సాయుధ పోరాటంతోనే హైదరాబాద్‌ విలీనం | Hyderabad merger with armed | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాటంతోనే హైదరాబాద్‌ విలీనం

Published Wed, Sep 14 2016 6:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

వారోత్సవాల పోస్టర్‌ విడుదల దృశ్యం - Sakshi

వారోత్సవాల పోస్టర్‌ విడుదల దృశ్యం

దుబ్బాక: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మచ్చ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన దుబ్బాకలోని పార్టీ కార్యాలయంలో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ దేశంలో విలీన వారోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి సీపీఐ పోరాటాలు చేసిందని, ఫలితంగానే నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సెప్టెంబర్‌ 17న లొంగిపోవాల్సి వచ్చిందన్నారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  ఈ నెల 16న గజ్వేల్‌లో జరిగే వారోత్సవాల సభకు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరవుతున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపు నిచ్చారు.  కార్యక్రమంలో నాయకులు ఆకుల భరత్‌ కుమార్‌, గుండబోయిన నవీన్‌, సాయి, విక్కి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement