న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేస్తుందని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. అవన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. గుజరాత్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
''అవన్నీ వూహాగానాలే. రెండు వేల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఇటువంటి వాటిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వాటిని నమ్మొద్దు'' అని జైట్లీ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్టు... ఆర్‌బీఐ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోబోతుందని లేదా పెద్ద డినామినేషన్ కరెన్సీ ప్రింటింగ్‌ను ఆపివేస్తుందంటూ వెల్లడించింది. పెద్ద నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేయడాన్ని తగ్గించి, చిన్న నోట్ల సర్క్యూలేషన్‌పైనే ఎక్కువగా దృష్టిసారించినట్టు రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment