Walt Disney Company
-
ఆర్ఐఎల్ – డిస్నీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్‌ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్‌కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది. స్వచ్ఛంద సవరణలు: ఆర్ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్‌కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్‌గా అవతరించనుంది. విలీన సంస్థ ఇలా.. ఆర్ఐఎల్కు గల మీడియా సంస్థలలో నెట్వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్‌తో ఎంటర్టైన్మెంట్ చానల్‌తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్‌మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్ఐఎల్ జియోçస్టూడియోస్సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్స్టార్లను సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది. -
ఆ ముగ్గురి మరణాలు.. 20 ఏళ్లుగా మూతబడిన డిస్నీపార్కు
డిస్నీపార్కుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వాల్ట్ డిస్నీ నెలకొల్పిన డిస్నీ థీమ్ పార్కులు ప్రపంచంలో పన్నెండు ఉన్నాయి. ఈ పార్కులన్నీ సందర్శకులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రోజూ వేలాది సందర్శకులు వీటిని సందర్శిస్తుంటారు. ఇవి ఈనాటికీ దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, డిస్నీ థీమ్ పార్కుల్లో ఒకటైన ‘డిస్నీ రివర్ కంట్రీ’ మాత్రం దాదాపు ఇరవై ఏళ్లుగా మూతబడింది. ఇప్పుడు ఈ పార్కు పాడుబడి దెయ్యాల నివాసాన్ని తలపించేలా తయారైంది. డిస్నీ థీమ్ పార్కుల్లో భాగంగా వాల్ట్ డిస్నీ కంపెనీ 1976 జూన్ 20న ఫ్లోరిడాలోని బే లేక్ తీరం వద్ద ‘డిస్నీ రివర్ కంట్రీ’ పార్కును నెలకొల్పింది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన మిగిలిన డిస్నీ పార్కుల్లాగానే ఇది కూడా సందర్శకులతో కిటకిటలాడేది. నిత్యం కోలాహలంగా కనిపించేది. వ్యాపారపరంగా లాభసాటిగానే నడిచేది. ఇందులో రెండు స్విమింగ్‌పూల్స్, ఐదు వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. సమీపంలోని బే లేక్ నుంచి వీటికి నీరు చేరవేసేవారు. బే లేక్ నుంచి వచ్చే నీటిని వడబోసేందుకు అడుగు భాగాన ఇసుక నింపిన ఫిల్టర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు తలెత్తడం, దీనిపై జనాల్లో ఆందోళన మొదలవడంతో ఇది 2001 నవంబర్ 2న మూతబడింది. అప్పటి నుంచి దీనిని మళ్లీ తెరిచే ప్రయత్నాలేవీ ఇంతవరకు జరగలేదు. ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు 1980లోనే మొదలయ్యాయి. ఇక్కడి స్విమింగ్‌పూల్‌లో ఈత కొట్టిన ఒక పదకొండేళ్ల బాలుడికి మెదడులో అమీబిక్ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్తోనే అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 1982లో ఒకరు, 1989లో మరొకరు ఇలాగే నీటివల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారినపడి మరణించారు. చాలామంది ఇన్ఫెక్షన్ల బారిన పడినా, చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ పార్కులో అడుగుపెట్టడానికి జనాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ 2001 నవంబర్ 2న ఈ పార్కును మూసివేస్తున్నప్పుడు దీనిలోని నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించి, 2002 ఏప్రిల్ 11న పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, ‘వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన తొలి వాటర్ థీమ్ పార్కు శాశ్వతంగా మూతబడినట్లే’ అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రకటించినట్లుగా ఇది పునఃప్రారంభం కాలేదు. వార్తాకథనాలు ఊహించినట్లుగానే జరిగింది. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడుబడి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. వాల్ట్ డిస్నీ కంపెనీ చరిత్రలో ఇలాంటి వైఫల్యం ఇదొక్కటే! -
డిస్నీ చేతికి ఫాక్స్ ఫిల్మ్
న్యూయార్క్ : వాల్ట్ డిస్నీ కంపెనీ, 21వ శతాబ్దపు ఫాక్స్ ఫిల్మ్‌ను సొంతం చేసుకుంది. స్టాక్ 52.4 బిలియన్ డాలర్లకు డీల్ కుదుర్చుకున్నట్టు వాల్ట్ డిస్నీ నేడు ప్రకటించింది. ఫిల్మ్, టెలివిజన్ స్టూడియో, కేబుల్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, ఇంటర్నేషనల్ టీవీ బిజినెస్, ఎక్స్-మెన్, అవతార్, ఎఫ్ఎక్స్ నెట్వర్క్స్, నేషనల్ జియోగ్రఫీ వంటి వన్నీ ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి డిస్నీ పోర్టుఫోలియోలోకి వెళ్లాయి. ఈ విక్రయానికి ముందు ఫాక్స్ టెలివిజన్ స్టేషన్స్, ఫాక్స్ న్యూస్ ఛానల్ విడిపోయాయి. 21వ శతాబ్దపు ఫాక్స్ కొనుగోలు, వినోదభరితమైన అనుభవాల్లో వినియోగదారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ ఐగెర్ ఓ ప్రకటనలో చెప్పారు. 2019లో ఐగెర్ పదవీ విరమణ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ 2021 వరకు ఆయన తన పదవిలో కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. హలీవుడ్లో మేజర్ స్టూడియోస్‌గా ఉన్న ఏబీసీ టెలివిజన్ నెట్వర్క్, ఈఎస్పీఎన్ను డిస్నీ తన సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌కు పోటీగా తన సొంత స్ట్రీమింగ్ సర్వీసులను లాంచ్ చేసేందుకూ డిస్నీ సిద్దమవుతోంది. -
భారతీయ సంతతి కుర్రాడితో మళ్ళీ ‘జంగిల్ బుక్’
నటన అంటే ఏమిటో కూడా తెలియని ఈ పదేళ్ళ పిల్లాడు త్వరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. వాల్ట్ డిస్నీ సంస్థ తీయనున్న ‘ది జంగిల్ బుక్’లో ప్రధాన పాత్ర మోగ్లీగా నటించే బంగారు అవకాశం న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ - అమెరికన్ అయిన నీల్ సేథీని వరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వెతికాం. న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ వరకు, లండన్ నుంచి కెనడా వరకు, అమెరికా, భారతదేశం... మూలమూలలా వెదికిన తర్వాత పదేళ్ళ నీల్ సేథీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాం’’ అని దర్శకుడు జాన్ ఫేవ్రౌ తెలిపారు. అడవిలోని జంతువులు పెంచి పెద్ద చేసిన ఓ పసివాడి కథగా రుడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘ది జంగిల్ బుక్’ సుప్రసిద్ధం. ఈ కథ గతంలో యానిమేషన్ రూపంలో అలరించింది. కాగా, ఇప్పుడు లైవ్ - యాక్షన్, యానిమేషన్ల సమ్మిళిత రూపంగా 3డిలో ఈ సినిమా తీయనున్నారు. ఈ చిత్రంలో సేథీ ఒక్కడే మౌగ్లీగా నటిస్తున్నాడు. అతణ్ణి పెంచే అడవి జంతువుల పాత్రలన్నీ యానిమేషన్, గ్రాఫిక్సే. ఈ పాత్రలకు బెన్ కింగ్స్లే లాంటి ప్రసిద్ధులు గాత్రదానం చేయనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఒక సినిమా సక్సెస్ కావాలంటే నటీనటుల ఎంపిక బాగుండాలి. మోగ్లీ పాత్రకు సరిగ్గా సూటయ్యే కుర్రాడు దొరికాడు. నీల్ సేథీలో ప్రతిభ, ఆకర్షణ రెండూ ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు. మరి, ఈ భారతీయ సంతతి కుర్రాడు రేపు తెరపై ఎంతగా ఆకట్టుకుంటాడో చూడాలి.