రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 'జియో హాట్‌స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.
విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్‌లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్‌ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్‌లో 120 టీవీ ఛానెల్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
నిజానికి మొదట హాట్‌స్టార్‌నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్‌లోడ్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment