సుప్రీంకోర్టు ఉత్తర్వులతో..తెలుగు మీడియం వారికీ అవకాశం
హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీలో తెలుగు మీడియం అభ్యర్థులకు అవకాశం ఇవ్వకపోవడంతో న్యాయ వివాదంగా మారిన వ్యవహారంలో కదలిక మొదలైంది. మొదట భర్తీ చేయగా మిగిలిపోయిన దాదాపు 1,800 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తూ పోస్టుల భర్తీని పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీంతో సుమారు 80 మంది వరకు తెలుగుమీడియం వారికి అవకాశం లభించనుంది.
ఒక్కో మోడల్ స్కూల్ నిర్మాణానికి 4.80 కోట్లు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రెండో దశలో మంజూరు చేసిన 125 మోడల్ స్కూళ్లలో ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.4.80 కోట్లు మంజూరు కానున్నాయి. మొదటి దశలో తెలంగాణ జిల్లాలకు మంజూరైన 186 స్కూళ్లలో ఒక్కో స్కూల్‌కు రూ. 3.02 కోట్లు మంజూరు చేయగా ఇపుడు ఆ మొ త్తాన్ని పెంచేందుకు కేంద్రం ఒప్పుకుంది.
మోడల్ స్కూళ్లలో 1,800 పోస్టుల భర్తీ
Published Mon, Jul 28 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement