ముంబై: కొంత కాలంగా వార్తల్లో నిలిచిన ఐడీఎఫ్‌సీ -శ్రీరామ్ విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. శనివారం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మెగా మెర్జర్ ను నిర్ధారించాయి. కొద్ది నెలల క్రితమే రిజర్వుబ్యాంక్ నుంచి బ్యాంకింగ్ లైసెన్సు పొంది, కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్...శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్‌బీఎఫ్‌సీలు) విలీనం కానున్నాయి. ఈ బిగ్ డీల్ ప్రకారం ఐడీఎఫ్‌సీశ్రీరామ్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు కానుంది. ఈ మెగాడీల్ విలువు 10 బిలియన్ డాలర్లు( సుమారు రూ.65వేల కోట్లు).
ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, 90 రోజుల ప్రత్యేక సమావేశాల్లో విలీనం మొత్త ప్రక్రియ పూర్తి చేసేందుకు, ఒక స్పష్టతకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీరామ్ కాపిటల్ చైర్మన్ అజయ్ పిరామల్ చెప్పారు. అనంతరం వాటా నిష్పత్తి నిర్ణయిస్తామన్నారు. ముఖ‍్యంగా ఈ విలీనానికి శ్రీరామ్, ఐడీఎఫ్‌సీ గ్రూపులు ఆమోదంతో పాటు, మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, సీసీఐ లాంటి ఇతర సంస్థల ఆమోదం పొందాల్సిఉందన్నారు. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ప్రత్యేకసంస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని అజయ్ వ్యాఖ్యానించగా ఈ పెళ్లి జరుగుతుందని భావిస్తున్నామని ఐడీఎఫ్‌సీ అధిపతి దీపక్ పరేక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 21,545 కోట్లు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 7,644 కోట్లుకాగా, శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 25,138 కోట్లుగా ఉంది. శ్రీరామ్ కాపిటల్లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ 20 శాతం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ సిటీ యూనియన్ 10 శాతం వాటాను కలిగి ఉంది. అక్టోబర్ 2015 లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన ఐడిఎఫ్సి బ్యాంక్, బ్యాలెన్స్ షీట్లో పదవ అతి పెద్ద ప్రైవేట్ రుణదాతగాఉంది.