రూ.6200 కోట్లు ఉద్యోగులకు దానం, చిన్న ఇంట్లో నివాసం, ఎవరీ బిజినెస్‌ టైకూన్‌ | Meet R Thyagarajan, Shriram Transport Finance Founder And His Amazing Journey | Sakshi
Sakshi News home page

 రూ.6200 కోట్లు ఉద్యోగులకు దానం, చిన్న ఇంట్లో నివాసం, ఎవరీ బిజినెస్‌ టైకూన్‌

Published Thu, Feb 15 2024 11:40 AM | Last Updated on Thu, Feb 15 2024 1:10 PM

 meet Shriram Transport Finance R Thyagarajan  and his amazing journey - Sakshi

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం చాలామందికి అలవాటు. భారతదేశంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా  తమ సంపదలో చాలా దాతృత్వానికి వినియోగిస్తారు. మరి కొంతమంది తమ కంపెనీ అభివృద్ధికి  పనిచేసిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపిస్తారు. బోనస్‌లు, బహుమతులతో వారిని ఆనందింపజేస్తారు. కానీ తన సంపదనంతా  ఉద్యోగులకు దానం చేసేసి అతి నిరాడంబరంగా  జీవనాన్ని గడుపుతున్న ఒక బిజినెస్‌ టైకూన్‌  గురించి తెలుసా. ఆయనే ఆర్‌.త్యాగరాజన్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ అందుకున్న ఆయన గురించి మరిన్ని ఇంట్రస్టింగ్‌ సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం. 

సాయం చేయడం అంటే అపారమైన ఆనందం. అందుకే దాదాపు మొత్తం సంపదను రూ. 62,262 కోట్లు (750 మిలియన్ డాలర్లు)  తన ఉద్యోగులకి పంచి ఇచ్చారు.  సరసమైన ధరలకు రుణాలను అందించే  లక్ష్యంతో శ్రీరామ్ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించారు త్యాగరాజన్‌. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న  సాధారణ ప్రజలకు వెలుగు బాట చూపించారు.  శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్‌లకు కూడా ఎనలేని సంతోషాన్ని మిగిల్చారు. త్యాగరాజన్ చెన్నైలో 1974లో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. 37 ఏళ్ళ వయసులో స్నేహితులు, బంధువులతో కలసి  మొదలు పెట్టి,  తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం ద్వారా  వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 

ఆర్. త్యాగరాజన్ 1937, ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1961సంవత్సరంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో  చేరిన త్యాగరాజన్‌, దాదాపు 20 ఏళ్లు పలు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. వడ్డీలు బాధలు,  వివిధ రుణాల కోసం ఎదురు చూస్తున్న అల్పాదాయ వర్గాల ఇబ్బందులను చూసి చలించిపోయారు.  దీనికి తోడు  త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు తమ జీవనోపాధికోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడడాన్ని ఆయన గమనించారు. అందుకే సులువుగా, తక్కువ వడ్డీతో రుణాలు అందించేలా శ్రీరామ్ చిట్‌ఫండ్‌ సంస్తను ఏర్పాటు చేశారు.

శ్రీరామ్‌ చిట్‌ ఫండ్స్‌ ద్వారా  పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అందిస్తూ ఆదరణ పొందింది. బ్యాంకులు పైనాన్స్ కంపెనీలలో వడ్డీరేట్లు 30-35శాతం ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ లో 17-18 శాతానికే రుణాలందించేది. అలా ప్రారంభమైన శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి 30 కంటే ఎక్కువ కంపెనీలతో అలరారుతోంది. (

Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్‌ చెప్పేయ్‌..!

2023 ఆగస్టు నాటికి  కంపెనీ 108,000 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది.  2006లో 85సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులను అన్నింటిని శ్రీరామ్ యాజమాన్య ట్రస్ట్ కుబదిలీ చేశారు. దీని విలువ రూ. 62వేల కోట్లకు పైమాటే.  శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ 2023 జూన్ త్రైమాసికంలో 200 మిలియన్ డాలర్లు.

సెల్‌ ఫోనూ లేదు, ఖరీదైన కారూ లేదు
శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకుంటూ  86 ఏళ్ల వయసులో  చిన్న ఇంటిలో,  రూ. 6 లక్షల విలువైన కారుతో అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు త్యాగరాజన్‌. అంతేకాదు ఆయన సెల్‌పోన్‌ కూడా వాడరు. తనకు ఆ అవసరమే లేదంటారు. పత్రికలు, సాహిత్యం, సంగీతం ఇదే ఆయన కాలక్షేపం. అలాగే కంపెనీ సీనియర్ మేనేజర్లతో ప్రతి 15రోజులకొకసారి మాట్లాడుతో సలహాలు, సూచనలు అందిస్తూ కంపెనీ అభివృద్దికి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు.   

‘‘లాభం అనేది ఒక కొలమానం మాత్రమే’’
లాభం ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు. కస్టమర్‌దే  తొలిస్థానం. లాభం అనేది మనం సమాజానికి ఎంత బాగా సేవ చేస్తున్నామో తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మంచి సేవ చేస్తే లాభంగా కూడా అలానే వస్తుంది అదే తన సక్సెస్‌ సీక్రెట్‌ అంటారాయాన.. బిజినెస్‌లో రిస్క్‌లు చాలా సాధారణం. వాటిని అర్థం చేసుకోవాలి తప్పితే  భయ పడకూడదంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement