ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై నియంత్రణ ఏదీ ?
- జెడ్పీ స్థాయి సంఘ
- సమావేశంలో ప్రశ్నించిన
- జెడ్పీటీసీ సభ్యుడు
- కోరం లేక వాయిదా పడిన 3,6 స్టాండింగ్ కమిటీ సమావేశాలు
చిత్తూరు(ఎడ్యుకేషన్) : ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గుర్రంకొండ జెడ్పీటీసీ సభ్యుడు కురబలకోట రెడ్డిరాజ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ మీటింగ్‌హాలులో గురువారం 1,7 మినహా మిగిలిన స్థాయి సంఘాల సమావేశం జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. జెడ్పీ ఉపాధ్యక్షులు సుందరరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన నాలుగో స్థాయి సంఘ సమావేశంలో జెడ్పీసీటీ సభ్యుడు రెడ్డిరాజ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్‌కేజీ చదువుకు రూ.20నుంచి 30వేలు వసూలు చేస్తున్నా విద్యాశాఖ చూస్తూ ఊరుకోంటోందని విమర్శించారు.
ప్రతిస్కూల్ నోటీసు బోర్డులోనూ కమి టీ నిర్దేశించిన ఫీజుల వివరాలను పొందుపరచాల్సి ఉన్నా ఏ ఒక్క పాఠశాల కూడా పాటించలేదని తెలిపారు. తమ స్కూళ్లలోనే పుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం దుస్తులు, షూలు కొనాలని ప్రైవేటు స్కూళ్లు నిర్బంధ వ్యాపారాలను చేపడుతున్నా చర్యలు శూన్యమన్నారు. గుర్తింపు లేని పాఠశాలలు కోకొల్లాలుగా నడుస్తున్నా చర్యలేవైనా తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులు చాలా చోట్ల వ్యాపారాల్లో నిమగ్నమై స్కూళ్లకు సక్రమంగా వెళ్లడం లేదన్నారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని ఆయన కోరారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారా..? రాజకీయ కమిటీలకే పరిమితమవుతా రా అని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యు డు ధర్మయ్య ప్రశ్నించారు.
కేవీబీపురంలో పాత పీహెచ్‌సీ భవనానికి మరమ్మతులు చేపట్టాలని జెడ్పీటీసీ సభ్యు లు వాణి డీఎంహెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిధులు గ్రా మ స్థాయిలో దుర్వినియోగమవుతున్నాయని జెడ్పీ ఉపాధ్యక్షుడు సుందరరామిరెడ్డి చెప్పారు. సత్యవేడు మండ లం మదనంబేడు హైస్కూల్‌లో మ ధ్యాహ్నభోజనం చేసే రెండు గ్రూపుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయని, వాటిని పరిష్కరించాలని డీఈవోకు విన్నవించారు.
పొలకల గ్రామంలో బ్యాంకు రుణాలను కట్టి రెండేళ్లు గడిచినా బ్యాంకు మేనేజర్ 59 గ్రూపులకు కొత్తగా రుణాలివ్వలేదని, ఇటీవల ఆందోళన చేసిన బాధిత మహిళలపై మేనేజర్ కేసులు బనాయించారని జెడ్పీటీసీ సభ్యురాలు లత తెలిపారు. సాక్షర భారత్ కేంద్రాలు జిల్లాలో ఎక్కడా సక్రమంగా నడపటంలేదని, వారిపై ఏమైనా చర్యలు తీసుకు న్నారా అని ఆమె సాక్షరభారత్ డీడీ ఉ మాదేవిని ప్రశ్నించారు. ఐదవ స్థాయి సంఘ సమావేశం కార్వేటినగరం జెడ్పీటీసీ సభ్యురాలు గీతయాదవ్ అధ్యక్షతన జరిగింది. 3, 6 స్థాయి సంఘాల సమావేశాలు కోరం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు.