రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మీడియా అసెట్స్ విలీన ప్రతిపాదనకు దాదాపు రెండు నెలల తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కొన్ని షరతులు విధిస్తూ మంగళవారం 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది.
సీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరు సంస్థలు ఏడు టీవీ చానళ్లను విక్రయించాలి. వీటిలో స్టార్ జల్సా మూవీస్, కలర్స్ మరాఠీ, హంగామా మొదలైనవి ఉన్నాయి. అలాగే క్రికెట్ ఈవెంట్ల ప్రసారాల అడ్వర్టైజ్‌మెంట్ స్లాట్లకు సంబంధించి బండిల్డ్ విధానంలో వసూలు చేయకూడదు. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి కీలక క్రికెట్ మ్యాచ్‌ల ఫీడ్‌ను ప్రసార భారతితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్‌ఫాంలు (స్టార్‌కి చెందిన డిస్నీప్లస్‌హాట్‌స్టార్, రిలయన్స్‌లో భాగమైన వయాకామ్18కి చెందిన జియోసినిమా) వేర్వేరుగా కొనసాగుతాయి.
ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..
Comments
Please login to add a commentAdd a comment