మోడల్ స్కూళ్లకు బస్సు సర్వీసులు | Model of bus services to schools | Sakshi
Sakshi News home page

మోడల్ స్కూళ్లకు బస్సు సర్వీసులు

Published Thu, Feb 19 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

Model of bus services to schools

అనకాపల్లి-విశాఖ మధ్య 7 ఏసీ బస్సులు
కాంప్లెక్స్‌ల్లో ప్రతి నెలా స్వచ్ఛభారత్
ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.రామకృష్ణ

 
అనకాపల్లి/చోడవరం: జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల మీదుగా బస్సు సర్వీసులు వేస్తున్నామని  ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.రామకృష్ణ చెప్పారు. అనకాపల్లి, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడు తూ, మోడల్ స్కూళ్లు ఉన్న మరుపాక, తేగాడ, నర్సీపట్నం నుంచి వ యా శరభవరం, వ డ్డిప, తోటకూరపాలెం-తట్టబంద రూట్లలో బస్సు సర్వీసులు వేస్తున్నామన్నారు. ఆ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యుల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ఈ సర్వీసులు నడుపుతున్నామని చెప్పా రు. అనకాపల్లి-విశాఖ మధ్య ఏడు ఏసీ వాల్వో బస్సులను నడపనున్నట్లు తెలి పారు. అనకాపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ గతనెలలో విజయనగరంజోన్‌కు రూ.2.5 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాకినాడ నుంచి చెన్నైకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడప, పొద్దుటూ రు, శ్రీశైలం రీజియన్ పరిధిలో సౌకర్యాలను మెరుగుపరిచామన్నారు.

డిమాం డ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతనంగా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నెలా 16న ఆర్టీసీ డిపోలు, కాంప్లెక్స్‌ల్లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తామన్నారు. అనకాపల్లి కాంప్లెక్స్ ఆవరణలో మొక్కలను నాటారు. చోడవరం కాంప్లెక్స్‌లో మరుగుదొడ్ల నిర్వాహకులు నిర్దేశించిన రుసుం కంటే అదనం గా వసూలు చేస్తున్నట్టు తెలియడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి రూ. 500 జరిమానా విధించారు. ఆర్టీసీ కాం ప్లెక్స్‌లను పరిశుభ్రంగా ఉంచేలా ప్ర యాణికులు సహకరించాలని కోరారు. రద్దీగా ఉండే రూట్లలో అదనపు బస్సు లు నడిపేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రధాన పట్టణాలకు అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎప్పకప్పుడు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో బస్సులు నడుపుతున్నామన్నారు. చోడవరం -విజయనగరం సర్వీసును పరిశీ లిస్తామన్నారు. ఆయనతోపాటు ఆర్టీసీ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్, జిల్లా రీజనల్ మేనేజర్ జగదీష్‌బాబు, అనకాపల్లి అసిస్టెంట్ మేనేజర్ రమణమ్మ పాల్గొన్నారు.
 
ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం

యలమంచిలి: విశాఖపట్నం-యలమంచిలికి త్వరలో ఏసీ వాల్వో బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ చె ప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెం చడంతో పాటు  ప్రయాణికులకు ప్రత్యేకంగా అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. బుధవారం యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్ పరిసరాలు,మరుగుదొడ్లు పరిశీలించారు. ప్ర యాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7.30 గంటలు దాటితే యలమంచిలి నుంచి పాయకరావుపేటకు బస్సు లు అందుబాటులో లేవని, హైదరాబా ద్ వెళ్లేందుకు గతంలో ఉన్న సర్వీసును కూడా నిలిపివేసిన సంగతిని కొందరు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే లగ్జరీ సర్వీసును బుధవారం సాయంత్రం నుంచే యలమంచిలి కాంప్లెక్స్‌కు వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ వా హనాల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఆర్టీఏ అధికారులతో మాట్లాడి ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement