merged
-
హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం!
రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 'జియో హాట్‌స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+ హాట్‌స్టార్‌కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్లో 120 టీవీ ఛానెల్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి మొదట హాట్‌స్టార్‌నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్లోడ్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది. -
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, గణపవరం/ భీమవరం(పశ్చిమ గోదావరి): గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గణపవరం మండలాన్ని ఏలూరు రెవెన్యూ డివిజన్ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ పేరుమీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే 30 రోజుల్లోపు కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ఈ ఏడాది మే నెలలో గణపవరంలో జరిగిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతామని సభాముఖంగా ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 20 మండలాలతో జిల్లా జిల్లాల పునర్విభజనతో పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమలో విలీనం చేయడంతో మండలాల సంఖ్య 20కి చేరనుంది. అలాగే 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు?
ముంబై: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మౌలిక రంగ ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్‌నకు చెందిన ఈ రెండు సంస్థలు విలీనమైతే 22 బిలియన్ డాలర్ల(రూ. 1,65,000 కోట్లు) విలువైన ఐటీ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు అంచనా. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ బోర్డులు విలీనానికి అనుగుణంగా షేర్ల మార్పిడి అంశాన్ని పరిశీలించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా మాతృ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) లిస్టెడ్ ఐటీ కంపెనీలు రెండింటి విలీనానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేసినట్లు వెల్లడించాయి. తద్వారా గ్లోబల్ డిజిటల్ దిగ్గజాలతో విలీన సంస్థ పోటీపడేందుకు వీలుంటుందని మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ భావిస్తున్నట్లు తెలియజేశాయి. వచ్చే వారమే? మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నియంత్రణలోని ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనానికి షేర్ల మార్పిడి అంశంపై వచ్చే వారం మొదట్లోనే బోర్డులు చర్చించే వీలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీను 2019లో ఎల్అండ్టీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 61 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తాజాగా రూ. 65,287 కోట్లు (8.7 బిలియన్ డాలర్లు)స్థాయికి చేరింది. ఇక ఎల్అండ్టీకి 74 శాతం వాటా కలిగిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ విలువ రూ. 1,02,825 కోట్లు(13.7 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి విలీన సంస్థ మార్కెట్ క్యాప్ 22 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. క్లయింట్ల విషయంలో.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనమైతే క్లయింట్లు లేదా బిజినెస్‌లో పరస్పర అతిక్రమణ నామమాత్రంగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వీసులకు అధిక ధరలు పొందేందుకు, వ్యయాల నియంత్రణకు రెండు సంస్థల మధ్య ఒప్పందం దారి చూపుతుందని అంచనా వేశాయి. అయితే విలీనం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే వీలున్నట్లే.. ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నదని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్అండ్టీ ప్రతినిధి ఒకరు నిరాకరించగా.. మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ నుంచి స్పందన కరువైనట్లు తెలియజేశాయి. మైండ్‌ట్రీ క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాలను సోమవారం(18న) విడుదల చేయగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్పనితీరు నేడు(19న) వెల్లడికానుంది. కోవిడ్–19 ఎఫెక్ట్ కొద్ది నెలలుగా ప్రపంచస్థాయిలో విస్తరించిన కోవిడ్–19 మహమ్మారితో డిజిటైజేషన్‌కు డిమాండు బాగా పెరిగినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీలకు బిజినెస్ అవకాశాలు భారీగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ ఔట్సోర్సింగ్ దిగ్గజాలు సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, మెషీన్‌లెర్నింగ్ సపోర్ట్ తదితర నవతరం సేవలు అందించేందుకు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. షేర్లు డీలా: మైండ్‌ట్రీ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 3,965 వద్ద నిలవగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.5 శాతం నష్టంతో రూ. 5,890 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో మైండ్‌ట్రీ రూ. 4,020–3,834 మధ్య ఊగిసలాడింది. మైండ్‌ట్రీ లాభం జూమ్ న్యూఢిల్లీ: ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 49% జంప్‌చేసి రూ. 473 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో రూ. 317 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతంపైగా ఎగసి రూ. 2,897 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,109 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక పూర్తి ఏడాదికి మైండ్‌ట్రీ కన్సాలిడేటెడ్ నికర లాభం 49% వృద్ధితో రూ. 1,653 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 7,968 కోట్ల నుంచి రూ. 10,525 కోట్లకు ఎగసింది. ఇది 31% అధికం. షేరుకి రూ. 27 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. కాగా, మెండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్ మధ్య విలీన వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనంటూ మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ దేవశిష్ కొట్టిపారేశారు. చదవండి: -
ఆ ఒక్కటీ పాయె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుత శాసనసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యానికి ముగింపు పలుకుతూ ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలోనే టీఆర్ఎస్లో చేరిన మరో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మెచ్చా బుధవారం సాయంత్రం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తొలుత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మెచ్చా నాగేశ్వర్రావు, సండ్ర వెంకట వీరయ్యలు భేటీ అయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి మంత్రుల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో టీడీపీని విలీనం చేయాల్సిందిగా కోరుతూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్ పక్షాన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీఆర్ఎస్లో టీడీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలని ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని నాలుగో పేరాను అనుసరించి విలీనాన్ని ఆమోదిస్తూ, శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులతో పాటు వారికి స్థానాలు కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. తమ విలీన నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు కూడా లేఖను అందజేశారు. వీరి వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం టీడీపీ శాసనసభా పక్షం విలీనంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్యా బలం 104కు చేరింది. ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎంతో మెచ్చా భేటీ.. సండ్ర మధ్యవర్తిత్వం 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు నామమాత్రంగా తయారయ్యాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ఉనికిని చాటుకోలేక పోయింది. ఇటీవల జరిగిన శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నామమాత్ర ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చిన మెచ్చా నాగేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చా పలుమార్లు కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరాలనే ఆకాంక్షను వెలిబుచ్చినట్లు తెలిసింది. కాగా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా మెచ్చా చేరికలో క్రియాశీలంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా రెండు రోజుల క్రితం భేటీ అయినట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్లో మెచ్చా చేరిక, టీడీపీ శాసనసభా పక్షం విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత శాసనసభలోనూ టీడీఎల్పీ విలీనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో ఏర్పాటైన తొలి శాసనసభకు టీడీపీ నుంచి 15 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో 12 మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో తెలుగుదేశంను వీడి టీఆర్ఎస్లో చేరారు. నాటి టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరుతూ అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి లేఖ అందజేయగా ఆమోదిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండో పర్యాయం కూడా టీడీపీ శాసనసభా పక్షం టీఆర్ఎస్లో విలీనం కావడం గమనార్హం. శాసనసభలో ఉనికి కోల్పోయిన టీడీపీ కాగా 2018 సాధారణ ఎన్నికల్లో టీడీపీ పక్షాన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే 2019 మార్చిలో సండ్ర టీఆర్ఎస్లో చేరినా సాంకేతికంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. టీడీపీకి చెందిన మరో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వర్రావు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు నాలుగో పేరా నిబంధన ప్రకారం... ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు తాము వేరే ఏదైనా పార్టీలో విలీనం కావాలనుకుంటే అందుకు స్పీకర్ అనుమతించాల్సి వుంటుంది. అలాంటప్పుడు వీరికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు టిఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం కావాలని నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ విలీనం సంపూర్ణమైంది. దీంతో రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. చదవండి: మిస్టర్ కేసీఆర్! డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు -
బోర్డు మారింది.. ప్రస్థానం ముగిసింది
సాక్షి, మచిలీపట్నం: ఆంధ్రాబ్యాంక్ ప్రస్థానం ముగిసింది. యూనియన్ బ్యాంక్‌లో విలీనమైపోయింది. తొంబై ఏడేళ్ల చరిత్ర ఇక చరిత్రపుటల్లో కలిసిపోయింది. జిల్లా కేంద్రమైన బందరులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923వ సంవత్సరం నవంబర్ 28న స్థాపించిన ఆంధ్రాబ్యాంకు 1980లో తీసుకొచ్చిన బ్యాంకుల జాతీయకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా దినదిన ప్రవర్థమానమై 2,885 శాఖలు, 3798 ఏటీఎంలు, 20,346 మంది సిబ్బందితో విస్తరించిన ఈ బ్యాంక్ రూ.3,98,511 కోట్ల వ్యాపారంతో రూ.1,80,258 కోట్ల రుణాలు, రూ.2,16,721 కోట్ల డిపాజిట్లతో దేశంలోనే అగ్రశ్రేణి బ్యాంకుల సరసన నిలిచింది. అంతటి చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేయాలని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తినా, రాష్ట్ర స్థాయిలో వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల విలీనం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆరుబ్యాంకులు విలీనం కాగా, జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య పుట్టిన బందరులో పురుడుపోసుకున్న ఆంధ్రాబ్యాంక్ కనుమరుగైంది. బందరులోని వ్యవస్థాపక బ్రాంచ్‌లో బుధవారం ఆంధ్రాబ్యాంక్ స్థానంలో యూనియన్ బ్యాంక్ పేరిట సైన్‌బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా తయారు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆంధ్రాబ్యాంక్ నేమ్ బోర్డు వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. -
రాజమహేంద్రవరం ఇక మహానగరం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం మహానగరంగా రూపుదాల్చుతోంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న 21 గ్రామాల విలీనంతో 5,79,802 జనాభాకు చేరుకుంది. ఇప్పటి వరకూ 44.50 చదరపు కిలో మీటర్లు పరిధిగల ఈ నగరం నాలుగున్నర రెట్లు పెరిగి 217.80 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటి వరకూ 3,41,831 జనాభాతో 50 డివిజన్లకే పరిమితమైన ఈ నగరం 5,79,802 జనాభాతో 54 డివిజన్లకు చేరుకోనుంది. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్ సిటీ; బొమ్మూరు, ధవళేశ్వరం, కాతేరు, వెంకటనగరం, కోలమూరు, రాజవోలు, తొర్రేడు, నిడిగట్ల, పాలచర్ల, లాలాచెరువు, దివాన్‌చెరువు, నామవరం, వెలుగుబంద, గాడాల, మధురపూడి, బూరుగుపూడి, వేమగిరి గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేస్తూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీంతో పట్టణ ప్రణాళిక విభాగం పెరిగిన జనాభా నిష్పత్తిని అనుసరించి డివిజన్ల పునర్విభజన కార్యక్రమం చేపట్టి పూర్తి చేశారు. 4వేలలోపు జనాభా ఉండే డివిజన్ జనాభాను 8 వేల నుంచి 12 వేల వరకూ పెంచి అందుకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యనూ పెంచారు. రాజమహేంద్రవరం నగరంలో ఇప్పటి వరకూ ఉన్న 50 డివిజన్లను 30 డివిజన్లకు కుదించారు. మిగిలిన 24 డివిజన్లను చుట్టు పక్కల గ్రామాల జనాభాతో ఏర్పాటు చేశారు. ఒకటో డివిజన్‌గా లాలాచెరువుతో ప్రారంభమై 54వ డివిజన్ నిడిగట్లతో ముగియనుంది. 54 డివిజన్ల సరిహద్దుల విషయంలో ఏమైనా సలహాలుంటే వారం రోజుల లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని నగర కమిషనర్ అభిషిక్త్ కిశోర్ కోరారు. -
టెలికాం రేసులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్
-
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం
న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్ఎల్ సంస్థ బీఎస్ఎన్ఎల్కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్ఎస్ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. రెండూ కీలక సంస్థలే.. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్ వంటివి. మొత్తం ఆర్మీ నెట్వర్క్ అంతా బీఎస్ఎన్ఎల్ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్ఎస్ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ స్వచ్ఛందమైనదే. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది. రూ. 40 వేల కోట్ల రుణభారం.. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఇక హుషారుగా మో‘డల్’ స్కూళ్లు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని మోడల్ స్కూళ్లు త్వరలోనే పాఠశాల విద్యలో విలీనం కానున్నాయి. ప్రభు త్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల కష్టాలు తీరనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను రెసిడెన్షియల్ తరహాలో అందించాలని దివంగ త ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి యోచించి మోడల్ స్కూల్ వ్యవస్థకు రూపక ల్పన చేయించారు. ఆయన మరణానంతరం దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో 2013 వరకు ప్రారంభానికి నోచుకోలేదు. అటు తరువాత మోడల్ స్కూళ్లు ప్రారంభం కాగా ప్రత్యేక సొసైటీ ద్వారా వీటిని నిర్వహింపజేశా రు. దీని వలన పాఠశాలలపై ఎవరి అజమాయిషీ లేకుండా పోయింది. సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ కూడా లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా పీఆర్సీ, డీఏ వం టివి అమలుకాకపోవడం, జీతా లు సకాలంలో అందకపోవడం వంటి సమస్యలు ఉండేవి. దీని వలన విద్యాశాఖ నుంచి కొంద రు మోడల్ స్కూళ్లకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చేశారు. అటు తరువాత భర్తీలు లేకపోవడంతో ప్రతి ఏటా కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయులను నియమించుకొని బోధన సాగించేవారు. వీరికి కూడా ఏళ్ల తరబడి వేతనా లు పెండింగ్ ఉండడంతో ఈ పోస్టులకు డిమాండ్ లేకుండా పోయింది. విద్యా శాఖలో విలీన నిర్ణయంతో జిల్లాలో 132 మం ది రెగ్యులర్ ఉపాధ్యాయులకు మేలు జరగనుంది. సకాలంలో జీతాలు అందుతాయని 90 మంది కాంట్రాక్టు టీచర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ.. గతంలో విద్యాశాఖలోని ఏడీ స్థాయి అధికారిని మోడల్ స్కూల్ ఇన్చార్జిగా నియమించగా ఆయన కేవలం అడ్మిషన్లను పర్యవేక్షించేందుకు మాత్రమే పరిమితమయ్యేవారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రతి జిల్లాలో ను మోడల్ స్కూళ్ల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడల్ స్కూళ్లపై అధ్యయనం చేయించిన ముఖ్యమంత్రి మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర అధికారులు అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యా రు. శ్రీకాకుళం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు ఉన్నా యి. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులను బోధిస్తుండగా ఒక్కో స్కూల్లో 600 నుంచి 700 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అన్ని స్కూళ్లలో హాస్టళ్లు ఏర్పా టు చేయాల్సి ఉండగా 8 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు వసతి గృహాలను నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం మోడల్ స్కూళ్లపై తీవ్ర వివక్ష చూపింది. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాలు కల్పించలే దు. వీరు ఇప్పటికీ ఐఆర్‌కు నోచుకోలేదు. ప్రస్తు తం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖలోకి విలీనం చేస్తే సర్వీసుకు సంబం ధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేలా అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం.. మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని ముఖ్య మంత్రి నిర్ణయించడం హర్షణీయం. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా రు. వీటిని పరిష్కరించే నాథు డే కరువయ్యారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డికి సమస్యలను వివరించాం. అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం. – బీవీ సత్యనారాయణ, మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
చార్మినార్ జోన్లో.. వికారాబాద్
ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు, నిరుద్యోగ యువత, ఉద్యోగుల కల నెరవేరింది. మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన సీఎం.. వికారాబాద్ జిల్లాను జోగుళాంబ నుంచి చార్మినార్ జోన్లోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జోషిని ఆదేశించారు. సాక్షి, వికారాబాద్: జోన్ మార్పుపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు శుభప్రద్ పటేల్, చిగుల్లపల్లి, రమేశ్‌కుమార్ తదితరులు సీఎం నిర్ణయంతో సంబరాలు జరుపుకొన్నారు. 25, మే 2018న రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు హైదరాబాద్ 6వ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను కొత్తగా ఏర్పాటైన జోగుళాంబ జోన్లో కలుపుతూ ఉత్వర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లోని 44.63 లక్షల జనాభాతో జోగుళాంబను ఏడో జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై అప్పట్లో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వికారాబాద్‌ను చార్మినార్‌జోన్‌లో కలపాలని, లేదంటే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రజల ఆందోళన గమనించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిసి వికారాబాద్‌ను తిరిగి చార్మినార్‌జోన్‌లో కలపాలని సీఎంను కోరుతూ వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతామని సీఎంతోపాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. యువత, ఉద్యోగులకు మేలు.. వికారాబాద్ జిల్లా జోగుళాంబ జోన్లో కొనసాగితే జిల్లాలోని నిరుద్యోగ యువత, ఉద్యోగులకు నష్టం వాటిల్లేది. చార్మినార్ జోన్ పరిధిలో లక్షకుపైగా ఉద్యోగాలు ఉంటాయి. దీనికితోడు కొత్తగా ఏర్పాటైన రెండు మున్సిపాలిటీలు, మూడు మండలాల్లోను ఉద్యోగాల భర్తీ ఉంటుంది. దీంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. చార్మినార్ జోన్లో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్, జీహెచ్ఎంసీల్లో కూడా జిల్లా యువత ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. జోగుళాంబ జోన్ పరిధిలో కేవలం 32వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేవి. ప్రస్తుతం జోన్‌మార్పు నిర్ణయంతో ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. జోన్‌మార్పుతో ఉద్యోగులకు సైతం లాభం చేకూరనుంది. వికారాబాద్ జిల్లా ఉద్యోగుల బదిలీలు కేవలం జోగుళాంబ జోన్ పరిధిలో ఉండేవి కాగా ప్రస్తుతం జోన్‌మార్పుతో చార్మినార్ జోన్లో ఎక్కడైనా బదిలీలు పొందవచ్చు, అలాగే పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉంటుంది. సీఎం నిర్ణయం చరిత్రాత్మకం వికారాబాద్ జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతూ సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఈవిషయం లో కేసీఆర్ జిల్లా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చి.. నెరవేర్చారు. జోన్ మార్పుతో జిల్లా యువతకు, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ప్రజల తరఫున సీఎం కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – రంజిత్‌రెడ్డి, ఎంపీ ఆనందంగా ఉంది తాండూరు: వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడం చాలా ఆనందంగా ఉంది. జిల్లాను జోగులాంబ జోన్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు పంపించాం. – రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే త్వరలో జీవో వస్తుంది పరిగి: జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని ప్రజలు డిమాండ్ చేశారు. వారి ఆకాంక్షలను మేము స్వయంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్నికల సమయంలో వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో విడుదలవుతుంది. – కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే శుభపరిణామం వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపడం శుభపరిణామం. జోగులాంబలో కొనసాగితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం సంతోషంగా ఉంది. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. – రమేష్ కుమార్, అఖిలపక్షం కన్వీనర్ -
కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం..?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శరద్ పవార్‌తో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో ఎన్సీపీని విలీనం చేసే అంశాన్ని ఇద్దరు నేతలు చర్చించి ఉంటారని ఊహాగానాలు వెల్లువెత్తు తున్నాయి. అయితే, ఇరు పార్టీల వర్గాలు అదేం లేదని కొట్టి పారేస్తున్నాయి. శరద్‌పవార్ నివాసానికి వెళ్లిన రాహుల్ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితిపై వారు చర్చించారు. కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను పవార్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కాంగ్రెస్‌కు మరో ఇద్దరు సభ్యుల అవసరం ఉంది. ఎన్సీపీ ఇటీవలి ఎన్నికల్లో మొత్తం ఐదు సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఓట్లు చీలిపోకుండా ఉంటాయి. పార్టీల విలీనం వేరే అంశం. దానిని గురించి నాకు తెలియదు’అని అన్నారు. ఇలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గేతోనూ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. జూన్ 1వ తేదీన జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్త నేతను ఎన్నుకునే విషయమై వీరు చర్చించినట్లు సమాచారం. నేడు ప్రతిపక్షాల సమావేశం లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో నేడు ప్రతిపక్ష పార్టీల నేతలు తొలిసారి సమావేశం కానున్నారు. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు చర్చించనున్నారు. టీవీ చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనబోదు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ విముఖత.. పార్టీలో నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో ఒక నెలపాటు టీవీల్లో జరిగే రాజకీయ చర్చా కార్యక్రమాలకు పిలవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికే పీసీసీ అధ్యక్షుడికి రాజీనామా పత్రాలు సమర్పించినట్లు వీరు చెబుతున్నారు. అయితే, వీరంతా బీజేపీలోకి చేరనున్నారని పుకార్లు వస్తున్నాయి. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. సంకీర్ణం కొనసాగుతుంది: కుమారస్వామి భరోసా కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని సీఎం హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు భరోసా ఇచ్చారు. గురువారం ఆయన రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నేత ఎస్ఎం కృష్ణను కలిశారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ రాహుల్‌ను కోరారు. ప్రభుత్వం కూలిపోనుందనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. -
‘అమ్మ’ మరణంపై విచారణ కమిషన్
-
‘అమ్మ’ మరణంపై విచారణ కమిషన్
► స్మారక మందిరంగా జయలలిత నివాసం ► అన్నా డీఎంకే వర్గాల విలీనం ఖరారు! సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి గురువారం న్యాయ విచారణకు ఆదేశించారు. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. జయ కన్నుమూసిన తరువాత ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో వాటి నివృత్తి కోసమే ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పళనిస్వామి చెప్పారు. అలాగే జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. సీఎంగా ఉండగానే గతేడాది సెప్టెంబరు 22న అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత... 75 రోజులు వైద్యశాలలోనే ఉండి డిసెంబరు 5న గుండెపోటుతో మరణించడం తెలిసిందే. మరోవైపు విచారణకు కమిషన్ ఏర్పాటు చేయనుండటంతో అన్నా డీఎంకేలోని రెండు వర్గాల విలీనం దాదాపు ఖారరైంది. తన వర్గాన్ని విలీనం చేయాలంటే జయ మరణంపై విచారణ జరపాలనీ, వేద నిలయంను స్మారకమందిరంగా మార్చాలని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా తొలగించినప్పుడే విలీనంపై ముందుకెళ్తామని పన్నీర్ సెల్వం సన్నిహితులు అంటున్నారు. జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వర్గం తమకు లభించిన విజయంగా పేర్కొంది. జయ మరణానికి శశికళ కారణమని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కాగా, జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. నాడు రూ.1.32 లక్షలు...నేడు రూ.72.09 కోట్లు 1967 మే 15న జయలలిత, ఆమె తల్లి వేద (తమిళ సినీరంగంలో సంధ్యగా ప్రాచుర్యం పొందారు) కలసి చెన్నైలో పోయెస్ గార్డెన్లో ఈ ఇంటిని రూ.1.32 లక్షలకు కొన్నారు. తల్లిపై ప్రేమను చాటుతూ జయ ఆ ఇంటికి వేద నిలయం అని పేరు పెట్టారు. జయ తన స్నేహితురాలు శశికళతో కలిసి ఇక్కడే మూడు దశాబ్దాలకు పైగా నివసిం చారు. జయ చనిపోయిన తర్వాత కూడా అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే వరకు శశికళ ఈ ఇంట్లోనే ఉన్నారు. గతే డాది అసెంబ్లీ ఎన్నికకు జయ నామినేషన్ వేసినప్పుడు ఇంటి విలువ 72.09 కోట్లని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్‌తో మ్యాక్స్ లైఫ్ విలీనం రద్దు
-
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం రద్దుకు బిల్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్బీఐలో మిగతా అనుబంధ బ్యాంకులు విలీనమైన నేపథ్యంలో ఎస్బీఐ (అనుబంధ బ్యాంకులు) చట్టం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. విలీనంతో అనుబంధ బ్యాంకులు ఇక ఉండబోవు కాబట్టి ఆయా చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం తలెత్తిందని నిర్దేశిత బిల్లులో పేర్కొన్నారు. ఎస్‌బీహెచ్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్బీటీ)తో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్బీఐలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
విలీనాలకు బ్యాంకులే ముందుకు రావాలి
♦ విలీనం అవసరమూ ఉండాలి ♦ ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ న్యూఢిల్లీ: అవసరాన్ని బట్టే బ్యాంకుల విలీనాలు జరగాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ విలీనాలకు సంబంధించి తగు ప్రతిపాదనలతో బ్యాంకులే ముందుకు రావాల ని ఆయన సూచించారు. ‘విలీనం అవసరమనే పరిస్థితులుండాలి. అలాగే స్వయంగా బ్యాంకు ల నుంచే అలాంటి ప్రతిపాదనలు రావాలి‘ అని మంగళవారం నాబార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో ఆయన చెప్పారు. ఇటీవలే ఎస్బీఐలో 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం కాగా.. భారీ బ్యాంకుల ఏర్పాటు చేసే దిశగా మరికొన్నింటిని విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో రంగరాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మొండిబాకీల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రక్షాళన కసరత్తు జరిగి తీరాల్సిందేనని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బ్యాంకులు కొంత వదులుకోక తప్పదని (హెయిర్‌కట్) కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్‌పీఏకి తగిన పరిష్కారం కనుగొనకుండా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, పెట్టుబడులను ఆకర్షించడం మొదలైన విషయాల్లో ముందుకెళ్లలేమని రంగరాజన్ తెలిపారు. ఎన్పీఏ పరిష్కార ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయమైనా పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో రూ. 8 లక్షల కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోగా.. వీటిలో సుమారు రూ. 6 లక్షల కోట్లు .. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. దీంతో.. మొత్తం మొండి బకాయిల్లో దాదాపు పాతిక శాతం కట్టాల్సిన 12 కంపెనీల ఖాతాలను గుర్తించిన ఆర్బీఐ వాటిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఐడీఎఫ్సీ-శ్రీరామ్ మెగా మెర్జర్
ముంబై: కొంత కాలంగా వార్తల్లో నిలిచిన ఐడీఎఫ్సీ -శ్రీరామ్ విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. శనివారం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మెగా మెర్జర్ ను నిర్ధారించాయి. కొద్ది నెలల క్రితమే రిజర్వుబ్యాంక్ నుంచి బ్యాంకింగ్ లైసెన్సు పొంది, కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్సీ బ్యాంక్...శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీలు) విలీనం కానున్నాయి. ఈ బిగ్ డీల్ ప్రకారం ఐడీఎఫ్సీశ్రీరామ్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు కానుంది. ఈ మెగాడీల్ విలువు 10 బిలియన్ డాలర్లు( సుమారు రూ.65వేల కోట్లు). ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, 90 రోజుల ప్రత్యేక సమావేశాల్లో విలీనం మొత్త ప్రక్రియ పూర్తి చేసేందుకు, ఒక స్పష్టతకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీరామ్ కాపిటల్ చైర్మన్ అజయ్ పిరామల్ చెప్పారు. అనంతరం వాటా నిష్పత్తి నిర్ణయిస్తామన్నారు. ముఖ్యంగా ఈ విలీనానికి శ్రీరామ్, ఐడీఎఫ్సీ గ్రూపులు ఆమోదంతో పాటు, మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, సీసీఐ లాంటి ఇతర సంస్థల ఆమోదం పొందాల్సిఉందన్నారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ప్రత్యేకసంస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని అజయ్ వ్యాఖ్యానించగా ఈ పెళ్లి జరుగుతుందని భావిస్తున్నామని ఐడీఎఫ్సీ అధిపతి దీపక్ పరేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఐడీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 21,545 కోట్లు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 7,644 కోట్లుకాగా, శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 25,138 కోట్లుగా ఉంది. శ్రీరామ్ కాపిటల్‌లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ 20 శాతం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ సిటీ యూనియన్ 10 శాతం వాటాను కలిగి ఉంది. అక్టోబర్ 2015 లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన ఐడిఎఫ్సి బ్యాంక్, బ్యాలెన్స్ షీట్లో పదవ అతి పెద్ద ప్రైవేట్ రుణదాతగాఉంది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో శ్రీరామ్ ఎన్‌బీఎఫ్‌సీల విలీనం!
♦ కొన్ని కంపెనీలతో చర్చలు ♦ జరుపుతున్నాం– ఐడీఎఫ్సీ బ్యాంక్ ♦ వివిధ ఆప్షన్లు: శ్రీరామ్ గ్రూప్ ముంబై: కొద్ది నెలల క్రితమే రిజర్వుబ్యాంక్ నుంచి బ్యాంకింగ్ లైసెన్సు పొంది, కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్సీ బ్యాంక్...శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీలు) విలీనం చేసుకోవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ విలీనంపై అంచనాలతో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు వరుసగా మూడు సెషన్ల నుంచి 15 శాతం వరకూ ర్యాలీ జరిపింది. శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన ఎన్బీఎఫ్సీలు.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీయూనియన్ ఫైనాన్స్‌లు ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం కావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. విలీనంతో పాటు పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, సరైన సమయంలో టేకోవర్లు, విలీనాలపై నిర్ణయం తీసుకునేందుకు తాము సిద్దంగానే వున్నామని శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. శనివారం బోర్డు సమావేశాలు.. వివిధ వ్యూహాత్మక ఆప్షన్లు పరిశీలించేందుకు ఈ శనివారం శ్రీరామ్ క్యాపిటల్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. ఇదేరోజున ఐడీఎఫ్సీ బ్యాంక్ బోర్డు సమావేశం కూడా జరగనుండటం విశేషం. అయితే ఇరు కంపెనీలు బోర్డు సమావేశాల సమాచారాన్ని ఇంకా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలపలేదు. విలీన వార్తలపై ఎక్సే్ఛంజీలు కోరిన వివరణకు ఐడీబీఐ బ్యాంక్ సమాధానమిస్తూ వివిధ వృద్ధి అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు మాత్రమే తెలిపింది. ఐడీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 21,545 కోట్లు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 7,644 కోట్లుకాగా, శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 25,138 కోట్లు. గురువారం ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు రూ. 63.30 వద్ద క్లోజైంది. శ్రీరామ్ సిటీ యూనియన్ షేరు రూ. 1,111 వద్ద, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రూ. 2,510 వద్ద ముగిశాయి. -
కలుపుకునే ‘కింగ్’లు ఇవే
♦ పీఎన్బీ, బీవోబీ, బీవోఐ, కెనరా బ్యాంకులు ♦ ఇతర బ్యాంకులను విలీనం చేసుకునేందుకే ఎంపిక ♦ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పణ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) భారీ స్థాయిలో విలీనాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 21 బ్యాంకులు ఉండగా, విలీనాలతో ఓ నాలుగైదు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో బలంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), కెనరా బ్యాంకులను ఎంపిక చేసినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వరంగంలోని చిన్న బ్యాంకులను విలీనం చేసుకునే సామర్థ్యం వీటికుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చిన్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు గల అవకాశాలను అన్వేషించాలంటూ ఈ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్టు ఆ అధికారి వెల్లడించారు. విలీనానికి తమ వైపు నుంచి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలపై ఈ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఇందుకు ఎటువంటి కాల పరిమితి లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కలసిపోయిన విషయం విదితమే. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే తెలిపారు. విలీనం ఫలితమిచ్చేనా...? విలీనం చేసుకునేట్టు అయితే ఒకే ప్రాంతంలో శాఖలు పెరిగిపోవడం, సాంకేతిక అనుసంధానత, పోటీ వ్యతిరేక అంశాలు ఏవైనా తలెత్తుతాయా? తదితర వివరాలను ఆర్థిక శాఖ కోరింది. విలీనం అనంతరం ప్రతికూలత ఫలితాలు ఎదురవ్వకుండా చూడడమే దీని ఉద్దేశం. అయితే, ఈ విలీనాలు పీఎస్‌బీల బలోపేతానికి తోడ్పడతాయన్న విషయంలో విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనం వెనుకనున్న ఉద్దేశమేంటని రేటింగ్ సంస్థ ఇక్రా గ్రూప్ హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ సందేహం వ్యక్తం చేశారు. బలహీనంగా ఉన్న రెండు బ్యాంకుల విలీనంతో ఒక బలమైన బ్యాంకు ఏర్పడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే, ఒక బలమైన బ్యాంకు, ఒక బలహీన బ్యాంకును విలీనం చేసినా పటిష్ట బ్యాంకు ఏర్పాటు అసాధ్యమన్నారు. విలీనం చేసుకున్న బ్యాంకు బలిపశువుగా మారే ప్రమాదమూ లేకపోలేదన్నారు. ఎస్బీఐ ఇందుకు ఉదాహరణ అని... ఆరు బ్యాంకుల విలీనం తర్వాత ఎస్బీఐ రూ.3,000 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిందని, అదే విడిగా ఎస్బీఐ బ్యాంకు ఫలితాలను చూసుకుంటే రూ.2,815 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆయన వివరించారు. సిండికేట్, విజయా, కెనరా విలీనం! విలీనానికి ఎంపిక చేసే సంస్థలు చిన్నవైనప్పటికీ ఆర్థికంగా స్థిరమైనవే అయి ఉండాలన్నది ఆర్థిక శాఖ ప్రతిపాదన. బెంగళూరు ప్రధాన కార్యాలయం గల కెనరా బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు సిండికేట్ బ్యాంకు (ప్రధాన కార్యాలయం మణిపాల్, కర్ణాటక)లు ఇప్పటికే విలీనంపై చర్చలు ప్రారంభించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే కోల్‌కతా ప్రధాన కేంద్రంగా గల అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకు సైతం ఒక్కటిగా ఏర్పడవచ్చని చెప్పారు. మొండిబకాయిల సమస్య విలీనాలకు ఆటంకం కాబోదన్నారు. ఆర్బీఐ ఆంక్షల పరిధిలోకి సెంట్రల్ బ్యాంక్ భారీగా ఎన్పీఏల సమస్యను, ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటున్న సెంట్రల్ బ్యాంకు కూడా ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియజేసింది. ఇప్పటికే ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, దేనా బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆంక్షల పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. -
చుక్కలు చూపిస్తున్నారు
- విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో ఇంటి ప్లాన్ నిబంధనలు కఠినతరం - భవన నిర్మాణదారులకు సరికొత్త ‘చెక్‌లిస్ట్’ - అవినీతి, అక్రమాలకు తావుండదంటున్న అధికారులు - ఇబ్బందులు పడుతున్న సామాన్యులు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించిన పంచాయతీల్లో సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్యులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇంటి ప్లాన్ అనుమతుల కోసం నిబంధనలు కఠినతరం చేస్తూ సరికొత్తగా ఇచ్చిన ఉత్తర్వులే ఇందుకు కారణం. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతూండగా, ఈ విధానంలో అక్రమాలకు తావుండదని అధికారులు అంటున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం, బొమ్మూరు, రాజవోలు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు; కోరుకొండ మండలం గాడాల, నిడిగట్ల, మధురపూడి, బూరుగుపూడి; రాజానగరం మండలం రాజానగరం, హౌసింగ్ బోర్డు కాలనీ, పాలచర్ల, చక్రద్వారబంధం, నామవరం, నరేంద్రపురం, వెలుగుబంద పంచాయతీలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ 21 పంచాయతీల్లో ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. రాజమహేంద్రవరంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో 2012 నుంచి ఈ 21 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు పాలన సాగిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీలను నియమించింది. ఈ కమిటీల కనుసన్నల్లోనే విలీన ప్రతిపాదిత 21 పంచాయతీల్లో పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం, కుళాయి మంజూరు తదితర అనుమతుల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఇందులో భాగంగానే కాతేరులో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పంచాయతీల్లో పాలన గాడి తప్పుతుండడంతో ప్రత్యేక అధికారులను తప్పించి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజును ప్రత్యేక అధికారిగా నియమించారు. ఐఏఎస్ అధికారి కావడంతో పాలన గాడిన పెడతారన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే భవన నిర్మాణ అనుమతుల మార్గదర్శకాలను కమిషనర్ సవరించారు. 11 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్ తయారు చేసి, ఆ వివరాలు సమర్పించిన తర్వాతే నిర్మాణ అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ స్థలం హక్కు పత్రాలు, లైసెన్స్డ్ సర్వేయర్ వద్ద భవన నిర్మాణ ప్లాన్ తీసుకువచ్చి, నిబంధనల మేరకు ఫీజు చెల్లిస్తే పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారుల సంతకాలతో అనుమతులు ఇచ్చేవారు. ఇందులో అనేక అవకతవకలు జరిగాయి. కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిబంధనలను కఠినతరం చేశారు. ఈ సమాచారం ఉంటేనే అనుమతి భవన నిర్మాణదారుడు ఎంత స్థలంలో ఇల్లు కట్టాలనకుంటున్నారు, ఆ స్థలం సర్వే నంబర్, బ్లాక్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకం, రిజిస్టర్డ్ దస్తావేజు, అడంగల్, ఎ-రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్, డి-ఫారం పట్టా, స్థలం అభివృద్ధి వివరాలు (గ్రామకంఠమా లేక అప్రూవ్డ్ లే అవుట్ అయితే సర్వే నంబర్, ప్లాట్ నంబర్), ల్యాండ్ కన్వర్షన్ అయితే ఆ ఉత్తర్వుల నంబర్, జారీ చేసిన తేదీ, సబ్ రిజిస్ట్రార్ ప్రకారం భూమి ధర, ఆ స్థలంలో హెచ్‌టీ విద్యుత్ వైర్లు, వాటర్ బాడీ (నది, చెరువు, వాగు), రైల్వే లైను, గ్యాస్ పైప్‌లైను, పురాతన కట్టడాలు, మత సంబంధిత నిర్మాణాలు ఉన్నాయా, ప్రతిపాదిత స్థలం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో ఉందా, ఉంటే ఆ స్థలం వివరాలను భవన నిర్మాణదారుడు సమర్పించాలి. దీంతోపాటు బెటర్మెంట్ చార్జీ, ఖాళీ స్థలంపై పన్ను, అభివృద్ధి చార్జీ, బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, పబ్లికేషన్ చార్జీ, ఇతర చార్జీలను పంచాయతీకి చెల్లించాలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి భవన నిర్మాణదారు సమర్పించిన ప్లాన్‌ను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఆ వివరాలు సరిపోల్చాలి. దీంతోపాటు జీవో ప్రకారం నిర్మాణం చేపట్టాల్సిన భవనం చుట్టూ వదలాల్సిన సెట్‌బ్యాక్స్ ఉన్నాయా అన్నది పరిశీలించాలి. చివరిగా ఏమైనా రిమార్కులు ఉన్నాయేమో పేర్కొంటూ, కార్యదర్శి ధ్రువీకరించిన తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు. ఈ నిబంధనలతో సామాన్యులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఏ ఒక్క వివరం లేకపోయినా అనుమతులు రాకపోవడంతో పంచాయతీల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. బిల్డర్లు, పెద్ద నిర్మాణాలు చేపట్టే వారితోపాటు స్వతహాగా చిన్న ఇల్లు నిర్మించుకునేవారికి కూడా ఒకేలా నిబంధనలు విధించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు కొంతమేర వెసులుబాటు కల్పించాలని సొంతంగా చిన్న ఇళ్లు నిర్మించుకునేవారు కోరుతున్నారు. అక్రమాలకు తావుండదు ఇప్పటివరకూ కొన్ని విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో భవనాల అనుమతుల్లో అనేక అక్రమాలు జరిగాయి. గ్రామ ప్రజల మధ్య గొడవలు చెలరేగాయి. ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే చెక్‌లిస్ట్ పెట్టాము. అందులో అడిగినవి స్థల యజమానుల వద్ద తప్పక ఉంటాయి. వాటిని తీసుకురావడంవల్ల భవిష్యత్తులో ఆయా యజమానులు, ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. - వి.విజయరామరాజు, ప్రత్యేక అధికారి, విలీన పంచాయతీలు -
విలీన మండలాలు అంతర్భాగం కాదా?
పోలవరం నిర్వాసితుల పోరు సభలో నేతల మండిపాటు గిరిజనుల సమస్యలు పట్టని ప్రభుత్వంపై ఆగ్రహం సాక్షి, రాజమహేంద్రవరం : పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి విలీనమైన కూనవరం, వీఆర్ పురం, ఎటపాక, చింతూరు మండలాలను రాష్ట్రంలో అంతర్భాగం కాదన్నట్లుగా సర్కారు వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితుల పోరు సభ పేరిట వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో రంపచోడరం ఎమ్మెల్యే వంత రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు నేతలు నిర్వాసితుల సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఎమ్మెల్యే వంతల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో సర్వే కూడా చేయలేదన్నారు. నష్ట పరిహారం ఇచ్చే సమయంలో వయసును పరిగణలోకి తీసుకుని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరెడ్డి గిరిజనులకు 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం చంద్రబాబు ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదని పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విలీన మండలాలను అనాధలుగా వదిలేసిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మన్యంలో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మృతి చెందినా ప్రభుత్వం ఇప్పటి వరకు కారణాలు చెప్పలేకపోతోందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీయకుండా గిరిజనులకు రకరకాలుగా పరిహారం ఇస్తూ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. 2018కి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరరావు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెట్టా శ్రీనివాస్, జిన్నూరి వెంకటేశ్వరరావు, దాసరి శేషగిరి, కర్రి పాపారాయుడు, రవివర్మ, రావు చిన్నారావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, లింగం రవి, ఎస్వీవీ సత్యనారాయణ చౌదరి, సుంకర చిన్ని, జిన్నూరి బాబి, దంగేటి వీరబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, పోలు కిరణ్‌కుమార్‌రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, అడపా శ్రీహరి, వాసిరెడ్డి జమీలు, దాసరి శేషగిరి, మురళీకృష్ణంరాజు, రాజమహేంద్రవరం ఫ్లోర్ లీడర్ మేడపాటి అనిల్ షర్మిలా రెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి జగన్ వెంట ఉన్నారు. -
సాయుధ పోరాటంతోనే హైదరాబాద్ విలీనం
దుబ్బాక: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మచ్చ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన దుబ్బాకలోని పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ సంస్థానం భారత్ దేశంలో విలీన వారోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి సీపీఐ పోరాటాలు చేసిందని, ఫలితంగానే నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సెప్టెంబర్ 17న లొంగిపోవాల్సి వచ్చిందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న గజ్వేల్‌లో జరిగే వారోత్సవాల సభకు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరవుతున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల భరత్ కుమార్, గుండబోయిన నవీన్, సాయి, విక్కి తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్!!
-
హెచ్డీఎఫ్సీ- మ్యాక్స్ విలీనానికి ఓకే
♦ హెచ్డీఎఫ్సీ బోర్డు అనుమతి ♦ త్వరలో హెచ్డీఎఫ్సీ లైఫ్ లిస్టింగ్ ముంబై : హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో మ్యాక్స్ బీమా సంస్థ విలీనానికి హెచ్డీఎఫ్సీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశం ఈ విలీనానికి ఆమోదం తెలిపిందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. కాగా మ్యాక్స్ లైఫ్ పేరుతో మ్యాక్స్ ఫైనాన్షియల్ సంస్థ నిర్వహిస్తున్న జీవిత బీమా వ్యాపార విభాగం, హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన బీమా విభాగం, హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విలీనం కానున్న విషయం తెలిసిందే. ఈ విలీనం వల్ల హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లై ఫ్లో హెచ్డీఎఫ్సీ వాటా 42.5 శాతంగా ఉంటుంది. దీంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ తమ అనుబంధ కంపెనీగా ఉండబోదని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. రెండో విలీన ప్రతిపాదన ఈ విలీనం కారణంగా ఏర్పడే సంస్థ, ప్రైవేట్ రంగంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ కానుంది. ఈ సంస్థ మొత్తం ప్రీమియం రూ.26,000 కోట్లకు, నిర్వహణ ఆస్తులు రూ.లక్ష కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ప్రైవేట్ జీవిత బీమా రంగంలో ఒక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు మాత్రమే రూ.లక్ష కోట్ల నిర్వహణ ఆస్తులు ఉన్నాయి. కాగా హెచ్‌డీఎఫ్‌సీకి ఈ ఏడాది ఇది రెండో విలీన ప్రతిపాదన. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.