ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం రద్దుకు బిల్లు | Arun Jaitley introduces bill to repeal SBI Subsidiary Banks Act | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం రద్దుకు బిల్లు

Published Sat, Jul 22 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం రద్దుకు బిల్లు

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం రద్దుకు బిల్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐలో మిగతా అనుబంధ బ్యాంకులు విలీనమైన నేపథ్యంలో ఎస్‌బీఐ (అనుబంధ బ్యాంకులు) చట్టం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టారు. విలీనంతో అనుబంధ బ్యాంకులు ఇక ఉండబోవు కాబట్టి ఆయా చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం తలెత్తిందని నిర్దేశిత బిల్లులో పేర్కొన్నారు.

ఎస్‌బీహెచ్‌తో పాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికానెర్‌ అండ్‌ జైపూర్‌ (ఎస్‌బీబీజే), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (ఎస్‌బీఎం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా (ఎస్‌బీపీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌ (ఎస్‌బీటీ)తో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్‌బీఐలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement