Sriram Group
-
రూ.6200 కోట్లు ఉద్యోగులకు దానం, చిన్న ఇంట్లో నివాసం, ఎవరీ బిజినెస్ టైకూన్
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం చాలామందికి అలవాటు. భారతదేశంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా తమ సంపదలో చాలా దాతృత్వానికి వినియోగిస్తారు. మరి కొంతమంది తమ కంపెనీ అభివృద్ధికి పనిచేసిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపిస్తారు. బోనస్‌లు, బహుమతులతో వారిని ఆనందింపజేస్తారు. కానీ తన సంపదనంతా ఉద్యోగులకు దానం చేసేసి అతి నిరాడంబరంగా జీవనాన్ని గడుపుతున్న ఒక బిజినెస్ టైకూన్ గురించి తెలుసా. ఆయనే ఆర్.త్యాగరాజన్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ అందుకున్న ఆయన గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం. సాయం చేయడం అంటే అపారమైన ఆనందం. అందుకే దాదాపు మొత్తం సంపదను రూ. 62,262 కోట్లు (750 మిలియన్ డాలర్లు) తన ఉద్యోగులకి పంచి ఇచ్చారు. సరసమైన ధరలకు రుణాలను అందించే లక్ష్యంతో శ్రీరామ్ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించారు త్యాగరాజన్. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న సాధారణ ప్రజలకు వెలుగు బాట చూపించారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు, షేర్హోల్డర్లకు కూడా ఎనలేని సంతోషాన్ని మిగిల్చారు. త్యాగరాజన్ చెన్నైలో 1974లో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. 37 ఏళ్ళ వయసులో స్నేహితులు, బంధువులతో కలసి మొదలు పెట్టి, తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆర్. త్యాగరాజన్ 1937, ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1961సంవత్సరంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేరిన త్యాగరాజన్, దాదాపు 20 ఏళ్లు పలు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. వడ్డీలు బాధలు, వివిధ రుణాల కోసం ఎదురు చూస్తున్న అల్పాదాయ వర్గాల ఇబ్బందులను చూసి చలించిపోయారు. దీనికి తోడు త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు తమ జీవనోపాధికోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడడాన్ని ఆయన గమనించారు. అందుకే సులువుగా, తక్కువ వడ్డీతో రుణాలు అందించేలా శ్రీరామ్ చిట్‌ఫండ్ సంస్తను ఏర్పాటు చేశారు. శ్రీరామ్ చిట్ ఫండ్స్ ద్వారా పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అందిస్తూ ఆదరణ పొందింది. బ్యాంకులు పైనాన్స్ కంపెనీలలో వడ్డీరేట్లు 30-35శాతం ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ లో 17-18 శాతానికే రుణాలందించేది. అలా ప్రారంభమైన శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి 30 కంటే ఎక్కువ కంపెనీలతో అలరారుతోంది. ( Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! 2023 ఆగస్టు నాటికి కంపెనీ 108,000 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. 2006లో 85సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులను అన్నింటిని శ్రీరామ్ యాజమాన్య ట్రస్ట్ కుబదిలీ చేశారు. దీని విలువ రూ. 62వేల కోట్లకు పైమాటే. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ 2023 జూన్ త్రైమాసికంలో 200 మిలియన్ డాలర్లు. సెల్ ఫోనూ లేదు, ఖరీదైన కారూ లేదు శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకుంటూ 86 ఏళ్ల వయసులో చిన్న ఇంటిలో, రూ. 6 లక్షల విలువైన కారుతో అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు త్యాగరాజన్. అంతేకాదు ఆయన సెల్‌పోన్ కూడా వాడరు. తనకు ఆ అవసరమే లేదంటారు. పత్రికలు, సాహిత్యం, సంగీతం ఇదే ఆయన కాలక్షేపం. అలాగే కంపెనీ సీనియర్ మేనేజర్లతో ప్రతి 15రోజులకొకసారి మాట్లాడుతో సలహాలు, సూచనలు అందిస్తూ కంపెనీ అభివృద్దికి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. ‘‘లాభం అనేది ఒక కొలమానం మాత్రమే’’ లాభం ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు. కస్టమర్‌దే తొలిస్థానం. లాభం అనేది మనం సమాజానికి ఎంత బాగా సేవ చేస్తున్నామో తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మంచి సేవ చేస్తే లాభంగా కూడా అలానే వస్తుంది అదే తన సక్సెస్ సీక్రెట్ అంటారాయాన.. బిజినెస్‌లో రిస్క్‌లు చాలా సాధారణం. వాటిని అర్థం చేసుకోవాలి తప్పితే భయ పడకూడదంటారు. -
విలీనం తూచ్.. ఇప్పుడేంటి?
ఐడీఎఫ్సీ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనం అటకెక్కిపోవటంపై మార్కెట్ వర్గాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. విలీనం జరిగితే ఎవరికి లబ్ధి కలిగి ఉండేది? జరగకపోవటం వల్ల ఎవరికి లాభం? వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దీనిపై కొన్ని సానుకూల స్వరాలు వినిపిస్తుండగా... కొన్ని ప్రతికూల విశ్లేషణలూ వినపడుతున్నాయి. ఎవరి వాదనెలా ఉన్నా... విలీనం జరిగితే దేశంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ తర్వాత ఐడీఎఫ్సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరించి ఉండేది. ఇపుడా అవకాశం చేజారిన నేపథ్యంలో తాజా పరిణామం ఎవరికి లాభిస్తుందో చూద్దాం... విలీనం జరిగి ఉంటే...: ఐడీఎఫ్సీ– శ్రీరామ్ హోల్డింగ్ కంపెనీ అనేది అన్నింటికీ ప్రమోటింగ్ కంపెనీగా ఉండేది. ఐడీఎఫ్సీ బ్యాంకులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ విలీనమయ్యేవి. అయితే ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కొన్నాళ్లు అనుబంధ లిస్టెడ్ కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్ చేయడమో జరిగి ఉండేది. శ్రీరామ్ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనమయ్యేవి. ఇపుడివన్నీ నిలిచిపోయాయి. ఐడీఎఫ్సీ బ్యాంకుకు నష్టమేనా? పేరెంట్ కంపెనీ ఐడీఎఫ్సీ నుంచి ఐడీఎఫ్సీ బ్యాంకుగా బయటకు వచ్చినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్ఫ్రా రంగానికిచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఎన్‌పీఏలూ ఎక్కువే. ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్నూ విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్సీ బ్యాంకుకు సొంతమై ఉండేవారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాలతో ఐడీఎఫ్సీ రిటైల్ రుణ విభాగంలో బలోపేతమై ఉండేది. దక్షిణాదికే పరిమితమైన శ్రీరామ్ గ్రూపు తో పోలిస్తే ఐడీఎఫ్సీ బ్యాంకు భిన్నమైన సంస్థ. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విలీనానికి ఏళ్లు పట్టేదని విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే విలీనం రద్దు ఐడీఎఫ్సీకి నష్టమేనన్న వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి. పిరమల్స్ వాటాలతోనే సమస్య? పిరమల్ గ్రూపునకు శ్రీరామ్ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనమై ఉంటే ఐడీఎఫ్సీ బ్యాంకులో పిరమల్ గ్రూపునకు 5%కి పైగా వాటా దక్కేది. దీంతో విలీనానికి ఆర్బీఐ అడ్డుచెప్పొచ్చని మొదట్లోనే ప్రశ్నలొచ్చాయి. ఆర్బీఐ అంగీకరిస్తేనే ముందుకెళ్తామని ఇరు సంస్థలూ అప్పట్లో చెప్పాయి. శ్రీరామ్ సిటీ యూనియన్, ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌ల మాతృ సంస్థ శ్రీరామ్ క్యాపిటల్‌లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు 20% వాటా ఉంది. దీనికి అదనంగా అజయ్ పిరమల్‌కు ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో 10% వాటా ఉంది. శ్రీరామ్ సిటీ యూని యన్‌లో శ్రీరామ్ క్యాపిటల్‌కు 33.37% వాటా ఉంది. దీంతో శ్రీరామ్ సిటీ యూనియన్‌లో పిరమల్ గ్రూపు వాటా 16.7%. ఈ డీల్ విలువ 2016–17 ఏడాది శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పుస్తక విలువకు 3.5 రెట్ల స్థాయిలో లేకుంటే ఆ సంస్థ వాటాదారులకు నష్టమేనన్న విశ్లేషణలు అప్పట్లోనే వినవచ్చాయి. చివరికి ఆ విలువపైనే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేక, ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం గమనార్హం. హమ్మయ్య! వాటాదారులకు మేలే!! ‘‘డీల్ జరిగితే నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాటాదారులకు మెరుగైన ప్రతిఫలం దక్కి ఉండేది కాదు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లిస్టింగ్‌ను కొనసాగిస్తే దాని వాటాదారుల పరిస్థితీ అంతే. ఐడీఎఫ్సీ బ్యాంకు వాటాదారులకు మాత్రం విలీన నిష్పత్తిని బట్టి లబ్ధి కలిగి ఉండేది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా సమతుల్యత సాధిస్తే అప్పుడు ఇరు సంస్థల వాటాదారులకూ లాభం జరిగి ఉండేది. అన్ని కంపెనీలకు హోల్డింగ్ సంస్థగా ఐడీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులు బాగా లబ్ధి పొందేవారు. డీల్ రద్దు కావటంతో మొత్తంగా శ్రీరామ్ గ్రూపు వాటాదారులకు మేలే జరిగిందని చెప్పవచ్చు’’ అనేది విశ్లేషకుల మాట. డీల్ ముందుకు సాగకపోవటంతో కొన్నాళ్లుగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నా... సోమవారం మార్కెట్ ముగిసిన తరవాతే డీల్ రద్దు నిర్ణయం వెలువడింది. దీంతో మంగళవారం ఏ గ్రూపు షేర్లు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది. ఐడీఎఫ్సీ, శ్రీరామ్ గ్రూప్ విలీనం లేనట్లే... న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్ మధ్య విలీన ప్రతిపాదన అటకెక్కింది. కంపెనీల విలువను నిర్ణయించటం, దానికి తగ్గ మార్పిడి నిష్పత్తిని నిర్ణయించటంపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేకపోవడమే ఇందుకు కారణం. ‘విలీనానికి సంబంధించి ఐడీఎఫ్సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్‌లు రెండూ ఇరువురికీ ఆమోదయోగ్యమైన షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించలేకపోయాయి‘ అని ఐడీఎఫ్సీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో ప్రతిపాదిత విలీనంపై చర్చలు నిలిపివేయాలని రెండు సంస్థలు నిర్ణయించినట్లు తెలిపింది. శ్రీరామ్ గ్రూప్‌లో ప్రధానంగా 3 లిస్టెడ్ సంస్థలు శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉన్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్, జీవిత బీమా వ్యాపారం కూడా ఉంది. జులై 8 నాటి ప్రకటన ప్రకారం బీమా సంస్థలతో పాటు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఐడీఎఫ్సీకి అనుబంధ కంపెనీలుగా మారాల్సి ఉంది. ఇక శ్రీరామ్ సిటీ యూనియన్ని ఐడీఎఫ్‌సీలో పూర్తిగా విలీనం చేసి... అనుబంధ లిస్టెడ్ సంస్థగా ఇరు గ్రూప్‌ల నిర్వహణలో ఉన్నవ్యాపారాలు ఐడీఎఫ్సీ కిందికి వచ్చేవి. -
ఐడీఎఫ్సీ-శ్రీరామ్ మెగా మెర్జర్
ముంబై: కొంత కాలంగా వార్తల్లో నిలిచిన ఐడీఎఫ్సీ -శ్రీరామ్ విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. శనివారం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మెగా మెర్జర్ ను నిర్ధారించాయి. కొద్ది నెలల క్రితమే రిజర్వుబ్యాంక్ నుంచి బ్యాంకింగ్ లైసెన్సు పొంది, కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్సీ బ్యాంక్...శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీలు) విలీనం కానున్నాయి. ఈ బిగ్ డీల్ ప్రకారం ఐడీఎఫ్సీశ్రీరామ్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు కానుంది. ఈ మెగాడీల్ విలువు 10 బిలియన్ డాలర్లు( సుమారు రూ.65వేల కోట్లు). ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, 90 రోజుల ప్రత్యేక సమావేశాల్లో విలీనం మొత్త ప్రక్రియ పూర్తి చేసేందుకు, ఒక స్పష్టతకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీరామ్ కాపిటల్ చైర్మన్ అజయ్ పిరామల్ చెప్పారు. అనంతరం వాటా నిష్పత్తి నిర్ణయిస్తామన్నారు. ముఖ్యంగా ఈ విలీనానికి శ్రీరామ్, ఐడీఎఫ్సీ గ్రూపులు ఆమోదంతో పాటు, మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, సీసీఐ లాంటి ఇతర సంస్థల ఆమోదం పొందాల్సిఉందన్నారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ప్రత్యేకసంస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని అజయ్ వ్యాఖ్యానించగా ఈ పెళ్లి జరుగుతుందని భావిస్తున్నామని ఐడీఎఫ్సీ అధిపతి దీపక్ పరేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఐడీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 21,545 కోట్లు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 7,644 కోట్లుకాగా, శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 25,138 కోట్లుగా ఉంది. శ్రీరామ్ కాపిటల్‌లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ 20 శాతం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ సిటీ యూనియన్ 10 శాతం వాటాను కలిగి ఉంది. అక్టోబర్ 2015 లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన ఐడిఎఫ్సి బ్యాంక్, బ్యాలెన్స్ షీట్లో పదవ అతి పెద్ద ప్రైవేట్ రుణదాతగాఉంది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో శ్రీరామ్ ఎన్‌బీఎఫ్‌సీల విలీనం!
♦ కొన్ని కంపెనీలతో చర్చలు ♦ జరుపుతున్నాం– ఐడీఎఫ్సీ బ్యాంక్ ♦ వివిధ ఆప్షన్లు: శ్రీరామ్ గ్రూప్ ముంబై: కొద్ది నెలల క్రితమే రిజర్వుబ్యాంక్ నుంచి బ్యాంకింగ్ లైసెన్సు పొంది, కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్సీ బ్యాంక్...శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీలు) విలీనం చేసుకోవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ విలీనంపై అంచనాలతో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు వరుసగా మూడు సెషన్ల నుంచి 15 శాతం వరకూ ర్యాలీ జరిపింది. శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన ఎన్బీఎఫ్సీలు.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీయూనియన్ ఫైనాన్స్‌లు ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం కావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. విలీనంతో పాటు పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, సరైన సమయంలో టేకోవర్లు, విలీనాలపై నిర్ణయం తీసుకునేందుకు తాము సిద్దంగానే వున్నామని శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. శనివారం బోర్డు సమావేశాలు.. వివిధ వ్యూహాత్మక ఆప్షన్లు పరిశీలించేందుకు ఈ శనివారం శ్రీరామ్ క్యాపిటల్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. ఇదేరోజున ఐడీఎఫ్సీ బ్యాంక్ బోర్డు సమావేశం కూడా జరగనుండటం విశేషం. అయితే ఇరు కంపెనీలు బోర్డు సమావేశాల సమాచారాన్ని ఇంకా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలపలేదు. విలీన వార్తలపై ఎక్సే్ఛంజీలు కోరిన వివరణకు ఐడీబీఐ బ్యాంక్ సమాధానమిస్తూ వివిధ వృద్ధి అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు మాత్రమే తెలిపింది. ఐడీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 21,545 కోట్లు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 7,644 కోట్లుకాగా, శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 25,138 కోట్లు. గురువారం ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు రూ. 63.30 వద్ద క్లోజైంది. శ్రీరామ్ సిటీ యూనియన్ షేరు రూ. 1,111 వద్ద, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రూ. 2,510 వద్ద ముగిశాయి.