26 సీట్లు ఓసీ జనరల్, 13 సీట్లు బాలికలకు, 8 ఎస్సీ జనరల్, 4 సీట్లు ఎస్సీ బాలికలకు, 3 సీట్లు ఎస్టీ జనరల్, 2 సీట్లు ఎస్టీ బాలికలకు, బీసీఈ ఒకటి, మిగతా 23 సీట్లు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఇంటర్‌కు సంబంధించి 80 సీట్ల చొప్పున ప్రతి పాఠశాలలో ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు 20 సీట్ల చొప్పున ఉంటాయి. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి పట్టే సమయాన్ని బట్టి.. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇందులో 6వ తరగతి, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ముమ్మరంగా నమోదు అవుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో.. ఎటువంటి ఫీజులు లేకుండా 6 నుంచి ఇంటర్ వరకు ఆంగ్లమాధ్యమంతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. 9 నుంచి ఇంటర్ వరకు బాలబాలికలకు ప్రత్యేక వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ వారు మాత్రం పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యూనిఫాం, పుస్తకాలు 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు యూనిఫాం ఉచితంగా ఇస్తారు. 6 నుంచి ఇంటర్ వరకు పుస్తకాలను ఉచి తంగా అందజేస్తారు. హాస్టల్లో లేని విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆధునిక ల్యాబ్స్ సైన్స్ ప్రయోగశాల (ల్యాబ్)లతోపాటు ప్రయోగాత్మకంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో విలువైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో దోహద పడతాయి. ప్రతి పాఠశాలలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పది మోడల్ స్కూల్స్‌కు గాను తొమ్మిదింటికి మంజూరు కాగా.. సంబేపల్లెలో మాత్రం సొంత భవనం లేకపోవడంతో మంజూరు కాలేదు. ఈ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్, టెలిస్కోప్, రోబోటింగ్ పరికరాలతోపాటు నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడే ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించి విద్యార్థులు నూతన ఆవిష్కరణలను రూపొందించే అవకాశం ఉంది. కార్పొరేట్, ప్రైవేటులో.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో భారీగా ఫీజులు, అంతంత మాత్రంగానే మౌలిక వసతులు ఉంటాయి. వేలకు వేలు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఇక హాస్టల్ సౌకర్యం కావాలంటే భారీగా డబ్బులు వెచ్చించాల్సిందే. ఇరుకైన తరగతి గదులు, వీటితోపాటు ప్రతిభావంతులకు బోధన ఒకలా.. ప్రతిభ లేని వారికి మరోలా ఉంటుంది. సరైన ల్యాబ్ సౌకర్యాలు, లైబ్రరీ వసతులు ఉండవు. వీటన్నింటి కంటే ఆటపాటలు అసలుండవు. నిత్యం ఒత్తిడితో కూడిన బోధనలు. వీటన్నింటి మధ్య విద్యార్థులు నలిగిపోతూ నిత్యం మానసిక ఒత్తిడితో కూడిన చదువులు సాగించాల్సిన పరిస్థితి. విద్యార్థుల్లో మనోవికాసం తగ్గి ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్న విషయాలకు కూడా ఆందోళన చెంది.. మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సంబంధిత విషయాల్లో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. జిల్లాలో.. జిల్లాలో పది ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఖాజీపేట, కాశినాయన, వల్లూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, చిన్నమండెం, పుల్లంపేట, పెనగలూరు, సంబేపల్లె మండలాల్లో ఉన్నాయి. వీటిలో సంబేపల్లె పాఠశాలకు మాత్రం సొంత భవనం లేదు. స్థల సేకరణ సమస్య తలెత్తడంతో జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. మిగతా 9 పాఠశాలకు సొంత పాఠశాల భవనాలతోపాటు వసతి గృహాలు ఉన్నాయి. బోధన బాగుంది మోడల్ స్కూల్లో బోధన చాలా బాగుంది. ప్రణాళిక ప్రకారం చదివించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారు. ఆటలు ఆడిపిస్తారు. దీంతో చదువుతోపాటు ఆటలపైన కూడా పట్టు దొరుకుతుంది. – తస్నీమ్ ఫర్దీస్, 9వ తరగతి, వల్లూరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారు. చదువుతోపాటు నిత్యం పరీక్షలు నిర్వహిస్తారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో చాలా ఉత్సాహంగా చదవాలనిస్తుంది. – రయ్యన్ అహమ్మద్, 7వ తరగతి, వల్లూరు పదిలో పదికి పది పాయింట్లు గతేడాది పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాను. విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్టడీ అవర్స్ నిర్వహించి బాగా చదివిస్తారు. నిత్యం పరీక్షలు నిర్వహించి.. మార్కులు తక్కువ వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. – లిఖిత, పదో తరగతి పూర్వపు విద్యార్థిని, వల్లూరు పేదలకు వరం మోడల్ స్కూల్స్ పేద విద్యార్థులకు వరం. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతుంది. ఆటలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి వాటిలో ప్రవేశం కల్పిస్తారు. దీంతో విద్యార్థులు ఉల్లాసంగా చదువుకుంటారు. – దిలీప్‌కుమార్, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, వల్లూరు సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలి మోడల్ స్కూళ్లు అంగ్ల మాధ్యమంలో నడుస్తున్నాయి. దీంతోపాటు సీబీఎస్ఈ సిలబ స్ ప్రవేశపెడితే బాగుంటుంది. చాలా మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అన్ని మోడల్ స్కూళ్లలో మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి సీబీఎస్ఈ పెడితే బా గుంటుంది. – సురేష్‌బాబు, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, ఖాజీపేట నెలాఖరు వరకు అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్ స్కూల్స్‌లో ప్రస్తుతం 6, ఇంటర్మీడియట్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. పక్కాగా మెరిట్ ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేస్తున్నాం. ఈ నెలాఖరుకు సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తి అవుతుంది. – ఉష, అసిస్టెంట్ డైరెక్టర్, మోడల్ స్కూల్స్ అన్ని సౌకర్యాలు మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. కార్పొరేట్‌కు దీటుగా బోధన ఉంటుంది. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు ఆటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇటీవల ఒక్కొక్క పాఠశాలలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. దీంతో విద్యార్థులు నూతన పరిశోధనలు చేసుకునేందుకు అవకాశం ఉంది. – పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి, కడప -
మోడల్ స్కూళ్లలో జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదివే విద్యార్థులను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకూ సిద్ధం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్ ప్రకారం జూన్ 1 నుంచి మోడల్ స్కూళ్లలో ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి అన్ని మోడల్ స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రోజు గంటపాటు జాతీయ స్థాయి పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. ముందుగా సెకండియర్ విద్యార్థులకు ఈ శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఇక ప్రథమ సంవత్సర ప్రవేశాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ తొలి ఏడాదిలో 31 వేల సీట్లు ఉంటే 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులకు ఎక్కువగా.. ఎంఈసీకి తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన స్కూళ్లు ఉన్న చోట ఆ మండల పరిధిలోని గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని టీచర్లకు సూచించినట్లు తెలిపారు. -
నేటి నుంచి ‘మోడల్ కాలేజీ’ల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో మోడల్ జూనియర్ కాలేజీల్లో సీట్లను రెట్టింపు చేసిన (ఒక్కో కాలేజీలో 160 నుంచి 320కి పెంచింది) నేపథ్యంలో ప్రవేశాల కోసం ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మే 1 నుంచి ప్రవేశాలను చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో జూనియర్ కాలేజీ తరగతులు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో సీట్ల సంఖ్యను ఈసారి రెట్టింపు చేసింది. ఒక్కో గ్రూపులో 40 సీట్లు పెంపు ఇంటర్మీడియెట్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఇప్పటివరకు ఒక్కో గ్రూపులో 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి 40 సీట్లకు పెంచింది. దీంతో ఒక్కో కాలేజీలో సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో నాలుగు గ్రూపుల్లో 80 సీట్లు ఉండగా వాటిని 160కి, అలాగే ద్వితీయ ఏడాదిలో ఉన్న 80 సీట్లను 160కి పెంచేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఒక్కో జూనియర్ కాలేజీలో మొత్తం సీట్లు 160 నుంచి 320 కానున్నాయి. ఇప్పటివరకు మోడల్ జూనియర్ కాలేజీల్లో ఉన్న 31,040 సీట్లు 62,080కి పెరుగనున్నాయి. మే రెండో వారంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రిన్సిపాళ్లు ఆయా పిల్లలను మోడల్ జూనియర్ కాలేజీల్లో చేరేలా ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మోడల్ స్కూళ్లు/జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు చేరేలా, మోడల్ స్కూళ్ల ప్రాధాన్యాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. అలాగే ప్రిన్సిపాళ్లు తమ సిబ్బంది, సంబంధిత ఎంఈవో, పరిసరాల్లోని పాఠశాలల హెడ్మాస్టర్లతో సమన్వయం చేసుకుని ఆయా స్కూళ్లకు వెళ్లి మోడల్ కాలేజీల్లో చేరేలా సూచించాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొంది. కాలేజీల్లో చేరతామని ముందుకు వచ్చే విద్యార్థులను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆన్లైన్ ప్రవేశాలు కూడా చేపట్టనుంది. అనంతరం విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నట్లు విద్యాశాఖ వివరించింది. -
నిర్మాణం పూర్తి.. మిగిలింది ప్రారంభమే..
చంచల్‌గూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోను అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించనున్నారు. ఈమేరకు 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మోడల్ పాఠశాలల నిర్మాణాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో యాఖుత్పురా నియోజకవర్గంలోని కుర్మగూడ డివిజన్లో ఖాళీ ప్రభుత్వ స్థలంలో మోడల్ పాఠశాల నిర్మాణం పూర్తయింది. ఈ భవనానికి 2016లో అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత భవన నిర్మాణం పూర్తయింది. త్వరలో విద్యా శాఖ ఈ పాఠశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కబ్జా చెర వీడి...పాఠశాలగా మారి.. ఈ ప్రాంతంలోని ఐదెకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అప్పట్లో స్థానికుడొకరు ఆక్రమించేందుకు యత్నించాడు. సైదాబాద్ మండల రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకరంతో సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. కాగా ఇక్కడ 3000 చ.గ స్థలంలో పాఠశాల నిర్మించి, మరికొంత స్థలాన్ని ట్రాన్స్‌కో సంస్థకు అప్పగించారు. కాలేజీ నిర్మాణం అనుమానమే! ఇదిలా ఉండగా యాఖుత్పురా నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రభుత్వానికి విన్నవించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. కాగా కుర్మగూడ డివిజన్లో ఉన్న స్థలంలోనైనా కళాశాలల నిర్మాణం చేపట్టాలని అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి విన్నవించారు. కళాశాల నిర్మాణానికి సంబంధించి సీఎంతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్థలంలో విద్యుత్ సబస్టేషన్తో పాటు పాఠశాల నిర్మాణం పూర్తయిది. కాలేజీ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇక కాలేజీల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఆదర్శ’ ప్రవేశాలకు మంచి తరుణం
సాక్షి,బోథ్: గ్రామీణప్రాంతంలోని విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల విద్య అందించేందుకు ప్రభుత్వం మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసింది. అన్ని సౌకర్యాలతో భవనాలు నిర్మించింది. 2019–20 విద్యా సంవత్సరానికిగాను ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇంటర్నెట్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగిన ప్రక్రియను ఈనెల 8వ తేదీ వరకు పొడిగించారు. దీంతో విద్యార్థులకు మరో ఆరురోజులపాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఆంగ్ల మాధ్యమం వైపు విద్యార్థుల చూపు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం వైపు విద్యార్థులు అధిక సంఖ్యలో మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ఆంగ్లబోధన బోధిస్తున్నారు. దీంతో ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు మరింత ముందుకు వస్తున్నారు. దూరప్రాంత విద్యార్థులకు పాఠశాలలోనే ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండి చదువుకునేందుకు ప్రభుత్వం సదుపాయం కల్పిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో మరింత ఉత్సాహం చూపుతున్నారు. ప్రవేశాలకు జోరుగా ప్రచారం.. అనూహ్య స్పందన.. ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు, ఉచిత పుస్తకాలు, ఆంగ్లంలో నాణ్యమైన విద్య అందిస్తామని చెబుతున్నారు. వసతిగృహంలో ఉండి చదువుకునే విద్యార్థినులకు నెలవారీగా ప్యాకెట్ మనీ ఖర్చులు కూడా అందిస్తామని చెబుతున్నారు. జిల్లాలో పాఠశాలలు.. సీట్ల వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. బోథ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్, జైనథ్, నార్నూర్, బండారుగూడ (ఆదిలాబాద్)లో ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరోతరగతిలో రెండు సెక్షన్లు కలిపి వంద సీట్లు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 600 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఖాళీలు భర్తీ చేస్తారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి తేదీని ఈనెల 8 వరకు పొడిగించారు. ఇతర తరగతుల్లో కూడా ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆయా పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు అందుబాటులో ఉంచారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. రాత పరీక్ష ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఆరోతరగతిలోని వందసీట్లలో 50శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. 15 శాతం ఎస్సీలకు, ఆరుశాతం ఎస్టీలకు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన సీట్లలో బీసీ(ఏ) 7 శాతం, బిసీ(బి) 10 శాతం, బీసీ(సి) 1 శాతం, బీసీ(డి) 7 శాతం, బీసీ(ఈ) 4 శాతం కోటా ఉంటుంది. మొత్తం సీట్లలో బాలికలకు 33.3 శాతం ఉండేలా చూస్తారు. ఇంటర్నెట్లో దరఖాస్తులు ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు కచ్చితంగా ఇంటర్నెట్లో http://telanganams.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్‌పోర్టు సైజ్ఫొటో, డిజిటల్ సంతకం, చిరునామా, ప్రస్తుతం చదువుతున్న వివరాలు, ఆధార్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.50 చెల్లించాలి. ఏప్రిల్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12, మధ్యాహ్నం 2 గంటలకు 4 గంటల వరకు ఉంటుంది. మే 18న పరీక్షా ఫలితాలు విడుదల చేస్తారు. మే 27న ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల అర్హత జాబితా ప్రదర్శిస్తారు. మే 28 నుంచి 30 వరకు ప్రవేశాలు తీసుకుంటారు. -
ఆశ్రమ పాఠశాలలో యూనిసెఫ్ బృందం
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని వాంకిడి గిరిజన బాలికల ఉన్నత పాఠశాల, బంబార ఆశ్రమ ఉన్నత పాఠశాలలను శుక్రవారం యూనిసెఫ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న నవోదయ, ప్రథం, వేదిక్ మ్యాథ్స్, వందేమాతరం, దిశ మోడల్ స్కూల్ నిర్వహణ విషయాలు పరిశీలించారు. అనంతరం తరగతి వారీగా విద్యార్థులకు బోధన అంశాలపై, మధ్యాహ్న భోజన నిర్వహణ, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. యూనిసెఫ్ ఎడ్యుకేషనల్ చీఫ్ రాంచంద్రరావు బెగూర్ మాట్లాడుతూ గత నవంబర్‌మాసం నుంచి ఆయా పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని తెలిపారు. అప్పటి నుంచి కార్యక్రమాల తీరుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో వచ్చిన మార్పులపై వివరాల సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల పనితీరు బట్టి ఆయా పాఠశాలల్లో కావాల్సిన వసతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించడమే యూనిసెఫ్ ముఖ్యఉద్దేశమన్నారు. వారి వెంట యూనిసెఫ్ స్టేట్ ఎడ్యుకేషనల్ స్పెషలిస్టు సుకన్య, ఐటీడీఏ పీవో కష్ణ ఆదిత్య, డీటీడీవో దిలీప్‌కుమార్, ఏటీడీవో కనకదుర్గ, హెచ్ఎండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ఆసిఫాబాద్‌రూరల్: దిశ మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గిరిజన అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిష్ట్ర ఆదిత్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టివాగు కాలనీలో పైలెట్ ప్రాజెక్టు కింద నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మోడల్ స్కూల్‌ను సెంట్రల్ స్టేట్ యూనిసెఫ్ ప్రతినిధి రామ చంద్రన్, డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంగ్లిష్ మీడియం బోధన సౌకర్యాలు, హాజరు శాతం, మెనూ ప్రకారం భోజనం వంటి విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సామర్థాలు, నైపుణ్యాలు ప్రదర్శించడంతో అభినంధించారు. దీంతోపాటు గ్రామస్తులు పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, కమ్యూనిటీ భవనం నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, సీఆర్పీ రవీందర్ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
సమస్యల్లో ఆదర్శం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఆదర్శ(మోడల్) పాఠశాలలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఓ వైపు ఉపాధ్యాయుల కొరత వెక్కిరిస్తుంటే, మరోవైపు ఉన్న సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ‘మోడల్’ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. వసతితో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం రావడంతో గ్రామీణ విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటి ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆశయం బాగుంది కానీ, అమలులో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. చాలా స్కూళ్లలో అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యం అధికమవుతోంది. దీంతో పర్యవేక్షించాల్సిన అధికారులు కఠినత్వం ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగులు ఆడిందే ఆడ పాడిందే పాట చందంగా వ్యవహరిస్తున్నారు. ఉన్న వారిలో ఆధిపత్యపోరు ఉన్న ఉపాధ్యాయులైనా విద్యార్థుల బోధనపై దృష్టి సారిస్తున్నారంటే అదీలేదు. చాలా స్కూళ్లలో ఆధిపత్యపోరుతో విద్యార్ధుల చదువును గాలికొదిలేశారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, విడపనకల్లు, యాడికి, పుట్లూరు తదితర స్కూళ్లలో రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎంతసేపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం తప్ప చదువు గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలు ‘ఎవరికివారు యమునా తీరే’ చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన వార్డెన్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి పూట ఉండి విద్యార్థులతో చదివించాల్సి ఉంది. చాలాచోట్ల వార్డెన్లు రాత్రిపూట ఉండడం లేదు. ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీలు కూడా స్కూల్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాల్సి ఉన్నా.. చాలామంది జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల నుంచి రోజూ వెళ్లి వస్తున్నారు. తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య మోడల్ స్కూళ్లలో హాస్టల్ వసతి ఉంటుందని ప్రారంభంలో ప్రకటించడంతో విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తున్నారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత, ఉన్న ఉపాధ్యాయుల్లో సమన్వయం లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14వేల మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 10468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. మా దృష్టికి వచ్చాయి కొన్ని స్కూళ్లలో సిబ్బంది మధ్య చిన్నచిన్న మనస్పర్థలున్నట్లు మా దృష్టికీ వచ్చింది. ఈ ప్రభావం విద్యార్థులపై పడకూడదని హెచ్చరించాం. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాం. డీఎస్పీ పోస్టులు భర్తీకాగానే రెగ్యులర్ టీచర్లు వస్తారు. విద్యార్థులకు బోధన విషయంలో రాజీపడం. రాజకీయాలు చేస్తూ విద్యార్థుల చదువును నిర్లక్ష్యం చేసే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. – పుష్పరాజు, మోడల్ స్కూళ్ల ఏడీ -
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు రేపు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సోమవారం (21న) నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శనివారం షెడ్యూల్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 వరకు 6వ తరగతిలో, ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2–4 వరకు ప్రవేశ పరీక్షను జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. విద్యార్థులు ఏప్రిల్ 9–12 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తోంది. మే18కి ఫలితాలు సిద్ధం.. పాఠశాలల వారీగా ఫలితాలను మే 18 నాటికి సిద్ధం చేయాలని, మే 19 నుంచి 26వ తేదీలోగా జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 27న ప్రకటించనుంది. అదే నెల 28 నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, అకడమిక్ కేలండర్ ప్రకారం తరగతులను ప్రారంభించనుంది. విద్యార్థులు అడ్మిషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 50 చెల్లించాలని వివరించింది. దరఖాస్తుల ఫార్మాట్‌ను ఈ నెల 28 నుంచి తమ వెబ్సైట్ (telanganams.cgg.gov.in) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది. -
మోడల్ స్కూల్లో ఆకలికేకలు
చిత్తూరు , నిమ్మనపల్లె: మండలంలో రెడ్డివారిపల్లె సమీపంలోని మోడల్స్కూల్లో బుధవారం నుంచి మధ్యాహ్న భోజన పథకానికి మంగళం పాడారు. దీంతో ఇక్కడి 316 మంది విద్యార్థులు ఆకలితో అలమటించారు. కొందరు ఇళ్ల నుంచి క్యారియర్‌లో భోజనం తెచ్చుకున్నారు. వివరాలు...ఈ ఏడాది ఆగస్టు నుంచి నిమ్మనపల్లెకు చెందిన జి.వెంకటరత్నమ్మ, అగ్రహారానికి చెందిన జి.రాణి మోడల్స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా పని చేస్తున్నారు. వీరు పని చేసిన నెల రోజులకు సంబంధించి భోజన నిధులు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మూలాన వీరి బ్యాంకు ఖాతాకు కాకుండా గతంలో పనిచేసిన వారి ఖాతాకు రూ.31వేలు ఇటీవల జమ అయ్యాయి. ఇది ప్రస్తుత నిర్వాహకులకు తెలియలేదు. మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్‌కు సైతం ఇది తెలియకుండా విద్యాశాఖ అధికారులు జాగ్రత్తలు పడ్డారు. అంతేకాకుండా సెప్టెంబరు, అక్టోబరు మాసాలకు వచ్చే నిధులు సైతం సీఎఫ్ఎంఎస్లో పాతఖాతానే విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ చేశారు. దీంతో ప్రస్తుత నిర్వాహకులకు మూడు నెలల బకాయిలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే ప్రస్తుత నిర్వాహకులకు రూ.1.20 లక్షల బకాయిలు అందాల్సి ఉంది. తమకు రావాల్సిన నిధులు పక్కదారి పట్టించడంపై బాధితులు ఎంఈఓ రాజ గోపాల్‌ను సంప్రదించినా స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించాలని ఉచిత సలహా ఇచ్చారు. తమ కష్టార్జితాన్ని తేరగా కొట్టేస్తే పురుగులు పట్టిపోతారంటూ వారు శాపనార్థాలు పెట్టారు. ఈ వి షయమై వివరణ కోరేందుకు ఎంఈవోను ఫోన్లో పలుమార్లు ప్రయత్నించినా స్పందించలేదు. ఖాతా మార్పు వివరాలునాకు తెలియదు మధ్యాహ్న భోజన బకాయిలు జమ అవుతున్న ఖాతా వివరాలు నాకు తెలియవు. ఇక్కడ సమర్పించిన వివరాల్లో మదనపల్లె హెచ్డీఎఫ్సీ వివరాలు ఉండటం వాస్తవమే. ఖాతా మార్పు జరిగినప్పుడు మాకు విద్యాశాఖ అధికారులు తెలియజేయలేదు. తెలియకుండా మరో ఖాతాకు నిధులు జమ కావడంపై బాధితులు నా దృష్టికి తెచ్చారు.– ఎంవీ.ఎస్ఎన్.మూర్తి,ప్రిన్సిపల్, మోడల్‌స్కూల్ -
కాలేజీల్లో ‘భోజనం’ ఊసేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి చందంగా తయారైంది. రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన దీని అమలుపై ఇటీవల కద లిక రావడంతో ఇక కచ్చితంగా పథకం అమల్లోకి వస్తుందని అంతా భావించారు. మంత్రుల కమి టీ ఏర్పాటు, భోజనం అందించే సంస్థతో కమిటీ సంప్రదింపులు జరపడం, మంత్రులు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడటమూ జరిగిపోయింది. సమగ్ర ప్రతిపాదనలను ఈ నెల 6న సమర్పించాలంటూ కమిటీ పేర్కొనడంతో పథకం ప్రారంభం లాంఛనమే అనే స్థాయిలో హడావుడి జరిగింది. అయితే 2 వారాలైనా మధ్యాహ్న భోజనం అమలు ఊసే లేదు. దీంతో రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 2 లక్షల మంది విద్యార్థులకు, డిగ్రీ, మోడల్ స్కూల్స్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లోని మరో 1.6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుకు నోచుకుంటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆగస్టు 15 నుంచే పథకాన్ని అమలు చేసేలా తొలుత కసరత్తు జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రతిపాదనలకే పరిమితం... ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, డిగ్రీ, ఐటీఐ కాలేజీల్లో చదివే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో చదువుతున్న వారిలోనూ నిరుపేద విద్యార్థులు ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే అత్యధికం. అలాంటి వారికి మధ్యాహ్న భోజనం అందిస్తే కాలేజీకి రోజూ రావడంతోపాటు బాగా చదువుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అంతేకాదు పనులకు వెళ్లే విద్యార్థులను చదువు వైపు మళ్లించవచ్చని అనుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూడీసీ) అధికారులను సంప్రదించి పథకం అమలుకు ఖర్చు అంచనాల వివరాలను తెప్పించారు. పథకం పనులకు రూ. 42 కోట్లు అవసరం అవుతాయని పేర్కొంటూ టీఎస్‌డబ్ల్యూడీసీ ఫైలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా ఆర్ఐడీఎఫ్ నిధుల నుంచి ఆ మొత్తాన్ని కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు రోజువారీ నిర్వహణ, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఏటా రూ. 201 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేశారు. అంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని 2016 నుంచి ఈ ఫైలును పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల మళ్లీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టింది. ఇంటర్మీడియెట్‌తోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్, మోడల్ స్కూల్స్ విద్యార్థులకూ భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని భావించింది. ఇందులో భాగంగా భోజనం అందించే ఏజెన్సీతోనూ చర్చలు జరిపారు. దాదాపు 3.60 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందన్న వివరాలతో ప్రతిపాదనలను ఇవ్వాలని మంత్రుల కమిటీ కోరింది. ఆగస్టు 6వ తేదీన ఆ ప్రతిపాదనలను అందజేయాలని పేర్కొంది. కానీ ఆ తరువాత నుంచి భోజనం అమలు విషయంలో కదలిక లేకుండాపోయింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో పథకాన్ని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయవద్దని, వీలైనంత త్వరగా పథ«కాన్ని అమలు చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కాస్తయినా సిగ్గుండాలి!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘65 శాతం ఉత్తీర్ణతా?. కాస్తయినా సిగ్గుండాలి. చెప్పుకోవడానికి మీకెలాగుందో తెలీదుగానీ నాకైతే సిగ్గుగా ఉంది’ అంటూ ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి యల్లనూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సైన్స్ సెంటర్లో శుక్రవారం ఆయన మోడల్‌స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై సమీక్షించారు. 10/10 పాయింట్లు సాధించిన స్కూళ్ల ప్రిన్సిపాళ్లను అభినందించారు. యల్లనూరు మోడల్ స్కూల్ కేవలం 65 శాతం ఉత్తీర్ణత సాధించడాన్ని ఆర్జేడీ తీవ్రంగా పరిగణించారు. ప్రిన్సిపల్ ప్రసాద్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పిల్లలకు పాఠాలు చెబుతున్నారా, లేదా? అని మండిపడ్డారు. 10/10 పాయింట్లు వద్దులే కనీసం గట్టెక్కించలేకపోతే ఎలా?. స్కూల్లో టీచర్లు ఉన్నారా లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను మార్చాలంటూ మోడల్‌స్కూల్ ఏడీ పుష్పరాజును ఆదేశించారు. పాఠశాలకు వెళ్లి టీచర్ల మధ్య సమన్వయం ఉందా.. లేదా? ప్రిన్సిపాల్ పట్టించుకుంటున్నారా.. లేదా? లెసన్ ప్లాన్ చేశారా.. లేదా? విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆదర్శంగా ఉండాల్సిన స్కూళ్లు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? అని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 98 శాతం పేద విద్యార్థులే చదువుతుంటారని, వారికి కనీస చదువు చెప్పే బాధ్యత మనపై ఉందని అన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఐదేళ్లు చదువు చెబుతూ పదో తరగతి పాస్ చేయించలేకపోతే మనం ఏం సాధించినట్లు అని ప్రశ్నించారు. పిల్లల తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దని మందలించారు. ప్రారంభం నుంచి ప్రత్యేక ప్రణాళిక రచించుకుని అమలు చేస్తూ పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ జనార్దనాచార్యులు, డెప్యూటీ డీఈఓలు దేవరాజు, మల్లికార్జున, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి పాల్గొన్నారు. -
మో‘డల్’ పాఠశాలలు
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం జిల్లాలో 372 మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని గొప్పలు చెప్పింది. అయితే పేరు మార్పుతోనే సరిపెట్టి వదిలేయడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. పీలేరు: పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువగా ఉండడంతో జీఓ నెంబర్ 40 ద్వారా మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన వసతులతో కూడిన విద్య అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఈ–లెర్నింగ్, తరగతి గదుల్లో డెస్క్‌ల ఏర్పాటు, ప్రతి పాఠశాలకు ఏడాదికి రూ. లక్ష ప్రత్యేక గ్రాంటు, ఆకర్షనీయమైన తరగతి గదులు, ఇంగ్లిష్ బోధనకు ఉపాధ్యాయుడి నియామకం. ఇది ఆదర్శ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తామన్న సౌకర్యాలు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 372 ప్రాథమిక పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్పు చేశారు. అంతా అర్భాటమే.. ప్రాథమిక స్థాయిలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో ఇప్పటి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. విద్యార్థులకు లెక్కలు, ఈవీఎస్(ఎన్విరాన్మెంటల్ స్టడీస్) పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్భాటంగా మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పాఠశాలకు కూడా ప్రత్యేకంగా గ్రాంటు మంజూరు చేసిన దాఖలాలు లేవు. మరోవైపు తరగితి గదుల్లో డెస్కులు లేకపోవడంతో విద్యార్థులు కఠిక నేలపై కూర్చొనే విద్యనభ్యసిస్తున్నారు. ఇక పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఊసే లేదు. మోడల్ స్కూళ్లలో తమకు కార్పొరేట్ తరహా విద్యాబోధన అందుతుందని భావించిన విద్యార్థులకు నిరాశ తప్పడం లేదు. కార్పొరేట్ పోటీని తట్టుకుని నిలబడాలంటే ప్రభుత్వం చెప్పిన మేరకు ప్రతి మోడల్ స్కూల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇవి నిబంధనలు.. ♦ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ♦ ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలి ♦ కనీసం ఐదు మంది ఉపాధ్యాయులుండాలి ♦ లైబ్రరీ, డిజిటల్ తరగతులు ♦ మౌలిక వసతులు ♦ ఏడాదికి రూ.లక్ష ప్రత్యేక గ్రాంటు నమ్మకం సన్నగిల్లుతోంది ఆదర్శ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అంతంత మాత్రమే. పాఠ్యపుస్తకాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. దీని కారణంగా తల్లిదండ్రుల్లో ఆదర్శ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లుతోంది.–గంటా మోహన్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, చిత్తూరు లక్ష్యం గొప్పదైనా ఆచరణలో విఫలం విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య అందించాలన్న లక్ష్యం గొప్పదైనా ఆ మేరకు వసతులు కల్పించకుంటే ఎలా? చాలా పాఠశాలల్లో ఆటస్థలం, లైబ్రరీ, డిజిటల్ తరగతులు లేవు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అరకొరగా వస్తున్నాయి. దీనికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.–జి. రాధాకృష్ణ,యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీఓ ప్రకారం వసతులు కల్పించాలి మోడల్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో తరగతి గదులు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేయాలి. –మోడెం చెంగల్రాయుడు,హెచ్ఎం, మోడల్‌స్కూల్, పీలేరు -
‘ఆదర్శం’ పిలుస్తోంది
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ఆదర్శ(మోడల్) పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో ఉచితంగా విద్యనందించడమే ధ్యేయంగా 2013లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. జిల్లాలో తుమ్మిసి, గుడుపల్లె, నడిమూరు, బైరెడ్డిపల్లి, కురబలకోట, తంబళ్లపల్లె, మొలకలచెరువు, రామకుప్పం, కేవీపల్లె, కలకడ, పెద్దతిప్పసముద్రం(పీటీఎం), పెద్దమండ్యం, కేవీబీ పురం, ఎర్రావారిపాళ్యం, దిన్నెపల్లి, బి.కొత్తకోట, అడవినాథుని కుంటలో మోడల్ స్కూళ్లు ఉన్నాయి. సీట్ల కేటాయింపు ఇలా .. జిల్లాలో 17 పాఠశాలలుండగా, ఒక్కో పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపులో 80 మంది చొప్పున 1,360 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ పాయింట్లు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇంటర్ రెండో సంవత్సరంలో మిగిలిన సీట్లకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రవేశాలు పొందవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఇలా .. మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఠీఠీఠీ. ్చpఝట. ్చp. జౌఠి. జీn, ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పాస్‌ఫోర్ట్ ఫొటో, బోనిఫైడ్, ఆధార్‌కార్డు వివరాలు పొందుపరిచి దరఖాస్తు సమర్పించాలి. ఆన్లైన్లో అప్లై చేసిన కాఫీతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, పదోతరగతి మార్కుల మెమో జెరాక్స్ ప్రతులను ఏ కళాశాల ప్రవేశం కోసం నమోదు చేసుకున్నామో ఆ కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాల్సి ఉంటుంది. నేటితో దరఖాస్తుకు ఆఖరు.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ వరకు అవకాశంఉంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
ఆంగ్ల మాధ్యమం.. ఇక ఆదర్శం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్న ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను మోడల్‌గా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 218 పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆంగ్ల బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమిస్తారా ఉన్న వారితోనే ఒకటి నుంచి బోధన చేయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. రెండు మాధ్యమాలకు బోధన చేసేది ఒక్కరేకావడంతో అది ఆశించిన స్థాయిలో నెరవేరలేదు. జిల్లాకు వచ్చిన 218 ఆంగ్ల పాఠశాలల్లో కనీసం 90 పాఠశాలలను మన్యంకు కేటాయించే వీలుంది కొయ్యూరు (పాడేరు):తల్లిదండ్రులు వారి పిల్లలను ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న ప్రైవే టు పాఠశాలలకు పంపిస్తున్నారు. రానురాను ప్రైవేటు పాఠశాలల్లో ఆడ్మిషన్లు పెరిగిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్నాయి. దీనికి కారణం ఆంగ్ల బోధన లేకపోవడం. దీనిని గమనించిన ప్రభుత్వం ఆంగ్ల బోధనకు కొన్ని పాఠశాలలను ఎంపిక చేసింది. దానిలో ఒకటి నుంచి కూడా పూర్తిగా ఆంగ్లంలోనే బోధన చేయనున్నారు. ఆంగ్ల మాధ్యమం కారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడం తగ్గిస్తారన్న నమ్మకం ఉంది. అయితే ఆంగ్లంలో బోధించే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేదా ఆంగ్లంపై పట్టున్న వారిని నియమించినా బాగుంటుంది. కిందటి సంవత్సరం జిల్లా విద్యాశాఖ ఏ పాఠశాలల ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధన చేసేందుకు ఆసక్తి చూపుతున్నారో వివరాలు పంపాలని ఆదేశించింది. కొయ్యూరు మండలంలో రత్నంపేట, ఆడాకులతో పాటు మరో ఎనిమిది పాఠశాలలను మార్పు చేసేందుకు గతంలో నివేదించారు. ముందుగా ఆయా చోట్ల ఆంగ్లమాధ్యమం ఏర్పాటు చేస్తారు. ఆంగ్ల మాధ్యమాన్ని నిర్వహించే అన్ని పాఠశాలలను ఆదర్శంగా చేయనున్నారు. అక్కడ విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేయనున్నారు. ఆ పాఠశాలల్లో చేర్పిస్తే నాణ్యమైన విద్య వస్తుందన్న నమ్మకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కలిగించనున్నారు. రెండేళ్ల కిందట రాజేంద్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా చేశారు. ఇక్కడ ఒకటి నుంచి ఆంగ్లంలో బోధన చేస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రత్యేక ఫ్యాకల్టీ ఉండాలి.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆంక్షలకు వీలుగా పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంగా చేయడం మంచిదే. అయితే ఆంగ్లంలో బోధన చేసేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీ ఉండాలి. అలా ఉంటేనే విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. లేదా బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ఆడ్మిషన్లు కొంత వరకు తగ్గించే వీలుంది. –ఎస్.సన్యాసిరావు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు,ఏపీటీడబ్లు్య ఉపాధ్యాయుల సంఘం -
‘మోడల్’ ప్రవేశాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంగ్లిష్ మీడియం కావడం, అందులోనూ బాలికలకు హాస్టల్ వసతితో కూడిన విద్యను అందిస్తుండటంతో వాటిలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈసారి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రారంభ క్లాసైన ఆరో తరగతి కాకుండా 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే వాటిలో 200 కన్నా ఎక్కువ ఖాళీలు ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదీ జూన్ నాటికి ఇతర స్కూళ్లకు ఎవరైనా వెళితేనే ఆ ఖాళీలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. 10,275 దరఖాస్తులు జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టగా ఇప్పటివరకు 10,275 మంది విద్యార్థులు 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మోడల్ స్కూళ్లకు చెందిన 3,450 మంది విద్యార్థుల్లో 1,131 మంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. బాసర ట్రిపుల్‌ఐటీలోనూ ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆరో తరగతిలో 19,400 సీట్లు.. 2018–19 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం మోడల్ స్కూల్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తంగా 194 పాఠశాలల్లో 19,400 సీట్లు ఆరో తరగతిలో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 10,958 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఈనెల 16వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరో 25 వేల మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. నిజామాబాద్‌లో అత్యధిక దరఖాస్తులు ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఆ జిల్లా నుంచి 923 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, జగిత్యాల జిల్లా నుంచి 843 మంది దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డిలో 705 మంది, నల్లగొండలో 692 మంది, రంగారెడ్డిలో 650 మంది, సిద్దిపేటలో 638 మంది నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక తక్కువ దరఖాస్తులు నిర్మల్ (91మంది) నుంచి వచ్చినట్లు చెప్పారు. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు షెడ్యూలు 16–2–2018: ఆన్లైన్లో (http://telanganams.cgg.gov.in) దరఖాస్తుల సబ్మిషన్కు చివరి తేదీ 11–4–2018 నుంచి 15–4–2018: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం 15–4–2018: ప్రవేశ పరీక్ష, (ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష) 16–5–2018 నుంచి 19–5–2018: జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రవేశాల జాబితా ఖరారు 20–5–2018 నుంచి 25–5–2018: ప్రవేశాలకు ఎంపికైన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ -
ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన.. వెకిలిచేష్టలు !
సాక్షి, విడపనకల్లు: మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రంగబాబు తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లులో చోటుచేసుకుంది. ఎనిమిది, తొమ్మిది, ఇంటర్ విద్యార్థినులు ఉంటున్న వసతిగృహానికి ప్రిన్సిపాల్ రాత్రిపూట వచ్చి తాకరాని చోట తాకుతూ, బూతు మాటలు మాట్లాడుతూ వెకిలిచేష్టలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వేధింపులు తాళలేక చదువు ఆపేయాలనుకుంటున్నామని విలపించారు. అమ్మాయిల గదిలోకి ప్రిన్సిపాల్ వెళ్లి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తన ప్రవర్తన గురించి ఎవరికీ చెప్పకూడదని విద్యార్థినులను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగాలేదని పలువురు ఉపాధ్యాయులు కూడా ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రంగబాబును ‘సాక్షి’ వివరణ కోరగా కావాలనే కొంతమంది సిబ్బంది తనను టార్గెట్ చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పుకొచ్చాడు. -
మో‘డల్’ వసతి!
భయం నీడన చదువులు - వార్డెన్లు లేరు.. కుక్, చౌకీదార్లు కరువు - అభద్రత నడుమ విద్యార్థినులు - సెలవులు వస్తే ఇళ్లకు పయనం - వార్డెన్లుగా ప్రిన్సిపాళ్లకు అదనపు బాధ్యత - పర్యవేక్షణ కొరవడటంతో సమస్యలు ఈ ఫొటో చూడండి. ఇది పుట్లూరు మోడల్ స్కూల్ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినుల లగేజి. రెండు రోజుల సెలవు రావడంతో దాదాపు అందరూ ఊళ్లకు పయనమయ్యారు.వార్డెన్ లేడు. వాచ్‌మన్ ఉండడు. పాఠశాల ఉంటే సరి.. లేదంటే భయం భయంగా గడపాల్సిన పరిస్థితి. అనంతపురం ఎడ్యుకేషన్: మోడల్ స్కూళ్లలో అమ్మాయిల భద్రతకు భరోసా కరువైంది. జిల్లాలో 25 స్కూళ్లు ఉండగా.. 19 స్కూళ్లలో హాస్టళ్లు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా గుత్తి మోడల్ స్కూల్లో నీటి వసతి లేని కారణంగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఆడ పిల్లలకు మాత్రమే వసతి కల్పించారు. ప్రతి హాస్టల్లో వంద సీట్లు కేటాయించారు. ప్రస్తుతం ప్రిన్సిపాళ్లుగా పని చేస్తున్న వారే ఇన్చార్జి వార్డన్లుగా కొనసాగుతున్నారు. ఓ వైపు చదువుతో పాటు హాస్టళ్ల పర్యవేక్షణ వీరికి ఇబ్బందిగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. దీనికి తోడు కుక్, చౌకీదారు లేడు. చాలా మోడల్ స్కూళ్లలో కనీస వసతులు కరువయ్యాయి. దోమల బెడద అధికంగా ఉంది. కొన్ని వసతి గృహాల్లో లైట్లు లేవు. రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆడపిల్లలు హాస్టళ్లలో ఉండాలంటే బెంబేలెత్తుతున్నారు. తల్లిదండ్రులు కూడా హాస్టళ్లలో ఉంచేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా రెండు రోజుల సెలవు దొరికినా.. విద్యార్థినులు లగేజీతో ఇంటి బాట పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థినులు ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్తున్నారు. మరికొన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. సాయంత్రం భోజనం పెట్టి ఇళ్లకు పంపుతున్నారు. ఏజెన్సీని ఖరారు చేయని అధికారులు వాస్తవానికి ప్రతి హాస్టల్‌కు మహిళా వార్డన్‌తో పాటు కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదారు పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే జిల్లాలో ఏజెన్సీని ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతోంది. మహిళా సమాఖ్యకు ఇవ్వాలని అధికారులు భావించినా మరో ఏజెన్సీ కోర్టును ఆశ్రయించింది. దీంతో జీఓ ›ప్రకారమే నియామకాలు చేపట్టాలని ఇచ్చిన కోర్టు తీర్పు మేరకు ఏజెన్సీని ఖరారు చేసేందుకు టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. ఇంతటితో ఈ ప్రక్రియను ఆపేశారు. మరోవైపు హాస్టళ్ల ప్రారంభంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా ప్రారంభించి ప్రిన్సిపాళ్లకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం హాస్టల్లో వార్డన్‌తో పాటు కుక్, చౌకీదారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అసిస్టెంట్ కుక్కులు మాత్రం పని చేస్తున్నారు. వీరు కూడా గతంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పని చేసేవారు. అవి మూతపడడంతో ఇక్కడికి సర్దుబాటు చేశారు. వార్డెన్ లేక ఇబ్బందులు హస్టల్లో వార్డెన్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామం చాలవేముల నుంచి పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో హాస్టల్లో ఉంటున్నా. ఇప్పుడు వార్డెన్, వాచ్‌మన్ లేకపోవడంతో ఇంటికి పోవాల్సి వస్తోంది. - పవిత్ర, ఇంటర్ మొదటి సంవత్సరం, పుట్లూరు హాస్టల్ నుంచి ఇంటికి పోతున్నాం హస్టల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. ఇక్కడ ఉండాలంటే భయమేస్తోంది. అందువల్లే సెలవులు వస్తే ఇళ్లకు వెళ్లిపోతున్నాం. సిబ్బందిని భర్తీ చేసే వరకు ఇలానే చేస్తాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. - రాణి, 9వ తరగతి, పుట్లూరు స్కూల్ దోమలు అధికం ఇన్ని రోజులూ హాస్టల్ సదుపాయం కోసం ఎదురుచూశాం. ఎట్టకేలకు ప్రారంభించడంతో సంతోషించాం. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట హాస్టల్లో దోమల బెడద అధికంగా ఉంటోంది. సీజనల్ వ్యాధులను తలుచుకుంటానే భయమేస్తోంది. – రమ్య, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, అగళి సమస్యలను అధిగమిస్తాం మోడల్ స్కూల్ హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. వార్డన్, చౌకీదారు, కుక్కు పోస్టుల భర్తీకి ఏజెన్సీని నియమించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్‌కు పంపించాం. ఆమోదం రాగానే టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫైనల్ చేస్తాం. ఆ వెంటనే పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి సమస్యలను అధిగమిస్తాం. – పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ -
మో'డల్' వసతి!
నాలుగేళ్లుగా ఊరిస్తున్న హాస్టళ్లు - ప్రారంభోత్సవం 36సార్లు వాయిదా - ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే మూడు తేదీల ప్రకటన - కనీసం సౌకర్యాలు కల్పించడంలోనూ మీనమేషాలు - పోస్టుల భర్తీలోనూ ఇదే పరిస్థితి - ఏటా విద్యార్థినులకు ఇక్కట్లే.. జిల్లాలో మోడల్ స్కూళ్లు : 25 విద్యార్థుల సంఖ్య : 10,902 తొలివిడత ప్రారంభమయ్యే హాస్టళ్లు : 19 ఇప్పటి వరకు ప్రారంభమైన హాస్టళ్లు : 0 అనంతపురం ఎడ్యుకేషన్ : మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హాస్టళ్లను ప్రారంభించే విషయంలో అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఇప్పటికి 36 సార్లు వాయిదా వేసింది. 2013–14 విద్యా సంవత్సరంలో మోడల్ స్కూళ్లు ప్రారంభమైనా.. హాస్టల్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రతిసారి తేదీ ప్రకటించడం.. ఆ తర్వాత వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన 37 రోజుల్లో మూడుసార్లు తేదీలు ప్రకటించి వాయిదా వేశారు. తాజాగా ఆగస్టులో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేకపోవడం గమనార్హం. ప్రతిభ ఉండి సరైన ప్రోత్సహం లేక చదువుకు దూరమవుతున్న విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమంతో కూడిన మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలించక 2013–14 సంవత్సరానికి వాయిదా వేశారు. అది కూడా తొలివిడత కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. తక్కిన మండలాల్లో ఇప్పటికీ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ప్రారంభంలో వసతితో కూడిన చదువు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా ప్రారంభ సమయానికి వసతి విషయంలో చేతులెత్తేసింది. జిల్లాలో మొత్తం 25 మోడల్ స్కూళ్లు ఉండగా.. వీటిలో 6–10 తరగతుల విద్యార్థులు 8623 మంది, ఇంటర్ విద్యార్థులు 2279 మంది చదువుతున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యమే.. ప్రారంభ సంవత్సరంలో హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. కానీ వివిధ కారణాలతో హాస్టల్ వసతి కల్పించలేకపోయారు. తీరా చేరిన తర్వాత విద్యార్థులకు సినిమా కష్టాలు మొదలయ్యాయి. మండల పరిధిలో దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, వదిలిపెట్టలేక ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. ఊరిస్తున్న అధికారులు అన్ని తరగతులకు హాస్టల్ వసతి ఉంటుందని చెప్పిన అధికారులు తర్వాత బాలికలకు మాత్రమే అన్నారు. జిల్లాలో 25 స్కూళ్లు ఉండగా.. 19 స్కూళ్లలో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. అది కూడా 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఆడ పిల్లలకు మాత్రమే కల్పిస్తామని చెప్పారు. ప్రతి హాస్టల్లోనూ 9 నుంచి ఇంటర్ బాలికలకు వంద సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ లెక్కన మొత్తం 1900 మంది బాలికలకు వసతి కల్పించాల్సి ఉంది. ఒక్కో స్కూల్‌కు రూ.61 వేలతో వంటపాత్రలు కొనుగోలు చేశారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌక బియ్యం కోసం విద్యాశాఖ పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. ఆ శాఖ నుంచి ఇంకా అనుమతులు రాలేదు. అలాగే మ్యాట్రిన్, చౌకీదారు, హెడ్, హెల్పర్ కుకింగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఇప్పటిదాకా వీటి భర్తీ ప్రక్రియ జరగలేదు. పోనీ ఎప్పటిలోగా ప్రారంభిస్తారనే సమాచారం అ«ధికారుల వద్దే లేకపోవడం గమనార్హం. తొలివిడతలో ప్రారంభం కానున్న హాస్టళ్లు అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్, నల్లచెరువు, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, విడపనకల్లు, యాడికి, యల్లనూరు. త్వరలో ప్రారంభిస్తాం వివిధ కారణాలతో మోడల్ స్కూళ్లలో హాస్టళ్ల వసతి ఏర్పాటు ఆలస్యమైంది. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. బియ్యానికి కూడా అనుమతులు వచ్చాయి. మ్యాట్రిన్, చౌకీదారు, కుకింగ్ పోస్టుల భర్తీకి ఏజెన్సీని ఫైనల్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తికాగానే హాస్టళ్లు ప్రారంభిస్తాం. తొలివిడతగా 9 నుంచి ఇంటర్ వరకు బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. – పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ -
నోటుకు సీటు!
ఆదర్శ పాఠశాలలో మెరిట్ ముసుగులో సీట్ల అమ్మకం - రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు - ఒప్పందం మేరకు వాట్సాప్‌లో ప్రశ్న, జవాబు పత్రాలు - ప్రిన్సిపాల్, మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర - వేకెన్సీ సీట్ల భర్తీలో రిజరేషన్కు పాతర - అమ్ముడుపోయిన సుమారు 70 సీట్లు - ‘సాక్షి’ నిఘాలో బట్టబయలు ఆదర్శం అభాసు పాలయింది. విద్యార్థులకు తప్పొప్పులు తెలియజెప్పాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేశారు. జీవితం సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన జీతం వస్తున్నా.. గీతం కోసం అర్హులైన విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ప్రయివేట్ పాఠశాలలను కాదని.. ఆదర్శ పాఠశాలల్లోనే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశించిన తల్లిదండ్రుల కలనూ కాలరాశారు. మెరిట్.. రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన సీట్లను అమ్మకానికి పెట్టడంతో సరస్వతీ మాత కన్నీరు పెడుతోంది. రాయదుర్గం అర్బన్ : పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో సీటుకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పరీక్ష తప్పనిసరి చేశారు. ఆరో తరగతిలో 80 సీట్ల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలో దాదాపు 400 మంది విద్యార్థులు హాజరువుతుండటం చూస్తే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కో తరగతికి 80 సీట్ల చొప్పున మంజూరు చేయగా, గత ఏడాది ప్రజాప్రతినిధులపై విపరీతమైన ఒత్తిడి రావడంతో ఆరో తరగతికి అదనంగా మరో 80 సీట్లను మంజూరు చేశారు. ఒకసారి ఆరో తరగతిలో చేరిలో ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం తల్లిదండుల్లో ఉంది. కాన్వెంట్లలో చదివించే తల్లిదండ్రులు కూడా ఆదర్శ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దళారులు, ఇద్దరు ఉపాధ్యాయులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడ్డారు. సీటుకు రూ.10వేల నుంచి రూ.15వేల చొప్పున సుమారు 70 సీట్లను అమ్మకున్నట్లు తెలిసింది. డబ్బిచ్చిన వారికి వాట్సాప్‌లో ముందుగానే ప్రశ్న, జవాబు పత్రాలు పంపుతున్నారు. అది కూడా రాయలేని వారికి వారే దిద్దుబాట్లు చేసి పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయించి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చిందిలా.. ఆదర్శ పాఠశాలలో పెద్ద ఎత్తున సీట్ల కోసం డబ్బు వసూలు చేస్తున్నారనే విషయమై బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దృష్టి సారించగా వాయిస్ రికార్డులతో పాటు, రిజర్వేషన్ రోస్టర్ వెల్లడితో అడ్డంగా దొరికిపోయారు. వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న 13 సీట్లను భర్తీ చేయడానికి గత నెల 24న రిజర్వేషన్ రోస్టర్‌ను ప్రిన్సిపాల్ ప్రకటించారు. జాబితా ప్రకారం ఏడో తరగతిలో ఆరు సీట్లు, ఎమిమిదో తరగతిలో మూడు సీట్లు, తొమ్మిదో తరగతిలో 4 సీట్లు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు స్వీకరించారు. జాబితాలో పదో తరగతిలో సీట్లు చూపకపోయినప్పటికీ దరఖాస్తులు స్వీకరించారు. కేవలం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించకుండా, అందరితోనూ దరఖాస్తులు స్వీకరించడం చర్చనీయాంశమైంది. వీరికి ఈ నెల 5వ తేదీన పరీక్షలు నిర్వహించారు. డబ్బు ఇచ్చిన వారికి ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాన్ని, జవాబు పత్రాన్ని పంపించారు. నాలుగో తేదీ సాయంత్రం 4.25 గంటలకు ఒక వ్యక్తికి ç ప్రశ్నాపత్రం పంపగా, 5వ తేదీ ఉదయం 7.34 గంటలకు అదే వ్యక్తికి జవాబు పత్రం కూడా ప్రిన్సిపాల్ సెల్ నుంచి వెళ్లింది. ఖాళీ సీట్ల భర్తీకి పాటించాల్సిన రిజర్వేషన్ వివరాలివీ.. నోటిఫికేషన్ ప్రకారం గత నెల 24న ప్రకటించిన ఖాళీలకు రిజర్వేషన్ వివరాలను ప్రిన్సిపాల్ విడుదల చేశారు. ఏడో తరగతిలో ఉన్న ఆరు సీట్లలో ఒకసీటు ఎస్సీ జనరల్ , మూడు సీట్లు ఎస్సీ ఉమెన్, ఒక సీటు ఎస్టీ ఉమెన్, ఒక సీటు బీసీ–బీ ఉమెన్‌కు కేటాయించారు. ఎనిమిదో తరగతిలోని మూడు సీట్లలో ఓసీ ఉమెన్‌కు ఒకటి, ఎస్సీ ఉమెన్‌కు ఒక సీటు, బీసీ–డీ జనరల్‌కు ఒక సీటు కేటాయించారు. తొమ్మిదో తరగతిలోని నాలుగు సీట్లలో ఎస్సీ జనరల్‌కు ఒక సీటు, ఎస్సీ ఉమెన్‌కు ఒక సీటు, ఎస్టీ ఉమెన్‌కు ఒక సీటు, బీసీ–డీ ఉమెన్‌కు ఒక సీటు కేటాయించారు. ఈ సీట్లకు 178 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థుల ఎంపిక చేశారిలా.. ఈనెల 12న వేకెన్సీ సీట్ల భర్తీకి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. అయితే రిజర్వేషన్‌కు, ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. ఏడో తరగతిలో ఆరు సీట్లకు గాను ఓసీ కేటగిరీ కింద ఇద్దరు బాలురు, బీసీ–బీ కింద ఒక బాలుడు, బీసీ–డీ కింద ఒక బాలుడు, ఒక బాలికను, బీసీ–ఏ కింద ఒక బాలుడిని ఎంపిక చేశారు. 8వ తరగతికి ఎంపిక చేసిన ముగ్గురిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఓసీ కింద బాలికను ఎంపిక చేశారు. 9వ తరగతిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఒక బాలికను, బీసీ–డీ కింద ఒక బాలికను ఎంపిక చేశారు. 10వ తరగతికి వేకెన్సీలో చూపకపోయినప్పటికీ ఒక సీటు ఖాళీగా ఉందంటూ ఓసీకి చెందిన బాలుడిని ఎంపిక చేశారు. ఫలితాల్లో రిజర్వేషన్లకు తిలోదకాలు వేకెన్సీ సీట్ల కోసం ఈ నెల 5వ తేదీన 176 మంది పరీక్ష రాయగా, 13 మందిని ఎంపిక చేశారు. అయితే రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వడంతో వ్యవహారం బట్టబయలైంది. విషయాన్ని పసిగట్టిన ‘సాక్షి’ లోతుగా అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రిన్సిపాల్.. ప్రస్తుతం, అంతకు ముందు ఎంపికైన ఆరవ తరగతి విద్యార్థులతో స్థానిక ఎమ్మెల్యేల రెకమండేషన్ లెటర్ తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. సీట్ల కోసం ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు. మంచి మార్కులు వచ్చిన వారికే అవకాశం కల్పించాం. రిజర్వేషన్ రోస్టర్ ప్రకటించకుండా ఉండాల్సింది. - ప్రకాశ్‌నాయుడు, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, రాయదుర్గం -
ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు telanganams.cgg.gov.in లో పొందవచ్చన్నారు. -
నేడు మోడల్ స్కూల్ ఎంపికకు ప్రవేశ పరీక్ష
విద్యారణ్యపురి : జిల్లాలోని మోడల్స్కూళ్లలో ప్రవేశాలకు గాను (2017–2018) ఆదివారం ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. అందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శ్రీనివాసచారి శనివారం తెలిపారు. ముల్కనూరు, ఎల్కతుర్తి, కమలాపూర్ మోడల్ స్కూళ్లలో 6వతరగతిలో ప్రవేశాలకుగాను 1021మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. వీరికి ఈనెల 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారన్నారు. అలాగే 7,8,9,10 వతరగతిలో ఉన్న ఖాళీలకు కూడా ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. ఆ మూడు మోడల్స్కూళ్లలో 7,8,9,10 తరగతులకు కలిపి 952 మంది విద్యార్థులు పరీక్షనురాయబోతున్నారన్నారు. వీరికి ఈనెల 26న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటలవరకు పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా పరీక్షల నిర్వహణకు హన్మకొండలోనే ఆరు పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.అందులో హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్, హన్మకొండ ప్రభుత్వ హైస్కూల్, ప్రాక్టిసింగ్హైస్కూల్, లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాల, సుబేదారి ప్రభుత్వ హైస్కూల్, సెయింట్‌పీటర్స్ సీబీఎస్సీ హైస్కూల్లో పరీక్షాకేంద్రాలుగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ తెలిపారు. -
మరో 100 మోడల్ స్కూళ్లలో వృత్తి విద్య!
త్వరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 100 మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 20 మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టిన విద్యాశాఖ త్వరలోనే మరో 100 స్కూళ్లలో వీటిని ప్రారం భించేందుకు కసరత్తు ప్రారంభించింది. 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కోర్సుల్ని అమలు చేస్తోంది. ఇంటర్‌లోనూ ఆయా కోర్సులను కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయో గాత్మకంగా 20 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కోర్సులకు ఆదరణ లభించడంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సుల ద్వారా భవిష్యత్తులో వారు స్వయం ఉపాధి సాధించేందుకు తోడ్పడతా యన్న ఆలోచనతో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతోంది. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్(ఎన్ఎస్డీసీ) నేతృత్వంలో వీటిని నిర్వహించనుంది. ప్రధానంగా ఐటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, ఐటీ అండ్ రిటైల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ తదితర కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. -
ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు
– ఈ నెల 28, 29న పెన్ డౌన్ – 30 న కలెక్టరేట్ ముట్టడి కర్నూలు సిటీ: సమస్యల పరిష్కారం కోసం.. ఈ నెల28 నుంచి ఆందోళన బాట పట్టనున్నట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ పీఎన్ జాస్మిన్ మాట్లాడుతూ.. పీఆర్సీ సాధన, సర్వీస్ రూల్స్, హాస్టళ్ల అదనపు బాధ్యతలకు నిరసనగా ఆందోళనలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28, 29తేదీలలో పెన్‌డౌన్, 30వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, వచ్చే నెల7వ తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. డీఈఓకు వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు ఆశాజ్యోతి, నాగయల్లప్ప, టీవీ మార్కండేయులు, వెంకటేశ్వర్లుల తదితరులు ఉన్నారు. -
ఆదర్శంగా నిలపండి
– మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు కలెక్టర్ పిలుపు – పచ్చదనం అభివద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లావ్యాప్తంగా అన్ని మోడల్ స్కూళ్లను పేరుకు తగ్గట్టు అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రిన్సిపాళ్లకు పిలుపునిచ్చారు. మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతో ఆదివారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని చెబుతూ వాటి పరిష్కారానికి కషి చేస్తూనే అభివద్ధి చేసుకోవడంపై చొరవ చూపాలని సూచించారు. స్కూళ్లను ఆదర్శంగా నిలిపేందుకు అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రహరీలున్నా పాఠశాలల్లో పండ్ల మొక్కలు, కూరగాయల పెంపెకంతో పాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. కాంపౌండ్‌వాల్ లేని పాఠశాలల్లో నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షించాలన్నారు. గురుకుల పాఠశాలల తరహాలో ఆదర్శపాఠశాలల్లో పచ్చదనం అభివద్ధి చేయాలన్నారు. పాఠశాలల్లో అవసరమైన చోట గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని, స్పోర్ట్స్ పరికరాలు అందజేస్తామని తెలిపారు. అవసరమైన అభివద్ధి పనులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. దోమల నిర్మూలనపై 8,9,10 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తద్వారా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రవీంద్రనాథరెడ్డి, ఈఈ ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ టీచర్ల 30 గంటల దీక్ష
మోడల్ స్కూల్ టీచర్లపట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీఎంఎస్‌టీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బోసుబాబు విమర్శించారు. మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్సీ ఇవ్వాలని, సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, సీపీఎస్ రద్దు చేయాలంటూ ధర్నాచౌక్‌లో 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ప్రారంభించారు. అంతకుముందు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు మహా ర్యాలీ చేపట్టారు. ధర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో బోసుబాబు మాట్లాడుతూ మోడల్‌స్కూల్ టీచర్లకు 2015 జనవరి డీఏ నేటికీ చెల్లించలేదన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే మెడికల్ రీయింబర్స్మెంట్, హెల్త్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కూడా వర్తింపజేయడం లేదన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే మోడల్ స్కూల్స్ 96శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 155 మోడల్ స్కూల్స్ ప్రస్తుతం 1900 మంది పనిచేస్తున్నారని, ఇంకా 200పైగా పోస్టులు భర్తీచేయాల్సి ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను మండలిలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి మోడల్‌స్కూల్ టీచర్ల దీక్షకు మద్దతు తెలిపారు. పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, హైమావతి, వెంకట్రామయ్య, కార్యదర్శులు రాముడు, సోమయ్య, నరేంద్రనాయక్, హారిక, కార్యవర్గ సభ్యులు సాగర్‌కుమార్, సురేష్, ప్రేమ్భూషన్, సుబ్బారావు దీక్షలో పాల్గొన్నారు. ర్యాలీలో 13జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 1 నుంచి కామన్ మెనూ
-గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో అమలు -కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డు, పండ్లు, -ప్రతి ఆదివారం చికెన్ -గురుకులాల్లో ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు చికెన్ హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని సొసైటీల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) వచ్చే నెల 1వ తేదీనుంచి కామన్ మెనూ అమల్లోకి రానుంది. ఇందుకోసం అవసరమైన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. కామన్ మెనూ అమలుపై ఇదివరకే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సోమవారం మరోసారి ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీ పరిధిలోని గురుకులాల్లో ఒక్కో రకంగా భోజనం అందించేవారు. అంతేకాక ఒకే సొసైటీ పరిధిలోని ఒక్కో గురుకులంలో కూడా వివిధ రకాలుగా భోజనం అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులకు అలా ఇష్టారాజ్యంగా భోజనం అందించడానికి వీల్లేదు. మెనూను అమలు చేయాల్సిందే.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అన్ని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో (బాలికల హాస్టళ్లు ఉన్నవి) భోజనానికి కామన్ మెనూను అమలు చేయాల్సిందే. ఇందులో భాగంగా 391 కేజీబీవీలు, 110 మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డు, పండ్లు, ప్రతి ఆదివారం చికెన్‌తో విద్యార్థినులకు భోజనం అందిస్తారు. ఇక 247 గిరిజన సంక్షేమ గురుకులాలు, 129 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 47 తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు, 20 బీసీ సంక్షేమ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాల్లో ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు చికెన్‌తో (100 గ్రాముల చొప్పున) భోజనం అందిస్తారు. చికెన్‌ను రెండో బుధవారం, నాలుగో బుధవారం అందిస్తారు. ఒక్కో విద్యార్థిపై ప్రతి రోజు రూ. 26.50 వెచ్చించి ఈ భోజనం అందిస్తారు. అలాగే విద్యార్థికి ప్రతి రోజూ 50 మిల్లీ లీటర్ల పాలు అందిస్తారు. పాలతోపాటు బోర్న్‌వీటా, హార్లిక్స్, రాగి మాల్ట్, ఇంకా చెనా స్ప్రౌట్స్, పెసర్లు, బొబ్బర్లలో ఏదో ఒకటి ఇస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ వంటివి ఇస్తారు. రాత్రి మళ్లీ డిన్నర్ కింద భోజనం అందిస్తారు. భోజనంలోకి వండిపెట్టే కూరగాయలు వారంలో రెండుసార్లకు మించి ఒకేరకానివి వాడకూడదు. వంట చేసేందుకు విజయా బ్రాండు పల్లి నూనె లేదా రైస్ బ్రాన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలి. పండ్లు సాయంత్రం భోజన సమయంలో అందజేయాలి. కామన్ మెనూను ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. మెనూతోపాటు టోల్ ఫ్రీ నంబరు రాస్తారు. మెనూను నిబంధనల ప్రకారం అమలు చేయకపోతే విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట వచ్చే నెల 1 నుంచి కేజీబీవీలు, తెలంగాణ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో దీనిని అమలు చేస్తారు. మిగతా సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లోనూ వారం వ్యవధిలో అమల్లోకి తెస్తారు. -
మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ-లెర్నింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మోడల్ స్కూళ్లు, 46 కస్తుర్బాగాంధీ బాలికా విద్యాల యాల్లో (కేజీబీవీ) ఈ-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ, రోటరీ ఇండియా లిటరసీ మిషన్ సంయుక్తాధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 50 జిల్లా పరిషత్తు పాఠశాలల్లోనూ పెలైట్ ప్రాజెక్టు కింద ఈ-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ తరువాత ఇతర పాఠశాలలు, జిల్లాలకు విస్తరించే అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఆన్లైన్ ఆధారంగా ఈ-లెర్నింగ్ కేంద్రాల్లో విద్యార్థులకు బోధనను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఒక్కో స్కూల్లో ఈ-లెర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ. 30 వేల చొప్పున వెచ్చించనుంది. డిజిటల్ తరగతులు.. మరోవైపు రాష్ట్రంలోని 5,200 పాఠశాలల్లో త్వరలోనే డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్ప టికే 70 శాతం ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రొజెక్టర్లు ఉన్నాయి. దీంతో డిజిటల్ తరగతులు, లెర్నింగ్‌ను దశల వారీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్‌ను సిద్ధం చేశారు. వీలైన చోట ఆన్లైన్లో పాఠ్యాంశాల బోధన చేపడతారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో 250 స్కూళ్లలో, ఐటీ శాఖ ఆధ్వర్యంలో 500 స్కూళ్లలో మొదట అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా పాఠశాలలకు వర్తింపజేస్తారు. ప్రైమరీ విద్యార్థుల కోసం యూనిసెఫ్ ఆధ్వర్యంలో టాకింగ్ బుక్స్ సిద్ధం చేశారు. ఇందులో ఏదేనీ బొమ్మ, పదంపై పెన్ను పెట్టగానే అదేంటన్న దానిపై వాయిస్ వస్తుంది. దీనిని ఆరునెలల్లోగా అమల్లోకి తెస్తారు. -
ఆంగ్లానికి ఆదరణ
ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పెరిగిన ప్రవేశాలు ఒకటో తరగతిలో కొత్తగా చేరిన 12 వేల మంది విద్యార్థులు మోడల్స్కూళ్లలో ఐదు నుంచి తొమ్మిదో క్లాస్ వరకు సీట్లు ఫుల్ పదో తరగతి, ఇంటర్మీడియట్లో చేరేందుకు అనాసక్తి మారుమూల ప్రాంతాల్లోనే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు నామమాత్రం నల్లగొండ ; ప్రభుత్వ పాఠ శాలల్లో ఆంగ్ల మాధ్యమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లిష్ మీడియానికి అంకురార్పణ చేసిన నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఆంగ్ల మాధ్యమానికి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యాసంవత్సరం నుంచి మోడల్ స్కూళ్లలో సీట్ల సంఖ్యను పెంచారు. దీంతో పాఠశాలల్లో కూడా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సీట్లన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పదో తరగతి, ఇంట ర్మీడియట్‌లో మాత్రమే ఆశించిన స్థాయిలో ప్రవేశాలు జరగడం లేదు. మారుమూల ప్రాంతాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాలక ఆంగ్లానికి ఆదరణ చెందిన విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపక సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. బాలికలకు హాస్టల్ వసతి కల్పించి బాలురకు ఆ అవకాశం ఇవ్వకపోవడం తో ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా 12 వేల మంది.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 724 పాఠశాలలు బోధిస్తామని తీర్మానం చేశాయి. ఈ క్రమంలో కొత్తగా సుమారు 12,171 మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో ప్రవేశం పొందారు. మోడల్ స్కూళ్లలోనూ సీట్లు పెంచింది. మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఈ ఏడాది ఎక్కువ మందే పోటీ పడ్డారు. పోటాపోటీగా ప్రవేశాలు... మోడల్ స్కూళ్లలో అన్ని రకాల వసతులు ఉండటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం, బోధన సిబ్బంది కొరత లేకపోవడం వంటి అంశాలు విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడ్డాయి. ఆంగ్ల మాధ్యమానికి పెరుగుతున్న ఆదరణను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరానికి గాను ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతిలో 20 సీట్ల చొప్పున పెంచింది. ఇప్పటి వరకు 80 సీట్లు ఉన్న తరగతిలో వాటి సంఖ్య వందకు చేరింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 80 నుంచి 160 సీట్లకు పెంచగా.. విద్యార్థుల ప్రవేశాలు పెరిగా యి. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 30 పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఒక్కో పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఐదు వందల చొప్పున 30 పాఠశాలల్లో 15 వేల సీట్లకుగాను 13,559 సీట్లు భర్తీ అయ్యాయి. 1,441 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నా యి. ఆరో తరగతిలో 205, ఏడో తరగతిలో 122, ఎనిమిదిలో 157 ఖాళీలు ఉండగా.. తొమ్మిదో తరగతిలో 326, పదో తరగతిలో 631 ఖాళీలు ఉన్నా యి. 36 పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులకు సం బంధించి సీట్లన్నీ భర్తీ అయ్యా యి. 16 పాఠశాల ల్లో ఎనిమిది, ఏడు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి సీట్లన్నీ భర్తీ కాగా.. టెన్తలో మాత్రం నిడమనూరు స్కూల్ మినహా మిగిలిన వాటిల్లో సీట్లు మిగి లాయి. ఇంటర్ అడ్మిషన్లు పరిశీలిస్తే.. 160 సీట్లు చొప్పున 30 పాఠశాలల్లో ఫస్టియర్‌లో 4,800 సీ ట్లకు 2,426 భర్తీ కాగా.. 2,374 మిగిలాయి. సెకం డియర్‌లో 4,800 సీట్లకు గాను 1,099 సీట్లు మా త్రమే భర్తీ అయ్యాయి. చందంపేట, తిప్పర్తి, ప ో చంపల్లి, మఠంపల్లి, వేములపల్లి, నడిగూడెం వం టి మారుమూల ప్రాంతాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. -
మోక్షంలేని మోడల్ స్కూళ్లు
మోర్తాడ్ : గ్రామీణ స్థాయిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీయస్ఈ) సెలబ స్ను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు కొన్ని మండలాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో యూపీఏ సర్కార్ మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిధులను కేటాయించింది. అయితే ఇప్పటి ఎన్డీఏ సర్కార్ మోడల్ స్కూళ్ల నిర్వహణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపడమే కాకుండా కొత్త మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు నిధులను కేటాయించడం లేదు. దీంతో మోడల్ పాఠశాలల విద్య పరిమితం అయి ఎక్కువ మంది విద్యార్థులు లబ్ధిపొందలేక పోతున్నారు. సీబీయస్ఈ సిలబస్ ద్వారా ప్లస్ టూ వరకు ఉచితంగా మెరుగైన విద్యను అందించడానికి మోడల్ స్కూళ్ల అంకురార్పణ జరిగింది. రెసిడెన్సియల్ విధానంతో పాటు డే స్కాలర్ విధానంలో మోడల్ స్కూళ్లలో విద్యను అందించడానికి ఏర్పాట్లు చేశారు. మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సొంత భవనాల నిర్మాణం కోసం 2014 అక్టోబర్24 జీవో నంబర్ యంయస్ 8 ద్వారా ఒక్కో మోడల్ స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.80 కోట్లను కేటాయింది. అయితే జిల్లాలో మొదట 15 చోట్ల స్థలాల సేకరణ వేగంగా జరగడంతో 15 మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తయింది. బాల్కొండ మండలంలో మాత్రం స్థల సేకరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మోడల్ స్కూల్ నిర్మాణం మొదలయ్యే సమయంలో పనులు నిలిచిపోయాయి. 21 మండలాల్లో పాఠశాలల కోసం స్థల సేకరణలో జాప్యం ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం తన నిధులను వెనక్కి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 మండలాలకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి, రెండు మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉండగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఎక్కడ కూడా మోడల్ స్కూళ్ల నిర్మాణం సాగలేదు. ఐదు మండలాల్లో స్థల సేకరణ పూర్తి అయినా కేంద్రం మనసు మారడంతో ఈ మండలాల్లోని విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలను సక్సెస్ స్కూళ్లుగా మార్చి వాటిలో ఆంగ్ల మాధ్యమంను అమలు చేస్తోంది. సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి చదివిన విద్యార్థులకు ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో సీట్లు లభించడానికి మోడల్ స్కూళ్లు ఒక్కటే మార్గంగా ఉన్నాయి. అయితే మోడల్ స్కూళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులకు సరిపడేంత సీట్లు ఉండటం లేదు. మోడల్ స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండిఉంటే ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు అవకాశం లభించేది. మోడల్ స్కూళ్లు లేని మండలాలు ఇవే... జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్, కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, బోధన్, ఎడపల్లి, నిజామాబాద్, కోటగిరి, బీర్కూర్, మాక్లూర్, భిక్కునూర్ మండలాల్లో సరైన సమయంలో స్థల సేకరణ జరుగకపోవడంతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు స్థలాలు ఉన్నా నిధులు కేటాయించకపోవడంతో మోడల్ విద్య విద్యార్థులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోడల్ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మోడల్ స్కూళ్లలో సీట్లు పెంపు
- ఆరు నుంచి పదో తరగతి వరకు 80 నుంచి 100 సీట్లకు... - ఇంటర్మీడియెట్‌లో 80 నుంచి 160కి పెంపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఇప్పటివరకు ఉన్న సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతమున్న 80 సీట్ల నుంచి 100కి పెంచింది. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 80 నుంచి 160 సీట్లకు పెంచింది. సెకండియెర్ మినహా మిగతా తరగతుల్లో ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులో ఉంటాయి. ప్రవేశ మార్గదర్శకాలకు సంబంధించి శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య జీవో 24 జారీ చేశారు. మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలివీ.. ► 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలను ప్రవేశపరీక్ష ద్వారా చేపట్టాలి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలు చేపట్టాలి. ఎంపిక జాబితాతోపాటు 20 శాతం మందితో వెయిటింగ్ లిస్టు రూపొందించాలి. వెయిటింగ్ లిస్టువారికి కేటాయించిన తర్వాత సీట్లు మిగిలితే పక్క మండలాలవారికి కేటాయించాలి. అయితే వీటికి రాష్ట్రస్థాయిలో అనుమతి తీసుకోవాలి. ► ప్రతి తరగతిలో ఇదివరకు రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్లో 40 చొప్పున 80 సీట్లు ఉం డగా, ఇప్పుడు ప్రతి సెక్షన్లో 50 చొప్పున 100 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ► ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఇదివరకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలో 20 చొప్పున 80 సీట్లు ఉండగా, వాటిని ప్రతి గ్రూపులో 40 చొప్పున 160 సీట్లు పెంచింది. ద్వితీయ సంవత్సరంలోనూ ప్రతి గ్రూపులో 40 చొప్పున 160 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సెకండియర్‌లో పెంచిన సీట్లు 2017 (జూన్) నుంచి అమల్లోకి వస్తాయి. ►ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం (బీసీ-ఏ 7 శాతం, బీ 10 శాతం, సీ 1 శాతం, డీ 7 శాతం, ఈ 4 శాతం) సీట్లు కేటాయించాలి. వికలాంగులకు 3 శాతం, మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి. ► మోడల్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసుకున్నవారికి అదే మోడల్ స్కూల్లో ఇంటర్మీయెట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించాలి. ► మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ప్రతి స్కూల్లో మంజూరైన సీట్లకు అదనంగా 10 మందికి మించకుండా 2 శాతం సీట్లను కేటాయించే అధికారం మోడల్ స్కూల్స్ ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు డెరైక్టర్‌కు ఉంటుంది. -
మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో త్వరలోనే 100 బాలికల హాస్టళ్లను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే 10-15 రోజుల్లో వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది. శుక్రవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్లో జరిగిన సమావేశంలో విద్యాశాఖలో వివిధ నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మోడల్ స్కూళ్లు, వాటిల్లో బాలికల హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల నిర్మాణ పనులను విద్యాశాఖ అధికారులతోపాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం దాదాపు రూ.1,500 కోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిని వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటివరకు 89 మోడల్ స్కూళ్లలో హాస్టళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 11 హాస్టళ్ల నిర్మాణాలు నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు మంత్రికి వివరించారు. నిర్మాణాలు పూర్తై మరో 5 స్కూళ్లలోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తంగా మోడల్ స్కూళ్ల సంఖ్య 192కు చేరుతుందన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ మూడో దశ కింద కేంద్రం నుంచి రూ. 200 కోట్లు రావాల్సి ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ. 5 వేలు గౌరవ వేతనం: మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లలో వార్డెన్లుగా ఉన్న టీచర్లకు అదనంగా రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. హాస్టళ్లలో భద్రత కోసం ఒక వాచ్‌మెన్‌ను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ప్రారంభించబోయే హాస్టళ్ల నిర్వహణ వ్యయాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. 3 నెలల్లో 14,526 టాయిలెట్ల నిర్మాణం పూర్తి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నెలల్లో 14,526 టాయిలెట్ల నిర్మాణాలను విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, బీడీఎల్ తదితర సంస్థలు చేపట్టిన 251 టాయిలెట్ల నిర్మాణాలు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అలాగే టాయిలెట్లలో నీటి సదుపాయం, అన్ని స్కూళ్లలో తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ఆర్‌ఎంఎస్‌ఏ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్ఎస్ఏ అదనపు ఎస్పీడీ భాస్కర్‌రావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
‘మోడల్’ హాస్టళ్లు రెడీ!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మోడల్ స్కూళ్లలో చదువుతున్న బాలికల కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఒడిదుడుకులతో సాగిన హాస్టళ్ల నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పూర్తవుతాయి. అన్నీ అనుకున్నట్లు జరిగే ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయానికి హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మొ త్తం 33 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్ల సదుపాయం కల్పించాల్సి ఉంది. అయితే నిధుల లేమితో సమస్య మొదటికొచ్చింది. అబ్బాయిల హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా కేవలం అమ్మాయిల వాటికి మాత్రమే కేటాయించారు. ఒక్కో దానికి రూ. 1.28 కోట్లు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రూ. 5 లక్షల ఫర్నిచర్స్ కోసం కేటాయించాలి. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. వెంటనే పనులు మొదలు పెట్టిన ఏడాదిపాటు పనులు సాగుతూ వచ్చాయి. మే నెలలోనే పనులు పూర్తికావాల్సి ఉండగా దాదాపు రెండు నెలలు ఆలస్యంగానైనా పూర్తయాయి. జిల్లాలో 31 పాఠశాలల్లో హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డోన్, కొలిమిగుండ్ల పాఠశాలల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని కూడా వారం, పది రోజుల్లో పూర్తి చేస్తామని సర్వశిక్షా అభియాన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆయా హాస్టళ్లలో మంచినీటి సమస్య, కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నియామకం వేగవంతం: సీనియర్ అధ్యాపకులకు వార్డెన్లుగా ఇన్చార్జి ఇచ్చారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక కమాటీలు, కుక్‌లు, వాచ్మన్లు, ఇతర అధికారుల పోస్టులను భర్తీ చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ మోహన్ అనుమతి ఇచ్చారు. వారం రోజుల్లోగా ఔట్సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా నియమకాలు చేపట్టేందుకు చర్యలు వేగమంతమయ్యాయి. బాలికల కష్టాలు తొలగినట్లే ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో చదివే బాలికల కష్టాలు వర్ణనాతీతం. పాఠశాలకు వెళ్లాలంటే నరకం కనిపించేది. మండల కేంద్రాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలు ఉండడంతో వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రోడ్డు సదుపాయం లేని వాటికి ఆటోలు కూడా వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో అమ్మాయిలు కాలినడకన పాఠశాలలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వర్షాకాలంలో వానకు తడుస్తూ పోవాల్సిన పరిస్థితి ఉండేది. హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తవడంతో అమ్మాయిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీరనున్నాయని, హాస్టల్లో ఉండి బాగా చదువుకోవచ్చని పేర్కొంటున్నారు. -
వలంటీర్ల నియామకం ఎండమావే !
మోడల్ స్కూళ్లలో పరిస్థితి పట్టించుకోని యంత్రాంగం కంచిలి:ఏపీ మోడల్ స్కూళ్లలో అకడమిక్ వలంవటీర్ల నియామకం ఎండమావిగా మారింది. ఈ ప్రక్రియను ఇంతవరకూ చేపట్టలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్పప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేసిన చేసిన వారికి సైతం నియామకపత్రాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువులు సక్రమంగా సాగే పరిస్థితి కనిపించటం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 మోడల్ స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో స్కూల్లో సుమారు 500 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్నారు. ఒక్కో స్కూల్లో 13 నుంచి 15 మంది వరకు రెగ్యులర్ అభ్యసనా సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నియామక ప్రక్రియలు చేపట్టలేదు. తాత్కాలికంగా సబ్జెక్టు టీచర్ల కొరత నుంచి గట్టెక్కటానికి నియమించాల్సిన అకడమిక్ వటంటీర్లను కూడా ఇంతవరకు నియమించకపోవంతో పాఠ్యాంశాలు ఎంతవరకు పూర్తవ్వగల వనే సందేహంఉపాధ్యాయ సిబ్బందిలో సైతం నెలకొంది. మోడల్ స్కూళ్ల వ్యవస్థ ఏర్పడి మూడో విద్యాసంవత్సరం మొదలైనప్పటికీ బాలారిష్టాల సమస్యలు ఇంతవరకు పరిష్కరించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే భావనే వ్యక్తమవుతోంది. కార్పోరేట్ విద్యాసంస్థల స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పి ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాల్లో అధ్యాపక సిబ్బందినే ఇంతవరకు పూర్తిస్థాయిలో నియమించలేదు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే వీటి ఏర్పాటు లక్ష్యం ఎంతవరకూ ఫలిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రారంభానికి నోచుకోని వసతి గృహ సముదాయాలు ఒకవైపు అకడమిక్ వటంటీర్ల సమస్యతో మోడల్ స్కూల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు నిర్మాణం పూర్తిచేసుకొన్న వసతి గృహాలను ప్రారంభించకపోవటంతో విద్యార్థులు హాస్టల్ వసతికి నోచుకోవటం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీటి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ మరుగుదొడ్లు, ప్రహరీ పనులు చేపట్టలేదు. ఫలితంగా వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో మఠంసరియాపల్లి, రాజపురం, సోంపేట, ఇచ్ఛాపురం, కరవంజ, ఈదులవలస పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చిన్నపాటి పనులు పూర్తి చేయకపోవటంతో ఈ విద్యాసంవత్సరంలోనైనా విద్యార్థులు వసతికి నోచుకుంటారో లేదో అనే అనుమానం తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం కూడా మోడల్ స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై సీరియస్‌గా స్పందించకపోటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యింది. -
మహిళా టీచర్లకు అదనపు భారం!
* మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలు * ఇప్పటికే పని భారం ఎక్కువైందని ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో బాలికల కోసం నిర్మించిన హాస్టళ్ల నిర్వహణ బాధ్యత గందరగోళంగా మారింది. 175 మోడల్ స్కూళ్లలో చేపట్టిన బాలికల హాస్టళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలోనే వాటిని ప్రారంభించి బాలికలకు నివాస వసతి కల్పించేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో పనిచేసే టీచర్లే వార్డెన్ల విధులు నిర్వహించాలని సోమవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా టీచర్లలో సీనియర్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించింది. హాస్టళ్లలోని వసతుల వివరాలు, వార్డెన్ బాధ్యతలు ఎవరికిఅప్పగిస్తున్నారనే అంశాలను ఈ నెల 15లోగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నివేదిక పంపించాలని పేర్కొంది. దీంతో మహిళా టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తమకు పాఠశాలల్లో పనిభారం అధికంగా ఉందని, దీనికి తోడు వార్డెన్ బాధ్యతలు చూడటం కష్టమవుతుందని రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్ల అసోసియేషన్ వాపోతోంది. పైగా మోడల్ స్కూళ్లు మండల కేంద్రాలకు దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఓ మహిళా టీచర్ వందమంది బాలికలతో ఉండటం శ్రేయస్కరం కాదని పేర్కొంది. పైగా వివాహితులైన టీచర్లు తమ కుటుంబాన్ని వదిలి ఉండటం (భర్త, కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదు కాబట్టి) సాధ్యం కాదంటోంది. ఈ నేపథ్యంలో హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా వార్డెన్లను నియమించి రాత్రి వేళల్లో బాలికలకు రక్షణగా మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని కోరుతోంది. -
పయనం ఎటువైపు?
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విద్యా రంగం ఎటువైపు పయనిస్తుందో అర్థం కావడం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఊతమిచ్చేలా పలు చర్యలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వంలోని కార్పొరేట్లు విద్యా రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే సంఘాల ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించక తప్పడం లేదు. మోడల్ స్కూళ్లలో తగ్గుతున్న సరస్వతీ పుత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు సత్ఫలితాలు ఇవ్వడంలేదు. శ్రీకాకుళం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లున్నాయి. వీటన్నింటిలోనూ ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కొత్తగా ఏ ఒక్కరూ చేరడం లేదు. మోడల్ స్కూళ్లలో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ కూడా ప్రవేశపెట్టినప్పటికీ ఎవరూ చేరడం లేదు. ఈ స్కూళ్లలో వసతి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం వల్ల ఇప్పటివరకు కొంతమేర విద్యార్థులు వచ్చారు. ఈ ఏడాది మోడల్ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నాయి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందకపోవడం, సర్వీసు రూల్స్ లేకపోవడంతో పలువురు ఉపాధ్యాయులు గతంలో పనిచేసిన యాజమాన్యాల పాఠశాలలకు వచ్చేస్తుండగా, కొత్తగా ఎంపికైనవారు తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిన విద్యా వలంటీర్ల తరహాలో ఉపాధ్యాయ, అధ్యాపకులను సమకూర్చుకుంటున్నారు. మోడల్ స్కూళ్లు మారుమూల ప్రాంతాల్లో నిర్మించడంతో సరైన రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు మానేస్తున్నారు. కేజీబీవీలకు విద్యార్థులు పెరుగుతున్నా చేర్చుకోలేని వైనం కసూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులు చేరేందుకు సుముఖంగా ఉన్నా వారిని చేర్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి తరగతిలోనూ 60 మందిని మాత్రమే చేర్చుకునే అవకాశం ఉంది. దీంతో పలు కేజేబీవీలకు వస్తున్న విద్యార్థినిలను వెనక్కి పంపించేస్తున్నారు. ఈ ఏడాది నుంచి కేజీబీవీల్లో ఆంగ్ల మాంధ్యమాన్ని ప్రవేశపెట్టడం, వచ్చే ఏడాది నుంచి శతశాతం ఆంగ్ల మాంధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీబీవీల్లో చేరే విద్యార్థినులు రెగ్యులర్ విద్యార్థులు కారు. డ్రాపౌట్లు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, వలస కూలీల పిల్లలను కేజీబీవీల్లో చేర్చుకుంటారు. ఇటువంటి వారు ఆంగ్ల మాంధ్యమాన్ని చదివే అవకాశాలు తక్కువ. అయినప్పటికీ పాఠశాలల్లో చేరేందుకు వస్తున్నా చేర్చుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. పాఠశాలల విలీనం చేపడితే మరింతగా డ్రాపౌట్లు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకటి రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే విద్యార్థులు ప్రాథమిక విద్య కోసం కిలోమీటరు, ఉన్నత విద్యకు మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి ప్రయాసతో బడికి పంపించే అవకాశాలు తక్కువ. దీంతో డ్రాపౌట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. విలీనంపై ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు 20 శాతం బాలురు, 50 శాతం బాలికలు డ్రాపౌట్లుగా మారుతారని తేలింది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా విలీనం చేయాలని నిర్ణయించడం ఆక్షేపణలకు తావిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పలువురు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు అటుగా దృష్టి సారిస్తున్నారు. -
14న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను 6వ తర గతిలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14న ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రత్యేక కేటగిరీ పాఠశాలలుగా గుర్తించడంతో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. గతంలో లాటరీ ద్వారా ప్రవేశాలు చేపట్టడం వల్ల ప్రతిభావంతులకు సీట్లు రావడం లేదన్న వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 177 మోడల్ స్కూళ్లలో 14,160 సీట్ల కోసం పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50లు ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. ఫీజు చెల్లించాక జ్ట్టిఞ://్ట్ఛ్చజ్చ్చఝట.ఛి జజ.జౌఠి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు ఈ నెల 2 నుంచి: ఫీజులు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ 8వ తేదీ వరకు: ఫీజు చెల్లింపునకు చివరి గడువు 9వ తేదీ: దరఖాస్తులు సబ్మిషన్ చివరి గడువు 14వ తేదీ: ప్రవేశ పరీక్ష.(ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆయా మోడల్ స్కూల్స్/మండల కేంద్రాల్లో). పూర్తి వివరాలతో హాజరు -
‘మోడల్’ నోటిఫికేషన్ ఎప్పుడు?
జూన్ 12 నుంచే పాఠశాలల పున ః ప్రారంభం ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వని విద్యాశాఖ హైదరాబాద్: రాష్ట్రంలోని 178 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలను కల్పిస్తారా, లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మోడల్ పాఠశాలలు ఇంగ్లిషు మీడియంలో నిర్వహించనున్న నేపథ్యంలో.. వాటిల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఏప్రిల్ నుంచే ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జూన్ 12వ తేదీ నుంచే పాఠశాలలు ప్రారంభమవుతాయి. కానీ మే చివరి వారం వచ్చినా మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర స్కూళ్లలో చేర్పించాలా, లేక వేచి చూడాలా అన్న గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లలకోసం జూన్‌లో ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజులు చెల్లించకపోతే వాటిల్లో సీట్లను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వం వద్దే ఫైలు.. 177 మోడల్ స్కూళ్లలోని ఆరో తరగతిలో మొత్తంగా 14,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రవేశాలను లాటరీ ద్వారా కాకుండా ప్రవేశ పరీక్ష ద్వారా చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాలు, నవోదయ పాఠశాలల తరహాలోనే వీటికి పరీక్ష నిర్వహించాలని భావించిన అధికారులు.. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ ఆ ఫైలు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే త్వరలోనే ఈ ఫైలుకు ఆమోదం లభిస్తుందని, రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇచ్చినా..! మోడల్ స్కూళ్లలో పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేలా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా విద్యా సంవత్సరం ఆలస్యం కాకతప్పదు. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష, ఫలితాల వెల్లడి అనంతరం ప్రవేశాలు పూర్తి చేయాలి. ఇందుకు దాదాపు 45 రోజులు పడుతుంది. మరోవైపు ఎలాగైనా ఆలస్యమయ్యే అవకాశమున్నందున.. వీలైనంత ముందుగా ప్రక్రియ పూర్తిచేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. -
‘ఆదర్శం’గా చదవండి
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు షురూ ఈ నెల 20 వరకు గడువు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో నలభై ఆదర్శ పాఠశాలలు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు ఒక్కో కోర్సులో 20 చొప్పున మొత్తం 3200 సీట్లు 26న ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి ఆంగ్లమాధ్యమంలో బోధన, హాస్టల్ వసతి కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాల)ల్లో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈనెల 4 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, 20 వరకు గడువు విధించారు. ఈలో గా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 26న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. విద్యార్థులు ఆన్లైన్లో వెబ్సైట్ సీజీజీ.జీవోవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈనెల 21లోగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పదో తరగతి హాల్‌టికెట్, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో సహా జిరాక్స్ కాపీలను దరఖాస్తు చేసుకున్న పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పాఠశాలల వారీగా మెరిట్ జాబితాలు తయారు చేసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈనెల 26న సంబంధిత పాఠశాలలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తారు. 27న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ షెడ్యూల్‌ను అనుసరించి విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.లింగయ్య సూచించారు. ఒక్కో గ్రూపుకు 20 సీట్లు.. ఆదర్శ పాఠశాల్లో విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో కొననసాగుతోంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 20 సీట్ల చొప్పున నాలుగు గ్రూపులకు కలిపి 80 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. జిల్లాలో 40 ఆదర్శ పాఠశాలల్లో ఉన్న ఇంటర్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో సుమారు 3200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఆర్ట్స్ గ్రూపుల్లో సగం సీట్లు కూడా నిండలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో అన్ని గ్రూపుల్లోనూ పూర్తిస్థాయిలో సీట్లు నిండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇందుకు సంబంధించి ప్రయత్నాలను ప్రారంభించారు. కాగా... మోడల్ స్కూళ్లలో ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. 55 శాతం ఉత్తీర్ణత... ఎంసెట్ కోచింగ్ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తిగా ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో ఒక బ్యాచ్ ఇంటర్మీడియల్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలి తాల్లో జిల్లాలో ఉన్న 40 ఆదర్శ పాఠశాలల నుంచి 1723 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హజరు కాగా ఇందులో 946 మందే ఉత్తీర్ణుల య్యూరు. ఉత్తీర్ణత 55 శాతం మాత్రమే నమోదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు. బాలికలకు తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో, బాలురకు గర్రెపల్లి మోడల్ స్కూల్లో ఎంసెట్ శిక్షణ నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వందల మంది విద్యార్థులు ఎంసెట్ శిక్షణ పొందుతున్నారని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నీలకంఠం రాంబాబు తెలిపారు. ఈ శిక్షణ 45 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే భోజనం, వసతి కల్పిస్తున్నామని తెలిపారు. -
మోడల్ స్కూళ్ల భారం మీదే!
- ‘మోడల్ స్కూళ్ల’ పథకాన్ని రాష్ట్రాలే నిర్వహించుకోవాలని కేంద్రం సూచన - ఇప్పటికే నిధులు కేటాయించిన పాఠశాలల పనులపై స్పష్టత ఇవ్వని వైనం - నిధులరాకపై అనుమానం - అయోమయంలో ఆరు మోడల్ స్కూళ్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాధ్యమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. ఈ పథకం కింద కొనసాగుతున్న ఆదర్శ పాఠశాలల నిర్వహణ సంగతి అటుంచితే.. ఇప్పటికే మంజూరై నిర్మాణాలకు నోచుకోని మోడల్ స్కూళ్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఆర్‌ఎంఎస్‌ఏ పథకంలో భాగంగా జిల్లాకు 25 ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. జిల్లాలో 37 మండలాలుండగా.. విద్య పరంగా వెనకబడిన ప్రాంతాలను గుర్తిస్తూ 25 మండలాలను ఎంపిక చేయగా.. వాటికి కేంద్ర ప్రభుత్వం 2010-11లో తొలివిడత కింద 19 పాఠశాలలు మంజూరు చేసింది. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా.. 2012 -13 వార్షిక సంవత్సరంలో మంజూరైన ఆరు పాఠశాలలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆర్‌ఎంఎస్‌ఏ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే మంజూరుచేసి నిధులు విడుదల చేయని వాటిపై స్పందించకపోవడంతో వాటి పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. రూ.19.32 కోట్ల సంగతేంటి? ఆర్‌ఎంఎస్‌ఏ రెండో విడతలో వికారాబాద్, మొయినాబాద్, దోమ, యాలాల, ధారూరు, మోమీన్‌పేట మండలాలకు ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.3.2 కోట్ల చొప్పున మొత్తం రూ.19.2 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో అధికారులు కాంట్రాక్టర్లను సైతం ఎంపిక చేసి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధుల విడుదలపై తాత్సారం చేసింది. ఫలితంగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటి నిర్మాణాల సంగతి సందిగ్ధంలో పడింది. వాస్తవానికి 2012- 13 సంవత్సరంలో పనులు మంజూరు చేసినందున కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలి. కానీ అప్పట్లో నిధులు విడుదల చేయకపోగా.. ప్రస్తుతం పథకాన్ని వదిలించుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే తప్ప నిర్మాణాల ప్రక్రియ కొలిక్కి రావడం కష్టమే. -
మోడల్ స్కూళ్లకు బస్సు సర్వీసులు
అనకాపల్లి-విశాఖ మధ్య 7 ఏసీ బస్సులు కాంప్లెక్స్‌ల్లో ప్రతి నెలా స్వచ్ఛభారత్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.రామకృష్ణ అనకాపల్లి/చోడవరం: జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల మీదుగా బస్సు సర్వీసులు వేస్తున్నామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.రామకృష్ణ చెప్పారు. అనకాపల్లి, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడు తూ, మోడల్ స్కూళ్లు ఉన్న మరుపాక, తేగాడ, నర్సీపట్నం నుంచి వ యా శరభవరం, వ డ్డిప, తోటకూరపాలెం-తట్టబంద రూట్లలో బస్సు సర్వీసులు వేస్తున్నామన్నారు. ఆ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యుల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ఈ సర్వీసులు నడుపుతున్నామని చెప్పా రు. అనకాపల్లి-విశాఖ మధ్య ఏడు ఏసీ వాల్వో బస్సులను నడపనున్నట్లు తెలి పారు. అనకాపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ గతనెలలో విజయనగరంజోన్కు రూ.2.5 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాకినాడ నుంచి చెన్నైకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడప, పొద్దుటూ రు, శ్రీశైలం రీజియన్ పరిధిలో సౌకర్యాలను మెరుగుపరిచామన్నారు. డిమాం డ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతనంగా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నెలా 16న ఆర్టీసీ డిపోలు, కాంప్లెక్స్‌ల్లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తామన్నారు. అనకాపల్లి కాంప్లెక్స్ ఆవరణలో మొక్కలను నాటారు. చోడవరం కాంప్లెక్స్‌లో మరుగుదొడ్ల నిర్వాహకులు నిర్దేశించిన రుసుం కంటే అదనం గా వసూలు చేస్తున్నట్టు తెలియడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి రూ. 500 జరిమానా విధించారు. ఆర్టీసీ కాం ప్లెక్స్‌లను పరిశుభ్రంగా ఉంచేలా ప్ర యాణికులు సహకరించాలని కోరారు. రద్దీగా ఉండే రూట్లలో అదనపు బస్సు లు నడిపేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రధాన పట్టణాలకు అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎప్పకప్పుడు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో బస్సులు నడుపుతున్నామన్నారు. చోడవరం -విజయనగరం సర్వీసును పరిశీ లిస్తామన్నారు. ఆయనతోపాటు ఆర్టీసీ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్, జిల్లా రీజనల్ మేనేజర్ జగదీష్‌బాబు, అనకాపల్లి అసిస్టెంట్ మేనేజర్ రమణమ్మ పాల్గొన్నారు. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం యలమంచిలి: విశాఖపట్నం-యలమంచిలికి త్వరలో ఏసీ వాల్వో బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ చె ప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెం చడంతో పాటు ప్రయాణికులకు ప్రత్యేకంగా అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. బుధవారం యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్ పరిసరాలు,మరుగుదొడ్లు పరిశీలించారు. ప్ర యాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7.30 గంటలు దాటితే యలమంచిలి నుంచి పాయకరావుపేటకు బస్సు లు అందుబాటులో లేవని, హైదరాబా ద్ వెళ్లేందుకు గతంలో ఉన్న సర్వీసును కూడా నిలిపివేసిన సంగతిని కొందరు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే లగ్జరీ సర్వీసును బుధవారం సాయంత్రం నుంచే యలమంచిలి కాంప్లెక్స్‌కు వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ వా హనాల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఆర్టీఏ అధికారులతో మాట్లాడి ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. -
మోడల్ స్కూల్స్
అధ్వానంగా ఆదర్శ పాఠశాలలు 80 శాతం సిబ్బంది కొరత కంప్యూటర్లూ కరువే పునాదులకే పరిమితమైన హాస్టళ్లు తాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే మరుగుదొడ్లు లేక ఇబ్బందులు చిత్తూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలు అధ్వానంగా మారాయి. పాఠశాలలు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా పలు పాఠశాలలకు సొంత భవనాలు లేవు. హాస్టల్ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. మంచినీరు కూడా అందని పరిస్థితి, పాఠశాలలకు వెళ్లేందుకు సరైన దారి లేదు. ఆటస్థలాలు అసలే లేవు. మరుగుదొడ్ల వసతి కల్పించిన పాపానపోలేదు. ఇప్పటికీ 80 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలకు 40 కంప్యూటర్లను కేటాయించి విద్యార్థులకు సాంకేతిక విద్యనందిస్తామని అధికారులు గొప్పలు చెప్పినా నామమాత్రంగా కూడా కంప్యూటర్లు అందించలేదు. ఏ ఒక్క ఆదర్శ పాఠశాలలోనూ కంప్యూటర్ శిక్షకుడు లేరంటే మోడల్ స్కూళ్ల పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. జిల్లాలో 2009- 10 సంవత్సరానికిగాను ప్రభుత్వం ఫేస్-1 కింద 18, ఫేస్ -2 కింద మరో రెండు.. మొత్తం కలిపి 20 ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. జిల్లాలోని రామకుప్పం, గంగవరం, నిమ్మనపల్లె, రొంపిచెర్ల పాఠశాలలకు ఇంతవరకు సొంత భవనాలను నిర్మించలేదు. దీంతో అధ్వానపు వసతుల మధ్య ఆ పాఠశాలలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. కొద్దిపాటి చినుకులు రాలినా గదులు ఉరుస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అన్ని ఆదర్శ పాఠశాలల్లోనూ హాస్టల్ భవనాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే వంట చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల ఆవరణలు ముళ్లచెట్లతో నిండిపోయాయి. సరైన రహదారి సౌకర్యం లేదు. హాస్టల్ లేకపోవడంతో బాలికలు సక్రమంగా పాఠశాలలకు రావడంలేదు. పలు పాఠశాలలు గ్రామాలకు దూరంగా నిర్మించడంతో విద్యార్థులు రాలేక పాఠశాలలకు ఎగనామం పెడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ పాఠశాలల్లో విద్యతోపాటు మౌలికవసతులు కరువయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. దాదాపు 1300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం పాఠశాలల్లో హాస్టల్ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. వంటగదులు లేవు. పై మూడు పాఠశాలల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సగానికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 44 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 కంప్యూటర్లు మాత్రమే ఇచ్చారు. ఐదు మండలాలకు సంబంధించి హాస్టల్ భవనాలు పూర్తి కాలేదు. పలమనేరు నియోజకవర్గంలో బెరైడ్డిపల్లె మండలంలో మాత్రమే మోడల్ స్కూల్ ఉంది. అధ్యాపకుల కొరత వల్ల పాఠశాలలో చురుకైన విద్యార్థులే మిగిలిన విద్యార్థులకు పాఠాలు చెబుతుండడం విశేషం. పుంగనూరు నియోజకవర్గంలో అడవినాచనగుంటలో వంటగది లేదు. ప్రహారీగోడ లేదు. ఇంటర్లో 140 మంది విద్యార్థులుండగా ముగ్గురు లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. హాస్టల్ భవనం లేదు. పీలేరు నియోజకవర్గంలో కలకడ, కేవీపల్లెలో రెండు మోడల్ స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. రెండు పాఠశాలల్లో పది మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. కలకడ స్కూల్‌కు సరైన దారి లేదు. సత్యవేడు నియోజకవర్గంలో కన్నవరం, కేవీబీ పురం పాఠశాలల్లో వంట గదులు లేవు. కంప్యూటర్ ఆపరేటర్, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ వసతి లేరు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపాళెం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. పిల్లల తల్లిదండ్రులే చందాలేసుకుని కొంత మంది ఉపాధ్యాయులను నియమించుకున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, కా ర్వేటినగరం పాఠశాలల్లో సి బ్బంది కొరత ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కంప్యూట ర్లు నామమాత్రంగా ఇచ్చారు. -
ఉపాధ్యాయులలో ఉత్కంఠ
సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం విద్యాశాఖలో బదిలీలు, రేషనలైజేషన్, సర్వీసు నిబంధనల మార్పును చేపడుతోంది. దీంతో ఉపాధ్యాయులలో ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఉన్నతస్థాయి కమిటీ వెలువరించే నివేదిక, నియమ నిబంధనల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ దసరా సెలవులలో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది. నిజామాబాద్ అర్బన్: ఉపాధ్యాయులలో ఉత్కంఠ నెలకొంది. వచ్చే దసరా సెలవులలో రేషనలైజేషన్, సర్వీసు నిబంధనలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేయనుండడమే దీనికి ప్రధాన కారణం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనల గురించి కమిటీని వేసింది. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్య పుస్తకాల ప్రచురణ విభాగం డెరైక్టర్ సుధాకర్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్ శ్రీహరితో కూడిన ఈ కమిటీ వీటిపై కసరత్తు చేయనుంది. ఇదివరకే ప్రాథమిక నివేదికను విద్యాశాఖ మంత్రికి అందించారు. ఇందులో ఉన్న నియమ నిబంధనలు ఏమిటో తెలియక ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. అందరి దృష్టీ అటే! జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 973 ప్రాథమిక పాఠశాలలు, 753 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 10 వేల మంది విద్యా బోధన చేపడుతున్నారు. వీరికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, రేషనలైజేషన్ ముఖ్యంగా మారాయి. ఈ ఏడాది ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకే సారి బదిలీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని ఎలా చేస్తారన్నదే ఉపాధ్యాయులకు సందేహం. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులకు ఈసారి త ప్పనిసరిగా స్థాన చలనం కలిగించనున్నారు. ఐదేళ్లు పూర్తయిన ఉనాధ్యాయులను బదిలీ చేయనున్నారు. కనీస బదిలీకి రెండేళ్లుగా నిర్ణయించారు. బదిలీల్లో అదనపు పో స్టులకు సంబంధించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను, సీనియర్ ఉపాధ్యాయులను ఎవరిని పక్కకు జరుపుతారనేది సందేహం. జిల్లాస్థాయిలో బదిలీలు చేపడతారా, మండల స్థాయికే పరిమితం చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2012 మేలో జరిగిన బదిలీలలో టీచర్లు నేటికీ రీలివ్ కాలేదు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ తెలియడం లేదు. ఈ బదిలీలు మేనేజ్మెంట్ ప్రకారమా, జిల్లా మొత్తం ఒక యూనిట్‌గా బదిలీ చేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎంఈఓల నియామకం తర్వాతనే బదిలీలు చేసే అవకాశం ఉంది. రేషనలైజేషన్‌తో 30 పాఠశాలలకు ప్రమాదమే! రేషనలైజేషన్‌తో జిల్లాలో 30 పాఠశాలలు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది కన్న తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీప పా ఠశాలలలో విలీనం చేయనున్నారు. 1:30 ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను మూసి వేయనున్నారు. దీంతో జిల్లాలో 14 పాఠశాలలు ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రేషనలైజేషన్ ద్వారా వచ్చే టీచర్లను, కచ్చితమైన నిబంధనలు పాటించి అత్యవసరం ఉన్న మారుమూల ప్రాంతాల పాఠశాలలకే కేటాయించాలని నిర్ణయించారు. సర్ప్లస్ టీచర్లు ఉన్నప్పుడు, ఇందులో జూనియర్ ఉన్న టీచ ర్ సర్వీసును, సీనియర్ ఉన్న సర్వీసును ఏది పరిగణలోకి తీసుకుంటారో ముఖ్యంగా మారింది. రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూడు కిలోమీటర్ల దూరం, పాఠశాలల సంఖ్య ఆధారంగా చేస్తారన్నది టీచర్లు ఆలోచిస్తున్నారు. ఈసారి పాఠశాలల సహాయకులు సబ్జెక్టును మార్చుకునే అవకాశం కల్పించారు. దీని ప్రకారం టీచర్లకు సబ్జెక్టు పై పట్టుదొరికే అవకాశం ఏర్పడుతుంది. మరో మూడు రోజులలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక, నిబంధనలను బహిర్గతం చేయనుంది. అప్పుడే సందేహాలు తీరు అవకాశముంది. -
మోడల్ స్కూళ్లలో 1,800 పోస్టుల భర్తీ
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో..తెలుగు మీడియం వారికీ అవకాశం హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీలో తెలుగు మీడియం అభ్యర్థులకు అవకాశం ఇవ్వకపోవడంతో న్యాయ వివాదంగా మారిన వ్యవహారంలో కదలిక మొదలైంది. మొదట భర్తీ చేయగా మిగిలిపోయిన దాదాపు 1,800 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తూ పోస్టుల భర్తీని పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీంతో సుమారు 80 మంది వరకు తెలుగుమీడియం వారికి అవకాశం లభించనుంది. ఒక్కో మోడల్ స్కూల్ నిర్మాణానికి 4.80 కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రెండో దశలో మంజూరు చేసిన 125 మోడల్ స్కూళ్లలో ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.4.80 కోట్లు మంజూరు కానున్నాయి. మొదటి దశలో తెలంగాణ జిల్లాలకు మంజూరైన 186 స్కూళ్లలో ఒక్కో స్కూల్‌కు రూ. 3.02 కోట్లు మంజూరు చేయగా ఇపుడు ఆ మొ త్తాన్ని పెంచేందుకు కేంద్రం ఒప్పుకుంది. -
మోడల్ స్కూళ్లు
కర్నూలు(విద్య): కేంద్రీయ విద్యాలయాల తరహాలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఈ పాఠశాలలు మంజూరై నాలుగేళ్లయినా.. పనుల ప్రారంభానికే రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి కాకపోవడంతో హాస్టల్ వసతి ఎండమావిగా మారింది. జిల్లాలోని 51 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి రూ.3.02కోట్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండల కేంద్రాల్లో నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఒక్కో పాఠశాలను నాలుగు నుంచి ఐదు ఎకరాల స్థలంలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. డే స్కాలర్, రెసిడెన్సియల్ విధానంలో పాఠశాలలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఇద్దరేసి పీజీటీలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులకు ఒక్కో పీజీటీలను నియమించారు. మొదటి యేడాది పాఠశాలలు ప్రారంభమైన ఆరు నెలలకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీజీటీలను నియమించారు. వీరితో పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిజికల్ డెరైక్టర్, యోగా టీచర్, ఆర్ట్ టీచర్, ఎస్యూపీడబ్ల్యు టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్, క్లర్ కమ్, అకౌంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను కేటాయించారు. వీటిని అప్పటి ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని కొందరు అమ్ముకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. జిల్లాకు మంజూరైన 51 పాఠశాలలకు స్థలసేకరణ సమస్యగా మారడంతో 36 పాఠశాలలకు మాత్రమే అధికారులు స్థలాన్ని చూపించగలిగారు. దీంతో వీటికి మొదటి విడతగా రూ.108.72కోట్లు మంజూరయ్యాయి. 2013లో 36 భవనాలు పూర్తి కావడంతో పాఠశాలలను హడావుడిగా ప్రారంభించారు. మొదటి సంవత్సరం 6 నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు నిర్వహించారు. ప్రతి తరగతికి 80 మంది చొప్పున అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ఈ యేడాది భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం, హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో హాస్టళ్లను ప్రారంభించలేకపోయారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. -
మో‘డల్’ పాఠశాలలు లేనట్టే
గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకూ కార్పొరేట్ తరహా విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ పాఠశాలలు బాలారిష్టాలను దాటడం లేదు. పాఠశాలల్లో సవాలక్ష సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. కొన్ని చోట్ల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తరగతులు ప్రారంభమైన చోటా పూర్తిస్థాయిలో వసతులు లేవు. భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో 21 మండలాల పేద విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో చదివే అవకాశం లేకుండా పోయింది. అందిస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తుండడంతో మోడల్ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇప్పటివరకు నిజాంసాగర్, మద్నూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, సిరికొండ, ధర్పల్లి, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వర్ని, డిచ్పల్లి, రెంజల్ మండలాల్లోనే మోడల్ పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించారు. ఆయా పాఠశాలల్లోనే తరగతులు ప్రారంభించారు. దీంతో బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, లింగంపేట్, గాంధారి, మాచారెడ్డి, బోధన్, ఎడపల్లి, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, బీర్కూర్, కోటగిరి, తాడ్వాయి, కామారెడ్డి, నిజామాబాద్, మాక్లూర్, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోని విద్యార్థులు మోడల్ విద్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మోడల్ పాఠశాలలకు సొంత భవనం నిర్మించే వరకు అద్దె భవనాల్లో తరగతులను నిర్వహించాలని మొదట అధికారులు భావించారు. అయితే అనువైన అద్దె భవనాలు దొరకవనే ఉద్దేశంతో సొంత భవనాలు నిర్మించే వరకు పాఠశాలలను ప్రారంభించేది లేదని అధికారులు నిర్ణయించారు. కొన్ని మండలాల్లో పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడం, మరి కొన్ని మండలాల్లో భూ సేకరణ దశలోనే ఉండటంతో విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది. సమస్యలెన్నో.. మోడల్ పాఠశాలల్లో పలు సమస్యలున్నాయి. చాలా పాఠశాలల్లో సరిపోయేంత ఫర్నిచర్ లేదు. ల్యాబ్ సౌకర్యాలు లేవు. ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కొన్ని ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులను నియమించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై కొందరిని పంపించారు. ఇంటర్ పాఠ్యాంశాలు బోధించడానికి పూర్థిస్థాయిలో లెక్చరర్స్‌ను నియమించకపోవడంతో సిలబస్ పూర్తి కాకుండానే విద్యార్థులు పరీక్షలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడు, తొమ్మిది, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతున్నాయి. అయితే ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయపోవడంతో ఈసారీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టమే. -
‘ఆదర్శం’.. అధ్వానం
ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గంలో గుడిహత్నూర్, బజార్హత్నూర్ మండలాలకు ప్రభుత్వం మోడల్ స్కూళ్లు మంజూరు చేసింది. వాటి భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. 2012-13 విద్యాసంవత్సరంలోనే ఈ పాఠశాలల తరగతులు ప్రారంభించాల్సి ఉండగా.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతో గుడిహత్నూర్‌లో పాఠశాల భవన నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. దీంతో 2013-14 విద్యాసంవత్సరంలో ఆదర్శ విద్యకు మండల విద్యార్థులు నోచుకోలేదు. ఈ ఏడాదైనా భవన నిర్మాణం పూర్తయితే పాఠశాల ప్రారంభమయ్యే అవకాశముందని ఆశించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం హాస్టల్ భవనం పనులు శరవేగంగా సాగుతుండగా భవన నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితం కావడంతో ఈ ఏడాది కూడా పాఠశాల తరగతులు ప్రారంభమయ్యేలా కనిపించడంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక బజార్హత్నూర్లో చేపట్టిన ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తవడంతో గతేడాది తరగతులు ప్రారంభించారు. అయితే హాస్టల్ భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఈ ఏడాది కూడా వారికి వసతి కల్పించే అవకాశాలు కనిపించడంలేదు. చెన్నూర్ : పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యనందించేందుకు ప్రభుత్వం నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి మండలాలకు 2011లో ఆదర్శ పాఠశాలలు మంజూరు చేసింది. అధికారులు అలసత్వంతో చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో నేటికీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. దీంతో రెండేళ్లుగా అక్కడి విద్యార్థులు మోడల్ స్కూల్ విద్యకు దూరమయ్యారు. మందమర్రి మండలంలో 2011లో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి రూ.3.2 కోట్లు నిధులు మంజూరవగా.. 2012లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడాది వ్యవధిలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో సింగరేణికి చెందిన కొన్ని గదుల్లో తాత్కాలికంగా ఆదర్శ పాఠశాల తరగతులు ప్రారంభించారు. 275 మంది విద్యార్థులు చేరారు. ఆరకొర వసతుల మధ్య విద్యార్థులు ఏడాదిపాటు విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ ఏడాది సైతం భవన నిర్మాణం పూర్తికావడం అనుమానమే. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థులు 275 మందికి తోడు వచ్చే విద్యాసంవత్సరం అదనంగా మరో వంద మంది చేరనున్నారు. ఇప్పటికే సింగరేణి ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం కొత్త విద్యార్థుల చేరికతో మరిన్ని తిప్పలు తప్పేలా లేవు. త్వరగా భవనం పనులు పూర్తిచేయించి విద్యార్థుల కష్టాలు దూరం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. -
మో‘డల్’ స్కూళ్లు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని 14 మండలాలకు 2012-13 విద్యాసంవత్సరానికి మొదటిదశలో మోడల్ స్కూళ్లు మంజూరయ్యాయి. అయితే ఏ ఒక్కచోట పాఠశాల ప్రారంభం కాలేదు. 2013-14లో గదుల నిర్మాణం కాకపోయినప్పటికీ తాత్కాలికంగా తరగతులు ప్రారంభించారు. సమీపంలోని పాఠశాలల్లో తరగ తులను కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఏడు మండలాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. మిగతా ఏడు ఆదర్శ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియలో వీటికి భాగస్వామ్యం కల్పించలేదు. వసతి గృహాలేవి? తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చినప్పటికీ హాస్టళ్ల నిర్మాణం మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. గదులు లేకపోవడంతో గతేడాది ప్రవేశాలు కల్పించలేదు. మోడల్ స్కూల్ విధానంలో పాఠశాల, హాస్టల్ ఉండాలి. హాస్టల్లో కేవలం బాలికల కే వసతి ఉంటుంది. హాస్టల్ వసతి లేక పోవడంతో దూరప్రాంతాల వారు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఈ సమస్యతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలను సాకుగా చూయించి రీ టెండర్ పిలిచేలా ఒత్తిడి తీసుకురావచ్చనే ఆలోచనతో కొందరు కాంట్రాక్టర్లు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తికాని నియామకాలు ఆదర్శ పాఠశాల మొదటిదశ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మొదటిదశలో భాగంగా 2013 జూన్‌లో పదిమంది పీజీటీలను తొలుత ఆయా పాఠశాలలకు నియమించారు. వేతన భద్రత లేకపోవడంతో ఐదు నుంచి ఆరుగురు మాత్రమే విధుల్లో చేరారు. తర్వాత 2013 నవంబర్‌లో స్కూలుకు ఆరుగురు టీజీటీల చొప్పున ఎంపిక చేయగా ముగ్గురు నుంచి నలుగురు చొప్పున విధుల్లో చేరారు. పాఠశాలకు 10 మంది పీజీటీలతో పాటు ఆరుగురు టీజీటీలు విధులు నిర్వర్తించాలి. కంప్యూటర్ ఆపరేటర్, వాచ్‌మన్, పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్లను ఆయా పాఠశాలలకు ఔట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేశారు. వీరిని 2014 మార్చి మొదటివారంలో నియమించడంతో వీరి సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అంతేకాకుండా పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్లను ఏప్రిల్ చివరివారంలో విధుల్లో నుంచి రిలీవ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వర్తిస్తూ వాచ్‌మన్‌తో ఆయాపాఠశాల భద్రతను కొనసాగిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠ శాలలోనూ యూనిఫాంల పంపిణీ జరగలేదు. ఉపాధ్యాయుల్లోనూ అభద్రత ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన యువ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్ల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి సర్వీసు రూల్స్ రాలేదు. దీంతోపాటు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని, ఐఆర్ డీఏ చెల్లించాలనే డిమాండ్లు ఉన్నాయి. మూడు డిమాండ్ల సాధనకోసం ఆయావర్గాలు మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించడంలేదు. పెరుగుతున్న విద్యాభారం! గతేడాది 6,7,8 తరగతులతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ఆయా పాఠశాలల్లో నడిపించారు. ఈ ఏడాది తొమ్మిది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను అదనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గదులు లేకపోవడంతో క్లాసులు కొనసాగించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. భారీగా దరఖాస్తులు 4మోడల్ స్కూళ్లలో సమస్యలు ఉన్నప్పటికీ అందిస్తున్న నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేసి నాణ్యమైన విద్య బాలబాలికలకు అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మోడల్ నిర్మాణాలు!
పరిగి, న్యూస్‌లైన్: ఈ విద్యా సంవత్సరం కూడా మోడల్ స్కూళ్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. మరో నెల రోజుల్లో 2014-15 సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభం కావాల్సిఉంది. కానీ 33 నెలలు క్రితం అట్టహాసంగా శంకుస్థాపన చేసిన భవనాలు మాత్రం పూర్తి కాలేదు. ఇక మరో వైపు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ వివాదమైంది. భవన నిర్మాణాలు, విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియలోనూ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులనుచేర్చుకునేందుకు విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం.. రెండు సంవత్సరాలుగా విద్యార్థులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంది. జూన్, జూలై నెలల్లో హడావిడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు.. అనంతరం స్వీకరించిన దరఖాస్తులను చెత్తబుట్టలో పడేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు శంకుస్థాపనచేసి 33 నెలలు గడుస్తున్నా మోడల్ స్కూళ్ల భవన నిర్మాణాలకు గ్రహణం వీడడం లేదు. శిలాఫలకాలకే పరిమితం.. ఆదర్శ పాఠశాలల ఏర్పాటు కోసం 2011-12 విద్యా సంవత్సరానికి ముందు జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలకు అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితారెడ్డి శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మోడల్‌స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదు పాఠశాలల భవనాలకు రూ.15కోట్లు మంజూరు చేశారు. 2011 జూన్ 28న ఒకేరోజు నియోజకవర్గ పరిధిలోని ఐదు స్కూళ్లకు సబితారెడ్డి శిలాఫలకాలు వేశారు. కానీ ఇప్పటివరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. స్థలాలకు నిధులేవీ? శిలాఫలకాలు వేసింది మొదలు ఆదర్శ పాఠశాలల ఏర్పాటులో అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.మూడు కోట్లు మంజూరు చేసినప్పటికీ స్థలాల కొనుగోలుకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో కొన్ని చోట్ల శంకుస్థాపనకు ముందే స్థల వివాదాలు తెరపైకి వచ్చాయి. మండల కేంద్రాల్లో అందరికీ అందుబాటులో ఉండాల్సిన పాఠశాలలు మారుమూల గ్రామాలకు తరలిపోయాయి. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో, గండేడ్ మండలం వెన్నచ్చేడ్లో, పూడూరు మండలం మన్నెగూడలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభం కాగా దోమ మండలానికి చెందిన దిర్సంపల్లి, దాదాపూర్ గ్రామాల మధ్య ఈ విషయమై పెద్దవివాదమే తలెత్తింది. అది క్రమంగా రాజకీయ రంగు పులుముకొని భవన నిర్మాణానికి అడ్డంకిగా మారింది. పరిగిలో శంకుస్థాపన చేసిన మినీస్టేడియం స్థలం వివాదాల్లోకి వెళ్లడంతో ఇక్కడ పాఠశాల నిర్మాణం ఆగిపోయింది. మండల పరిధిలోని జాపర్‌పల్లి గుట్టపై స్థలాన్ని పరిశీలించి పునాదులు తీశారు. కానీ ఇప్పటికీ ఆ భవనం బెస్మెంట్ లెవల్ దాటలేదు. తల్లిదండ్రుల ఎదురుచూపు పిల్లలను ఆదర్శ పాఠశాలల్లో చేర్చేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారు. గత రెండేళ్ల నుంచి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ తరగతులు మాత్రం ప్రారంభం కావడంలేదు. ఈ ఏడాదీ అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. -
మోడల్.. మోసాల్!
338 మోడల్ బడుల నిర్మాణాల్లో మరో మాయ కాంట్రాక్టర్లకు కోట్లు దోచిపెట్టే ఎత్తుగడ విద్యాశాఖ అనుమతి లేకుండా డిజైన్ మార్పు పైగా ఒక్కో బడిలో ఐదారు గదులు తగ్గించి నిర్మాణం మిగతా గదులేవని అడిగితే.. చేతులెత్తేసిన మౌలిక సదుపాయాల కార్పొరేషన్ సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్ల నిర్మాణాల్లో మరో అక్రమానికి రంగం సిద్ధమైంది. పెరిగిన ధరలు, డిజైన్ మార్పు పేరుతో కాంట్రాక్టర్లకు రూ.84 కోట్లుదోచిపెట్టే చర్యలకు పూనుకుంది. ఆ మేరకు.. ఒక్కో స్కూల్‌కు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు అదనంగా ఇస్తేనే ఒప్పందం మేరకు అన్ని గదుల నిర్మాణం పూర్తి చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఈడబ్ల్యూఐడీసీ) మెలిక పెట్టింది. ఈ లెక్కన 338 మోడల్ స్కూళ్లలో నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే కనీసంగా రూ.84 కోట్లు ఇవ్వాలంటోంది. లేదంటే అంతేనంటూ చేతులు దులుపుకొంటూ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. అసలు ఒక్కో స్కూల్లో 36 గదులను నిర్మించాల్సి ఉండగా.. 30 వరకే గదులను నిర్మించి.. అన్నీ పూర్తయ్యాయంటూ ఏపీఈడబ్ల్యూఐడీసీ విద్యాశాఖకే షాక్ ఇచ్చింది. మొదట్లో ఒక్కో మోడల్ స్కూల్లో అవసరమైన గదుల నిర్మాణానికే వేర్వేరుగా (స్కూల్ వారీగా) టెండర్ పిలువాలని అధికారులు నిర్ణయిస్తే.. కాదు కాదు ప్యాకేజీలుగా అన్ని గదులకు టెండర్లు పిలువండంటూ అమ్యామ్యాల కోసం ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు కేటాయించిన డబ్బు సరిపోదని, అదనంగా ఇస్తేనే నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ కార్పొరేషన్ మరో అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది. కొంతమంది కాంట్రాక్టర్లతో ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై ఈ అక్రమ బాగోతానికి సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. అడ్డగోలు విధానాలు.. రెండేళ్లు గడిచినా అన్ని నిర్మాణాలూ పూర్తి చేయని కార్పొరేషన్, సర్కారు ఇష్టారాజ్య విధానాలు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే వ్యవహారాలు మోడల్ స్కూళ్లకు శాపంగా మారాయి. 2010 డిసెంబర్లో 355స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో 2011లో రూ. 919 కోట్లతో 338 స్కూళ్ల నిర్మాణాలను చేపట్టినా ఇప్పటికీ పూర్తి చేయలేకపోయింది. కార్పొరేషన్ అధికారులే 2011లో వీటి నిర్మాణాలకు డిజైన్స్ వేశారు. ఒక్కో స్కూల్లో 36 గదులను రూ. 2.72 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. ఒప్పందం ప్రకారం 36 గదులను నిర్మించి విద్యాశాఖకు అప్పగించాలి. ఈ ఒప్పందం ప్రకారమే నిర్మాణాలు ప్రారంభించారు. అయినా ఇప్పటివరకు అన్ని నిర్మాణాలను పూర్తి చేయించలేకపోయారు. టెండరు నిబంధనలను తుంగలో తొక్కి.. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై టెండర్ నిబంధనలను తుంగలో తొక్కారు. ఒక్కో స్కూల్లో 36 గదులను నిర్మించాల్సి ఉన్నా 30 - 31 గదులనే నిర్మించారు. ఈ విషయాన్ని విద్యాశాఖకు చివరి వరకు తెలియజేయలేదు, ఆమోదమూ తీసుకోలేదు. ఇటీవల ప్రారంభించేందుకు అప్పగించిన 212 స్కూళ్ల భవనాల్లో 30-31 గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖ.. మిగతా గదుల సంగతేంటని అడిగితే.. అంతేనంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. దీంతో విద్యాశాఖ కంగుతింది. ఒప్పందం ప్రకారం ఒక్కో స్కూల్లో 36 గదులు నిర్మించి ఇవ్వాల్సి ఉంది కదా! అని అడిగితే.. డిజైన్స్‌ను గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్‌కు కాకుండా సెకండ్ ఫ్లోర్ కోసం మార్చడం వల్ల, ఇసుక, సిమెంటు ధరలు పెరుగడం వల్ల మిగితా ఐదారు గదులను నిర్మించలేకపోతున్నామని, వాటిని నిర్మించాలంటే అదనంగా రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలు ఇవ్వాలని పేర్కొంటోంది. దీంతో ఏం చేయాలో తెలియక విద్యాశాఖ తల పట్టుకుంది. అయితే ఈ వ్యవహారంలో ఒప్పందాన్ని తుంగలో తొక్కి నిర్మాణాల్లో ఆలస్యం ఎందుకు చేశారు? ఇసుక, సిమెంటు ధరల పెరుగుదల ముందుగా తెలియదా? డిజైన్స్ మార్చమన్నదెవరు? పునాది దశలోనే డిజైన్స్ మార్చినపుడు విద్యాశాఖ లేదా ప్రభుత్వ ఆమోదం ఎందుకు తీసుకోలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అన్నీ అసంపూర్తే.. ఐదారు గదులు మినహా పూర్తయ్యాయని చెబుతున్న 212 భవనాలు కూడా అసంపూర్తిగానే ఉండిపోయాయి. మరో 43 భవనాలు ఇంకా ఫినిషింగ్ దశలోనే ఉండగా, మరో 33 భవనాలు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ దశల్లోనే ఉండిపోయాయి. పైకప్పు వేసినవి 36, వేయాల్సిన దశలో 6, బేస్మెంట్ లెవల్లోనే మరో 8 స్కూళ్లు ఉన్నాయి. -
మోడల్ స్కూళ్లు
=అక్షరాస్యత పెంపు ధ్యేయం =ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి రవికాంత్ వెల్లడి మునగపాక, న్యూస్‌లైన్ : మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పలు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి కె. రవికాంత్ అన్నారు. మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్‌ను ఆయన సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల పరిశీలనలో భాగంగా ఆయన ఇక్కడి స్కూల్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. హాస్టల్ నిర్మాణం పూర్తయితే మోడల్ స్కూల్‌కు సంబందించిన ఉపాధ్యాయులలో ఒకరిని వార్డెన్‌గా నియమిస్తామన్నారు. హాస్టల్ మోనటరింగ్ను వార్డెన్ చూసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ] మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఉత్సాహం : రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారని రవికాంత్ అన్నారు. మోడల్ స్కూల్ తనిఖీలో భాగంగా తనను కలిసిన విలేకరులతో రవికాంత్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో 324 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల నియామకం వల్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పలు పాఠశాలల్లో హాస్టల్ నిర్మాణాలు పూర్తి కావచ్చాయన్నారు. ఇవి పూర్తయితే బాలికలకు ఎంతగానో సదుపాయం ఉంటుందన్నారు. ఇంతవరకు గ్రామీణప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో మహిళలు చదువులకు దూరంగా ఉండేవారని చెప్పారు. ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటు వలన ఇటువంటి సమస్య ఉండదని తెలిపారు. మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి మోడల్ స్కూళ్లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. రవాణా సమస్య గురించి మాట్లాడుతూ, బస్సు ఏర్పాటుకు సంబంధిత ఆర్టీసీ డిపోనుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. పిల్లల్లో ఒకరిగా.. : తనిఖీల సందర్భంగా రవికాంత్ ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల హాజరుశాతాన్ని గమనించారు. విద్యాబోధన తీరును గమనించేందుకు పాఠశాల గదుల్లో విద్యార్థుల మధ్య కూర్చుని పాఠాలు విన్నారు. బాలుర, బాలికల టాయ్లెట్లను, ప్రయోగశాలలను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న హాస్టల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
పునాదుల్లోనే ‘ఆదర్శ’ పాఠశాలలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నంగునూరు మండలం అక్కెనపల్లికి తొలి విడతలో ఆదర్శ పాఠశాల మంజూరైంది. భవన నిర్మాణం పూర్తి కాకమునుపే తరగతులు ప్రారంభించారు. సొంత భవనం లేకపోవడంతో పాలమాకుల ప్రభుత్వ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు తాత్కాలికంగా తరగతులు నిర్వహించారు. అక్కడా సరైన వసతులు లేకపోవడంతో పక్షం రోజుల క్రితం గట్లమల్యాల ప్రాథమిక పాఠశాల ఆవరణకు విద్యార్థులను తరలించారు. అక్కెనపల్లిలో జరుగుతున్న ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ పనులు పునాదుల్లోనే ఉండటంతో మరో ఏడాదైనా సొంత గూడు సమకూరే పరిస్థితి లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో పిల్లలను చేర్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో జిల్లాకు మంజూరైన 24 ఆదర్శ పాఠశాలల్లోనూ ఇంచుమించు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఒక్కో ఆదర్శ పాఠశాల నిర్మాణానికి రూ.3.02 కోట్లు చొప్పున 24 ఆదర్శ పాఠశాలలకు రూ.72.48 కోట్లు మంజూరయ్యాయి. 24 భవనాల నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించిన అధికారులు, గత ఏడాది జనవరి 19న కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌళిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టు సంస్థలు అంచనా విలువకు 0.07 శాతం తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకున్నాయి. రామాయంపేట మోడల్ స్కూల్ పనులు మాత్రం అంచనా విలువకు 8.19శాతం తక్కువ కోట్ చేయగా పనులు కేటాయించారు. పనులు దక్కించుకున్న సంస్థలు 16 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ కాంట్రాక్టర్లు గత ఏడాది ఫిబ్రవరి మొదలుకుని మే వరకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెళ్లారు. ఒప్పందం తేదీని పరిగణనలోనికి తీసుకున్నా 21 భవనాలకు సంబంధించి ఇప్పటికే నిర్దేశిత కాల పరిమితి ముగిసింది. నిబంధనల మేరకు నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టు సంస్థలకు తొలుత నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అపరాధ రుసుము కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇతరులకు సబ్ కాంట్రాక్టు పద్ధతిలో పనులు అప్పగించారు. అక్సాన్‌పల్లి (అందోలు), టేక్మాల్, గుండ్లమాచునూరు (హత్నూర), తిరుమలాపూర్ (చిన్నశంకరంపేట), మోర్గి (మనూరు), అక్కెనపల్లి (నంగునూరు) పాఠశాలల భవనాల నిర్మాణ పనులు ఇంకా పునాదుల్లోనే ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. మిగతా చోట్ల గోడలు, స్లాబ్‌ల స్థాయిలోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇసుక కొరత వల్లేనట! ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాకపోవడానికి ఇసుక కొరతే ప్రధాన కారణమని ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు చెప్తున్నారు. ‘‘ఇసుక క్వారీయింగ్‌పై జిల్లాలో ఆరు నెలలుగా నిషేధం ఉంది. కొంతకాలం సడలించినా మళ్లీ నెల రోజులుగా క్వారీయింగ్ జరగడం లేదు. రెవెన్యూ విభాగంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినా ఇసుక కేటాయించడం లేదు. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఇసుకను కేటాయించినా అందులో నాణ్యత ఉండటం లేదు’’ అంటూ అధికారులే సమస్యలు ఏకరువు పెడుతున్నారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదే కదా అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఓ వైపు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా, మరోవైపు ఖర్చు చేసిన మొత్తాన్ని అధికారులు భారీగానే చూపుతున్నారు. ఇప్పటికే రూ.34.01 కోట్లు వ్యయం చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే సహేతుక కారణాలు లేకుండా నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. -
‘మోడల్’కు మోక్షమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గత ఏడాది మంజూరైన మరో 234 మోడల్ స్కూళ్లకు మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక భారం సాకుతో వాటి నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. 2009లో మంజూరైన 355 స్కూళ్ల నిర్మాణం, నిర్వహణ, వేతనాల్లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించింది. అయితే గత ఏడాది మంజూరు చేసిన 234 స్కూళ్లకు మాత్రం 50 శాతం నిధులను మాత్రమే ఇస్తామని కేంద్రం పేర్కొంది. దీంతో మంజూరై ఏడాది కావస్తున్నా వాటి నిర్మాణాలపై రాష్ట్ర సర్కారు శ్రద్ధ చూపడం లేదు. సెకండరీ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపినా.. వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లను ప్రారంభించాలంటే ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేపడితే తప్ప సాధ్యం కాదు. ఇంకా ఆలస్యమైతే అసలు ఈ స్కూళ్ల ప్రారంభమే కుదిరే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని అన్ని మండలాలకు స్కూళ్లు.. రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన మండలాలు 737 ఉన్నాయి. ఆ మండలాలు అన్నింటికి మోడల్ స్కూళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం 2009 డిసెంబర్లోనే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా అప్పుడే 355 స్కూళ్లను మంజూరు చేసింది. 2011 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఈ స్కూళ్లు.. నిర్మాణాలు చేపట్టడంలో పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా 2013లో మొదలయ్యాయి. అయినా ఇప్పటికీ అన్ని స్కూళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అన్ని వసతులతో 150 స్కూళ్లు కూడా పని చేయడం లేదు. ఈ పరిస్థితుల్లోనే గత ఏడాది డిసెంబర్లో మరో 234 స్కూళ్లను మంజూరు చేసింది. అయినా ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఇవి పూర్తి చేస్తే తప్ప మరో 148 స్కూళ్లను కేంద్రం మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్థిక భారమనే ఉద్దేశంతోనే.. ఐదెకరాల స్థలంలో ఏర్పాటు చేయాల్సిన ఒక్కో మోడల్ స్కూల్‌ను రూ. 3.02 కోట్లతో నిర్మించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా 234 స్కూళ్లకు రూ. 706 కోట్లు అవసరం. ఇందులో 50 శాతం వాటా (రూ. 353 కోట్లు)ను రాష్ట్రం భరించాల్సిందే. ఇవే కాకుండా నిర్వహణ, టీచర్ల వేతనాల్లో కూడా 50 శాతం నిధులను రాష్ట్రం భరించాలి. అంతకుముందు స్కూళ్లకు 25 శాతం నిధులను మాత్రమే భరించిన రాష్ట్రం.. ఇపుడు 50 శాతం వెచ్చించాల్సి రావడంతో వెనుకడుగు వేస్తోంది. నిర్మాణాల్లోనే కాక స్కూళ్ల నిర్వహణ, వేతనాల్లో కూడా భారాన్ని భరించాల్సి ఉండటంతో రాష్ట్ర సర్కారు కొత్త స్కూళ్ల గురించి పట్టించుకోవడం లేదు. -
మో‘డల్’ పాఠశాలలు
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాలల(మోడల్ స్కూళ్లు)ను గతేడాది ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పాఠశాలల భవనాల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయినా ఈ భవనాల్లోనే తరగతులు ప్రారంభించారు. పాఠశాలకు ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల నియమించాలి. కాని పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న కొద్ది మంది టీచర్లే మిగలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. మరి కొన్ని సబ్జెక్టులకు విద్యార్థుల తల్లిదండ్రులే టీచర్లను నియమించి జీతాలు చెల్లిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలీచాలని తరగతి గదులు మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లెలో ఈ ఏడాది మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. పాఠశాల్లో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారు. ఒక్కొక్క తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుని రెండు సెక్షన్లుగా విభజించాలి. 6, 7, 8 తరగతుల్లో 240 మందికిగానూ 225 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 మందికిగానూ 53 మంది చేరారు. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను కేటాయించాల్సి ఉంది. కానీ టీచర్ల కొరతతో 75 మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ లేకపోవడంతో కొందరు కిందే కూర్చొంటున్నారు. సిబ్బంది కొరత మోడల్ పాఠశాలకు ప్రిన్సిపాల్, 14 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఆరుగురు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను నియమించాలి. కానీ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్, ఆరుగురు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను మాత్రమే తీసుకున్నారు. దీంతో పాఠశాల్లోని పీడీ, ఇతర టీచర్లే మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థికసాయంతో టీచర్లకు జీతాలు ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులకు టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు టీచర్లతో తమ పిల్లలకు పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఈ టీచర్లకు తల్లిదండ్రులే జీతాలు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రిన్సిపాల్ కూడా బోధన చేస్తున్నారు. సౌకర్యాలు నిల్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. కానీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి వద్ద నుంచే పాఠశాలకు హాజరవుతున్నారు. పాఠశాలలో మంచినీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. మరి కొందరు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలకు ల్యాబ్ సామగ్రి రాలేదు. దీంతో ప్రయోగశాలలు నిరుపయోగంగా మారాయి. త్వరలోనే భర్తీ చేస్తాం: వెంకటేశ్వరరెడ్డి, మోడల్ స్కూల్స్ ఇన్ చార్జి మోడల్ స్కూల్లో టీచర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మిట్టమీదపల్లెలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖా మంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తాం. -
ఆదర్శం.. అస్తవ్యస్తం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: కేంద్రీయ విద్యాలయాల తరహాలో బోధన ఉంటుందన్నారు. గ్రామీణ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతామని ప్రగల్బాలు పలికారు. రాష్ట్రస్థాయిలోనే గాక జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సైతం మన విద్యార్థులు అవలీలగా ర్యాంకులు సాధిస్తారని గొప్పలు చెప్పుకున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.3కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. మూడేళ్ల పాటు పడీలేస్తూ పాఠశాల నిర్మాణాన్ని అరకొరగా పూర్తి చేశారు. హడావుడిగా ప్రిన్సిపల్, పిజిటి, టిజిటి, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ ప్రకటించారు. నియామకాల్లో మాత్రం నత్తతో పోటీపడ్డారు. తీరా టిజిటిలతో ప్రస్తుతం పనిలేదని వారి నియామకాలను పక్కన పెట్టారు. దీంతో జిల్లాలో 216 మంది టిజిటిలు ఎంపికై నియామకం పొందలేక త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడుతున్నారు. మరోవైపు బోధనేతర సిబ్బంది పోస్టులను ఎమ్మెల్యేల పేరు చెప్పి అవుట్సోర్సింగ్ సంస్థలు అమ్ముకున్నాయన్న విమర్శలూ వ్యక్తం అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం హాస్టళ్లు లేకుండానే, అరకొర వసతులతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలపై మంగళవారం న్యూస్‌లైన్ విజిట్ చేసింది. ఈ విజిట్‌లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ చదువులు చెప్పిస్తామంటూ జిల్లాలో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో ప్రతి మండలానికో పాఠశాలను మంజూరు చేసింది. ఐదెకరాల విస్తీర్ణంలో ప్రతి మండల కేంద్రంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే అప్పటి జిల్లా విద్యాశాఖాధికారులు కేవలం 36 మండలాల్లో మాత్రమే పాఠశాలకు స్థలాన్ని చూపగలిగారు. దీంతో ఒక్కో పాఠశాలకు రూ.3.02కోట్లను మంజూరు చేశారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో కేవలం 31 పాఠశాలలు మాత్రమే అందుబాటులోకి రావడంతో వాటిలోనే తరగతులు ప్రారంభించారు. పగిడ్యాల, బేతంచర్ల, కోసిగి, నంద్యాల, ఆళ్లగడ్డలో నిర్మాణం పూర్తి కాలేదు. ప్రతి పాఠశాలలో ఆరు నుంచి 12వ తరగతి వరకు తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. మొదటి సంవత్సరం ఆరు నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరాన్ని ప్రారంభించారు. ఇంటర్ మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులను పరిచయం చేశారు. మొదట్లో రెసిడెన్సియల్ పాఠశాలగా చెప్పిన అధికారులు భవన నిర్మాణం పూర్తి కాలేదని చెప్పి డే స్కాలర్‌గా ప్రారంభించారు. దీంతో విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలోనూ పూర్తిగా వసతులు, సౌకర్యాలు కల్పించలేకపోయారు. అరకొర ఉపాధ్యాయులతో విద్యార్థులకు బోధిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా విద్యార్థులకు అందించలేకపోతున్నారు. -
ఆదర్శం.. అపహాస్యం
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్(ఆదర్శ)స్కూల్స్ వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండుడగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 12 వతరగతి వరకు సీబీఎస్ఈ బోధన సాగించడంతో పాటు బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పించాలనే నిబంధన ఉత్తమాటే అయ్యింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు హాస్టల్ సదుపాయం లేదని ప్రభుత్వం చేతులేత్తేసింది. ఒక్కో పాఠశాలలో 6,7,8 తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో కలిపి 320 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. బోధన కోసం ఒక ప్రిన్సిపాల్, 13 పీజీటీ, ఆరు టీజీటీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు పాఠశాలల్లో ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులను మాత్రమే భర్తీచేసి టీజీటీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఈ స్కూళ్లల్లో ప్రవేశాలు పొందిన 6,7,8, 11 వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ప్రారంభించిన 47 ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంత వరకూ స్లాబ్‌లు పూర్తయి గదుల నిర్మాణం జరగని పాఠశాలలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు టీజీటీల నియామకాలు ఇంత వరకు చేపట్టకపోవడంతో పీజీటీలపై తీవ్ర పనిభారం పడుతోంది. పాఠశాలల్లో 6,7,8 తరగతులను ఒక్కోదాంట్లో రెండు సెక్షన్లుగా విభజించగా.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో విద్యాబోధనకు పీజీటీలు సరిపోవడం లేదు. దీంతో ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతోంది. తరగతులను నెట్టుకవచ్చేందుకు ప్రిన్సిపాళ్లు తంటాలు పడుతున్నారు. సిలబస్ ముందుకు సా గక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక పాఠశాలల్లో ప్రతి పాఠశాలకు ఒక వాచ్మెన్, అటెండర్, కం ప్యూటర్ అపరేటర్లను నియమించాల్సి ఉండగా ఇంత వరకు వాటి ఊసేలేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్ల నిర్వహణపై జిల్లా అధికారులు జాప్యం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది లేకపోవడం తో పాఠశాలల్లో బెల్లుకొట్టడం, గదులు ఊడ్చడం వంటి పనులు విద్యార్థులతోనే చేయించే పరిస్థితి నెలకొంది. ఈ ఐదు చోట్ల గందరగోళం జిల్లాలో మొదటి విడతలో కాకుండా రెండో విడతలో ప్రవేశాలు కల్పించిన కరీంనగర్, బెజ్జంకి, ధర్మారం మండలాల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. జమ్మికుంట, మహాముత్తారంలో ప్రిన్సిపాల్ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఈ మండలాల్లో ఇంత వరకు తరగతులు ప్రారంభించనే లేదు. ప్రిన్సిపాల్ పోస్టును మాత్రమే భర్తీ చేసి మిగతా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో అక్కడ ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. బెజ్జంకి మండల కేంద్రంలో ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు దీక్షకు సైతం దిగాయి. ఈ ఐదు పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆదర్శ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకాలు, భవన నిర్మాణ పనులవేగవంతం, టీజీటీ నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టేలా ఉన్నతాధికారులకు ఒత్తిడి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మో‘డల్’ విద్య
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత తీవ్రంగా ఉంది. 2011 లోనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో 2013 విద్యా సంవత్సరంలో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలున్నారు. వీటిలో ప్రిన్సిపాల్స్, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు పూర్తి స్థాయిలో లేరు. టీజీటీ (టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినప్పటికీ వీరిలో కొంత మందిని మాత్రమే నియమించారు. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థులు అర్హత పరీక్ష రాసినప్పటికీ కొంతమంది విధుల్లో చేరకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో 16 మంది ప్రిన్సిపాల్స్‌కు ఐదుగురు, 160 మంది పీజీటీలకు 131 మంది, 112 మంది టీజీటీలకు ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఐదు చోట్లే ప్రిన్సిపాళ్లు విద్యాపరంగా వెనకబడిన మండలాల్లో మోడల్ పాఠశాల లు ఏర్పాటు చేశారు. కేవీబీపురం, కేవీపల్లి, కురబలకోట, పుంగనూరు, ఎర్రావారిపాళెం మండలాల్లోని పాఠశాలల్లో మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలిన చోట్ల ఎంఈవోలు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి మండల స్థాయిలో అనేక పనులు ఉండడంతో మోడల్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారనే విమర్శలున్నాయి. టీజీటీలు హిందీ సబ్జెక్టుకు మాత్రమే కేవీబీపురం, కేవీపల్లి, కలకడ, కు రబలకోట, పుంగనూరు మండలాల్లో ఉన్నారు. పీజీటీలు ఒక్కో పాఠశాలలో 10 మంది ఉండాల్సి ఉండగా బి.కొత్తకోటలో ఆరుగురు, బెరైడ్డిపల్లెలో తొమ్మిది మంది, గుడిపల్లిలో ఇద్దరు, కలకడలో తొమ్మిది మంది, కుప్పంలో ఏడుగురు, కేవీబీపురంలో తొమ్మిదిమంది, కేవీపల్లిలో తొమ్మిది మంది, కురబలకోటలో ఆరుగురు, పెద్దమండ్యంలో తొమ్మిది మంది, పీటీఎంలో ఐదుగురు, పుంగనూరులో ఏడుగురు, శాంతిపురంలో తొమ్మిది మంది, తంబళ్లపల్లిలో ఐదుగురు, ఎర్రావారిపాళెంలో తొమ్మిది మంది మంది ఉన్నారు. -
అక్రమాలకు ‘మోడల్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూళ్ల)ల్లో ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో ఏజెన్సీలు భారీ అక్రమాలకు తెరతీశాయి! రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లాంటి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు దిగాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సరిగా అవకాశం ఇవ్వకుండా, ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వకుండానే ముడుపులు మింగుతూ పోస్టును బట్టి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లకు సిద్ధం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 355 మోడల్ స్కూళ్లకుగాను ఈ ఏడాది 321 మోడల్ స్కూళ్లు ప్రారంభించారు. వీటిల్లో ఒక్కో స్కూల్లో 14 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌పై భర్తీ చేయాల్సి ఉంది. అందులో భాగంగా తొలుత ఒక్కో స్కూల్లో 3 పోస్టుల చొప్పున 963 పోస్టుల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను జిల్లాలకు అప్పగించింది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను తీసుకొని వాటి ద్వారా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. ఒక్కో స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఎస్‌యూపీడబ్ల్యూ టీచర్(ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్), యోగా టీచర్, ఫిజికల్ డెరైక్టర్, ఆరు అటెండర్ (అటెండర్, వాచ్మెన్), కంప్యూటర్ టీచర్, ప్రోగ్రామర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వెంటనే ప్రతి స్కూల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్, 1 అటెండర్, 1 వాచ్మెన్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఔట్సోర్సింగ్ సంస్థలను ఎంపిక చేసిన అధికారులు పత్రికా ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను నుంచి దరఖాస్తులను స్వీకరించి, నిబంధనల ప్రకారం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారు. దళారులతో కుమ్మక్కైన ఏజెన్సీలు భారీగా వసూళ్లకు దిగాయి. నిబంధనలు పక్కనబెట్టి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు రూ. లక్ష వరకు, అటెండరు, వాచ్మెన్ పోస్టులకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాయి.