ప్రభుత్వ బడుల్లోనే ఆడపిల్లలు
♦ పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
♦ సమాన అవకాశాలు నామమాత్రమే
నిజామాబాద్‌అర్బన్: ఆడపిల్లల సంఖ్య నానాటికి పెరుగుతుంది. విద్యాబోధనలో వీరికి అవకాశాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1015 ప్రభుత్వ పాఠశాలలు, 545 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 2,55,245 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. ఇందులో బాలురలు–13,0947 ఉండగా బాలికలు–124298 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు బాలికలు 50,433 ఉండగా, బాలికలు–52,674 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి నుండి బాలురు –75003 మంది ఉండగా, బాలికలు–60,953 మంది ఉన్నారు.
జిల్లా జనాభా 2011 సంవత్సరం ప్రకారం 15,71,022 ఉన్నారు. ఇందులో మగవారు–76,8477 ఉండగా మహిళలు–802545 మంది ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి వెయ్యి మందికిగాను 1044 గా ఉంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం 1,69,621 మంది ఉండగా ఇందులో మగవారు–86,867, ఆడపిల్లలు–82,754 ఉన్నారు. అక్షరాస్యత శాతం పరిశీలిస్తే చదువుకున్న మగవారు–5,04,933 ఉండగా ఆడవారు–3,95,503 మంది ఉన్నారు. నిరక్షరాస్యులను పరిశీలిస్తే మగవారి శాతం 74.08 , ఆడవారు 54.95 శాతం నమోదు ఉన్నారు.
నిజామాబాద్‌అర్బన్ పరిధిలో..... మొత్తం జనాభా –464750 ఉన్నారు. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 53587 మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ అర్బన్ పరిధిలో 42 ప్రాథమిక పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 150 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 42 వేల మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు.
నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మురికివాడల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉర్ధూ మీడియం పాఠశాలల్లో సుమారు 40 శాతం బాలికల కంటే బాలురలే పాఠశాలలకు వస్తున్నారు. ధర్మపురిహిల్స్, పూలాంగ్, కోటగల్లి, చంద్రశేఖర్‌కాలనీ,కోజాకాలనీ, మాలపల్లి, వినాయక్‌నగర్, పాములబస్తీ పాఠశాలల్లో బాలురలే ఎక్కువగా ఉన్నారు.