శ్రీశైల మహాక్షేత్రానికి మరిన్ని బస్సు సర్వీసులను కొనసాగిస్తామని ఆత్మకూరు ఆర్టీసీ డిపో నూతన డీఎం హుసేన్ సాహెబ్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో సోమవారం నంద్యాల నుంచి ఆత్మకూరుకు బదిలీపై వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు డిపో నుంచి గతంలో ఉన్న శ్రీశైలం - బెంగుళూరు, శ్రీశైలం - చెన్నై బస్సులతో పాటు నంద్యాల - శ్రీశైలం, కర్నూలు - శ్రీశైలం బస్సు సర్వీసులతో పాటు అదనంగా మరిన్ని పల్లె వెలుగు బస్సుసర్వీసులను నడపనున్నట్లు తెలిపారు.
శ్రీశైల క్షేత్రానికి మరిన్ని సర్వీసులు
Published Mon, Sep 28 2015 6:58 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement