త్వరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 100 మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 20 మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టిన విద్యాశాఖ త్వరలోనే మరో 100 స్కూళ్లలో వీటిని ప్రారం భించేందుకు కసరత్తు ప్రారంభించింది. 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కోర్సుల్ని అమలు చేస్తోంది. ఇంటర్‌లోనూ ఆయా కోర్సులను కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రయో గాత్మకంగా 20 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కోర్సులకు ఆదరణ లభించడంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సుల ద్వారా భవిష్యత్తులో వారు స్వయం ఉపాధి సాధించేందుకు తోడ్పడతా యన్న ఆలోచనతో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతోంది. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్(ఎన్‌ఎస్‌డీసీ) నేతృత్వంలో వీటిని నిర్వహించనుంది. ప్రధానంగా ఐటీ, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఐటీ అండ్ రిటైల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ తదితర కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది.
మరో 100 మోడల్ స్కూళ్లలో వృత్తి విద్య!
Published Sat, Feb 4 2017 2:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement