మీడియా దిగ్గజం ఆవిర్భావానికి సీసీఐ గ్రీన్ సిగ్నల్
డీల్ విలువ రూ. 70,000 కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్‌ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్‌కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది.
స్వచ్ఛంద సవరణలు: ఆర్‌ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్‌కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్‌ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్‌గా అవతరించనుంది.
విలీన సంస్థ ఇలా..
ఆర్‌ఐఎల్‌కు గల మీడియా సంస్థలలో నెట్‌వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్‌మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్‌ఐఎల్ జియోçస్టూడియోస్‌సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్‌స్టార్‌లను సొంతం చేసుకుంది. ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment