శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన దంపుతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన దంపుతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆలయ సమీపంలోని అన్నపూర్ణ సత్రంలో దంపుతులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సైదులు కుటుంబంగా పోలీసులు అనుమానిస్తున్నారు.