![Delhi School Segregated Students on the Basis of Religious Lines - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/11/studen.jpg.webp?itok=GGcD4FzZ)
న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్‌లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్‌లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్ సెహ్రావత్ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్‌డీఎంసీ కమిషనర్ మధుప్ వ్యాస్.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment