విద్యారణ్యపురి : జిల్లాలోని మోడల్‌స్కూళ్లలో ప్రవేశాలకు గాను (2017–2018) ఆదివారం ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. అందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శ్రీనివాసచారి శనివారం తెలిపారు. ముల్కనూరు, ఎల్కతుర్తి, కమలాపూర్ మోడల్ స్కూళ్లలో 6వతరగతిలో ప్రవేశాలకుగాను 1021మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. వీరికి ఈనెల 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారన్నారు.
అలాగే 7,8,9,10 వతరగతిలో ఉన్న ఖాళీలకు కూడా ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. ఆ మూడు మోడల్‌స్కూళ్లలో 7,8,9,10 తరగతులకు కలిపి 952 మంది విద్యార్థులు పరీక్షనురాయబోతున్నారన్నారు. వీరికి ఈనెల 26న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటలవరకు పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా పరీక్షల నిర్వహణకు హన్మకొండలోనే ఆరు పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.అందులో హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్, హన్మకొండ ప్రభుత్వ హైస్కూల్, ప్రాక్టిసింగ్‌హైస్కూల్, లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాల, సుబేదారి ప్రభుత్వ హైస్కూల్, సెయింట్‌పీటర్స్ సీబీఎస్‌సీ హైస్కూల్‌లో పరీక్షాకేంద్రాలుగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ తెలిపారు.