ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు
– ఈ నెల 28, 29న పెన్ డౌన్
– 30 న కలెక్టరేట్ ముట్టడి
కర్నూలు సిటీ: సమస్యల పరిష్కారం కోసం.. ఈ నెల28 నుంచి ఆందోళన బాట పట్టనున్నట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ పీఎన్ జాస్మిన్ మాట్లాడుతూ.. పీఆర్‌సీ సాధన, సర్వీస్ రూల్స్, హాస్టళ్ల అదనపు బాధ్యతలకు నిరసనగా ఆందోళనలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28, 29తేదీలలో పెన్‌డౌన్, 30వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి, వచ్చే నెల7వ తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. డీఈఓకు వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు ఆశాజ్యోతి, నాగయల్లప్ప, టీవీ మార్కండేయులు, వెంకటేశ్వర్లుల తదితరులు ఉన్నారు.