సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని మోడల్ స్కూళ్లు త్వరలోనే పాఠశాల విద్యలో విలీనం కానున్నాయి. ప్రభు త్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల కష్టాలు తీరనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను రెసిడెన్షియల్ తరహాలో అందించాలని దివంగ త ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి యోచించి మోడల్ స్కూల్ వ్యవస్థకు రూపక ల్పన చేయించారు. ఆయన మరణానంతరం దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో 2013 వరకు ప్రారంభానికి నోచుకోలేదు. అటు తరువాత మోడల్ స్కూళ్లు ప్రారంభం కాగా ప్రత్యేక సొసైటీ ద్వారా వీటిని నిర్వహింపజేశా రు. దీని వలన పాఠశాలలపై ఎవరి అజమాయిషీ లేకుండా పోయింది.
సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ కూడా లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా పీఆర్‌సీ, డీఏ వం టివి అమలుకాకపోవడం, జీతా లు సకాలంలో అందకపోవడం వంటి సమస్యలు ఉండేవి. దీని వలన విద్యాశాఖ నుంచి కొంద రు మోడల్ స్కూళ్లకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చేశారు. అటు తరువాత భర్తీలు లేకపోవడంతో ప్రతి ఏటా కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయులను నియమించుకొని బోధన సాగించేవారు. వీరికి కూడా ఏళ్ల తరబడి వేతనా లు పెండింగ్ ఉండడంతో ఈ పోస్టులకు డిమాండ్ లేకుండా పోయింది. విద్యా శాఖలో విలీన నిర్ణయంతో జిల్లాలో 132 మం ది రెగ్యులర్ ఉపాధ్యాయులకు మేలు జరగనుంది. సకాలంలో జీతాలు అందుతాయని 90 మంది కాంట్రాక్టు టీచర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ..
గతంలో విద్యాశాఖలోని ఏడీ స్థాయి అధికారిని మోడల్ స్కూల్ ఇన్‌చార్జిగా నియమించగా ఆయన కేవలం అడ్మిషన్లను పర్యవేక్షించేందుకు మాత్రమే పరిమితమయ్యేవారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రతి జిల్లాలో ను మోడల్ స్కూళ్ల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడల్ స్కూళ్లపై అధ్యయనం చేయించిన ముఖ్యమంత్రి మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర అధికారులు అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యా రు.
శ్రీకాకుళం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు ఉన్నా యి. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులను బోధిస్తుండగా ఒక్కో స్కూల్‌లో 600 నుంచి 700 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అన్ని స్కూళ్లలో హాస్టళ్లు ఏర్పా టు చేయాల్సి ఉండగా 8 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు వసతి గృహాలను నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం మోడల్ స్కూళ్లపై తీవ్ర వివక్ష చూపింది. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి సౌకర్యాలు కల్పించలే దు. వీరు ఇప్పటికీ ఐఆర్‌కు నోచుకోలేదు. ప్రస్తు తం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖలోకి విలీనం చేస్తే సర్వీసుకు సంబం ధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేలా అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం..
మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని ముఖ్య మంత్రి నిర్ణయించడం హర్షణీయం. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా రు. వీటిని పరిష్కరించే నాథు డే కరువయ్యారు. పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలను వివరించాం. అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం.
– బీవీ సత్యనారాయణ, మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment