‘ప్రైవేటు’కు పంపితే పథకాలు కట్ | Government schemes cut if send to the private | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు’కు పంపితే పథకాలు కట్

Published Mon, Jun 27 2016 4:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

‘ప్రైవేటు’కు పంపితే పథకాలు కట్

‘ప్రైవేటు’కు పంపితే పథకాలు కట్

మద్దూరు: గ్రామంలో ఎవరైనా ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే.. వారి ఇంటికి నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చూడాలని వరంగల్ జిల్లా మద్దూరు మండలం లింగాపూర్ గ్రామస్తులు నిర్ణయించారు.  ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం కోసం స్వచ్ఛందంగా ఏడాదికి రూ.3 వేల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులు సర్పంచ్ సందిటి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమయ్యారు.

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌మీడియం లేనందున పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నామని, ఇంగ్లిష్ మీడియం ఉంటే ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏడాదికి రూ. 3 వేల చొప్పున విరాళం ఇవ్వాలని, ఆ మొత్తంతో ఇంగ్లిష్ మీడియం బోధనకు విద్యావలంటీర్‌ను నియమించాలని తీర్మానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement