religion issues
-
ఏ ఛాందసవాదమైనా చెల్లనిదే!
డెహ్రాడూన్ నుంచి ఒక ముస్లిం బాలుడు నాకు ఒక ఉత్తరం రాశాడు. ‘‘జూలియో ఎఫ్ రిబీరో గారూ, అల్లా ఆశీర్వాదం మీపై ప్రసరించుగాక. నిన్న నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఫ్రాన్స్‌లో ఒక క్లాస్ టీచర్ ప్రవక్త మహమ్మద్(సా) వ్యంగ్యచిత్రం గీయమని విద్యార్థులను ఆదేశించారు. ఒక ముస్లిం విద్యార్థి అలాంటి పరిస్థితి పట్ల ఆశ్చర్యచకితుడై చివరకు ప్రవక్త గురించి నోట్‌బుక్‌పై రాశాడు. ప్రవక్త మహమ్మద్(సా) మా హృదయాల్లో నిండి ఉన్నారు. ముస్లిం ఉమ్మాలు ప్రవక్తను ప్రేమిస్తారు. వారు జీసస్, మోజెస్, డేవిడ్, ఇజాక్, ఇస్మాయిల్, అబ్రహాం, నోహ్లను కూడా ప్రేమిస్తారు. వారు ఖురాన్ ఆదేశాలను అనుసరించి హిందూ దేవతలను కూడా గౌరవిస్తారు. ప్రవక్త మహమ్మద్‌తో అలాంటి శాశ్వత బంధాన్ని ఎవరైనా, ఏరీతిగానైనా అగౌరవిస్తే ఇతర మతాలతో సంబంధాలు అర్థంలేనివిగా మారిపోతాయి. ఒక ముస్లిం తన ప్రవక్తపై అలాంటి దాడిని సహించలేడు. వాక్ స్వాతంత్య్రం పేరిట జీసస్‌ని అవమానిస్తున్న రీతిలో యూరప్.. ప్రత్యేకించి డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాలు ప్రవక్త మహమ్మద్‌ను కూడా అలాగే అవమానించగలమని ఎలా భావిస్తున్నాయి? ఒక ప్రేమాస్పదుడైన ఇస్లాం మతప్రవక్తను రాక్షసుడిగా చిత్రించే వాతావరణం ఎలా తయారవుతోంది? వాక్ స్వాతంత్య్రం పేరిట ఇస్లాం మతప్రవక్త పట్ల ప్రదర్శిస్తున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మీరు కూడా గళం విప్పుతారని భావిస్తున్నానండీ..’’ నేను ఆ అబ్బాయికి సమాధానం పంపాను. ‘ప్రవక్త ముఖచిత్రం ఎవరూ గీయవద్దని, అలా ఎవరైనా చిత్రిస్తే, అతడు లేక ఆమెను చంపేయాలని ఖురాన్ ఎక్కడైనా చెప్పిందా? అని తెలుసుకోకుండా ఈ అంశంపై ఎవరైనా రాయాలంటే కష్టమే. ఈ విషయంపై కాస్త స్పష్టత తప్పనిసరి’ అయితే ఈ అబ్బాయి మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి మత సంప్రదాయపరుల అంతరంగాన్నే ప్రతి బింబిస్తున్నాయి. ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్న వారు కూడా, ప్రవక్తను వ్యతిరేకించినవారిని చంపవద్దన్న ఖురాన్ ప్రవచనాలను గౌరవించినట్లయితే ఇలాంటి పిల్లల మనోభావాలను నేను గౌరవిస్తాను. లౌకికవాద ఉదారవాదులు ఒక పక్షం వహించి.. ఆ పక్షంలోని కొంతమంది చేసే అన్యాయాన్ని క్షమించేలా వ్యవహరించకూడదు. బాధితులకు రక్షణగా ఉదారవాదం పశు వ్యాపారులను, మాంస వ్యాపారులను, పశుమాంసాన్ని ఆరగించేవారిని కొట్టి చంపినప్పుడు, సీఏఏ, ఎన్నార్సీ వంటి వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నందుకు విద్యార్థులను, వృద్ధ మహిళలను యూఏపీఏ వంటి నిరంకుశ చట్టాలతో వెంటాడి వేధిస్తున్నప్పుడు లౌకిక ఉదారవాదులు బాధితులకు రక్షణగా నిలుస్తారు. అదేసమయంలో ఫ్రాన్స్ వంటి శక్తివంతమైన రాజ్యవ్యవస్థతో తలపడే శక్తి లేని కారణంగా ముస్లింలు కొందరు ఉగ్రవాద చర్యలకు పాల్పడినప్పుడు (ప్రవక్తపై పత్రికలో వచ్చిన కార్టూన్లు ప్రదర్శించినందుకు ఒక టీచర్ తల నరికారు) ఇదే లౌకికవాద ఉదారవాదులు శషభిషలు లేకుండా ఈ ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తారు. తన దేశ పౌరుడి హత్యను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఖండించారు. మన ప్రధాని మోదీ కూడా ముస్లిం ఉగ్రవాదులు పారిస్ టీచర్ని హత్య చేసిన ఘటనను ఖండించిన తొలి ప్రపంచ నేతగా ముందుకొచ్చారు. కానీ భారత్‌లో ముస్లింలను చిత్రవధ చేసిన ఘటనలపై మన ప్రజారంజక ప్రధాని చేసే ఖండనకోసం మనం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఫ్రాన్స్ జాతీయ విషాదంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్‌కి మోదీ మద్దతు తెలుపడం మంచిదే. తెలివైన చర్య కూడా. కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో పశువ్యాపారులపై వరుసగా జరుగుతూ వచ్చిన చిత్రవధ ఘటనలపై కూడా మోదీ అంతే స్థిరంగా ఖండన తెలిపి ఉంటే మన దేశంలోని లౌకిక ఉదారవాదులు ఆయన్ని అభినందించి ఉండేవారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా ఏ మతస్థులైనా సరే.. మతఛాందసవాదంతో చేసే అతి చర్యలన్నింటినీ నాలాంటి ఉదారవాదులం తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం. జాతీయ విలువలకు మతంతో సంబంధం లేదు రాజీలేని సమరశీలి తీస్తా సెతల్వాద్ భర్త జావేద్ ఆనంద్, లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆయన తోటి ముస్లింల బృందం ఫ్రాన్స్ అధ్యక్షుడి పక్షం వహించి, టీచర్ తల నరికిన అనాగరిక చర్యకు పాల్పడిన ఫ్రెంచ్ ముస్లింలను ఖండించినప్పుడు లౌకిక ఉదారవాదులు ఉప్పొంగిపోయారు. కానీ ఆ మరుసటి రోజు ముంబైలో, ఇతర భారతీయ నగరాల్లోనూ వేలాదిమంది ముస్లింలు వీధుల్లోకి వచ్చి ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనపై ఆగ్రహం ప్రదర్శించడం నావంటివారిని ఎంతో అసంతృప్తికి గురిచేసింది. ఫ్రెంచ్ జాతీయ విలువలతో ఇస్లాంకి మాత్రమే కాదు ఏ ఇతర మతానికీ సంబంధం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. క్రిస్టియన్ మత విశ్వాసాలను స్థిరంగా ఖండించిన ‘ది డావిన్సీ కోడ్’ వంటి సినిమాలను ఎలాంటి హింసాత్మక ప్రతిచర్యలు లేకుండా ఫ్రాన్స్ సినిమా హాళ్లలో ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఫ్రెంచ్ పౌరుల్లో మెజారిటీగా ఉన్న క్రిస్టియన్లు కూడా మతం పట్ల తమ వైఖరిని సడలించిన సందర్భంలో ఫ్రాన్స్ జనాభాలో ఒక మోతాదులో ఉన్న ఇస్లాం అనుయాయులు తమ ప్రవక్తపై ఈగ వాలనీయనంత సున్నితంగా ఉంటున్నారు. ట్రిపుల్ తలాఖ్ అంశంలో ముల్లాలను తీవ్రంగా ప్రతిఘటించిన ఉత్తమ ముస్లిం మహిళ జకియా సోమన్ కూడా ఫ్రాన్స్‌లో తన తోటి మతస్థులు జరిపిన అనాగరిక చర్యను ఖండిస్తూ బహిరంగంగా ముందుకొచ్చారు. దీనికి గానూ ఆమె భారతీయ ముస్లింల వ్యతిరేకతను చూరగొనవచ్చు. అయినాసరే, పత్రికా కాలమ్‌లో తన అభిప్రాయాన్ని చాటి చెప్పినందుకు ఆమెకి నా సెల్యూట్. ఇస్లాంను పాటిస్తున్న నా తోటి మానవులు అనేక తిరోగమన సంప్రదాయాలను వ్యతిరేకించాల్సిన, త్యజించవలసిన అవసరం ఉంది. వారి వివాహ, విడాకుల చట్టాలు, వారి రోజువారీ జీవి తంలో మహిళలకు లభిస్తున్న స్థానం వంటి ప్రధానాంశాలపై చర్చ సాగించాల్సి ఉంది. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం షా బానో తీర్పును మార్చిపడేసిన తీరు భారత్‌లో ముస్లింల పట్ల సానుభూతి ప్రదర్శించేవారికి కూడా షాక్ కలిగించింది. ఇదే తదనంతర కాలంలో కాంగ్రెస్ పాలన పతనానికీ, బీజేపీ వికాసానికి దారితీసింది. ఛాందసవాదం తెచ్చే నష్టాలు ఇస్లాం ముల్లాలు తీసుకున్న మరొక నిర్ణయం కూడా నాకు మరింత షాక్ కలిగించింది. చరిత్రలోకి వెళితే 1965 లేక 1971 యుద్ధంలో ఒక బారతీయ సైనికుడిని పాకిస్తానీయులు బంధించారు. అతడు ఒక ముస్లిం. అయితే అతడి గురించిన సమాచారం ఏడు సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలీకుండా పోయింది. దీంతో అతడి భార్య మరో వివాహం చేసుకుంది. రెండో భర్త ద్వారా ఆమె ఒక బిడ్డను కన్నది. వారు సంతోషంగా గడిపేవారు. ఉన్నట్లుండి ఒక రోజున పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భారతీయ ముస్లిం సైనికుడిని విడుదల చేసి స్వదేశానికి పంపించేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ముస్లిం మతగురువులు ఆమె చేసుకున్న రెండో వివాహాన్ని రద్దు చేసుకుని మళ్లీ తన తొలి భర్త అయిన సైనికుడితోనే కాపురం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో ఆమె అభిప్రాయమేమిటో తెలుసుకోవాలని కూడా ముల్లాలు భావించలేదు. శత్రుదేశంలో నిర్బం ధంలో ఉండి విడుదలై వచ్చిన మన ముస్లిం సైనికుడు.. రెండో భర్త ద్వారా ఆమెకు కలిగిన బిడ్డను ఆమోదించకపోవడంతో ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన కూడా ఎవరూ పోలేదు. నాతోటి భారతీయ ముస్లిం సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకుని వారిపై అన్యాయంగా దాడి చేసిన సందర్భంలో వారికి సహాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. కొన్ని సమస్యల్లో వారికి తోడ్పడ్డాను కూడా. ఇకపై కూడా ఇలాంటి ఘటనల సందర్భంలో నేను నావంతు సహాయం అందించడానికి తప్పక ప్రయత్నిస్తాను. అదే సమయంలో మతం పేరిట అనాగరిక చర్యలను నేను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేను. ముస్లిం సోదరులు ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలను వారి ఇంట్లోనూ, వారి మతంలోనూ బానిస స్థానంలో ఉంచాలని ఏ దేవుడైనా చెప్పగలడా? ఏ దేవుడైనా తనను ధిక్కరించిన వారిని వెంటాడి చంపాలని చెప్పగలడా? ఇలాంటి అసమానత్వాన్ని, అన్యాయాన్ని నేను పాటించే లౌకిక ఉదారవాదం ఎన్నటికీ అంగీకరించదు.. ఆమోదించదు కూడా. వ్యాసకర్త జూలియో రిబీరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి -
దయచేసి క్రికెట్‌ను మతంతో కలపకండి : ఇంజమామ్
-
దయచేసి క్రికెట్‌ను మతంతో కలపకండి : ఇంజమామ్
కరాచి : పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియాకు కొందరు ఆటగాళ్ల తమ దగ్గరకు రానిచ్చేవారు కాదని వస్తున్న ఆరోపణలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ స్పందించాడు. ఇంజమామ్ మాట్లాడుతూ.. దానిష్ కనేరియాను కొంతమంది ఆటగాళ్లు దూరంగా పెట్టేవారని, ఎవరు అతనితో తినడం కానీ బయటికి వెళ్లరని వస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో కనేరియా చాలా మ్యాచ్‌లు ఆడాడని స్పష్టం చేశాడు. సక్లెయిన్ ముస్తాక్ రిటైర్ అయిన తర్వాత ఒక లెగ్ స్పిన్నర్‌గా కనేరియా భవిష్యత్తులో మంచి ఆటగాడిగా పేరు సంపాదిస్తాడని అప్పట్లో జట్టు మేనేజ్మెంట్ భావించేది. తాను జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో దానిష్ కనేరియాతో ఏ ఒక్క ఆటగాడు కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని, తనకు తెలిసి ఒక ముస్లిమేతర ఆటగాడిని దూరంగా పెట్టడం చేయలేదని పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణ పాక్ మాజీ బ్యాట్సమెన్ మహ్మద్ యూసఫ్ అని వెల్లడించాడు. యూసఫ్ మతం మారకముందు ఒక క్రిస్టియన్ అని, అతని పేరు కూడా యూసఫ్ యోహన అన్న విషయం మీ అందరికి తెలిసిందే. అలాంటిది అతను మతం మారిన తర్వాత మహ్మద్ యూసఫ్‌గా పేరు మార్చుకున్నప్పుడు ఎలాంటి వివాదాలు చెలరేగలేదని గుర్తు చేశాడు. క్రికెట్‌ను, మతాన్ని ఎప్పుడు ఒకటిగా కలిపి చూడొద్దని ఇంజమామ్ పేర్కొన్నాడు. అంతేకాదు పాక్ ప్రజలు సహృదయులని, వారు అందరిని పెద్ద హృదయంతో అంగీకరిస్తారని అన్నాడు. అందుకు ఉదాహరణ పాక్ జట్టుకు నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో 15 సంవత్సరాల తర్వాత 2004లో భారత జట్టు పాక్‌లో పర్యటించింది.మ్యాచ్‌ల ఫలితం ఎలా ఉన్నా, అప్పుడు మేము భారత ఆటగాళ్లను గౌరవించిన తీరును పాక్ ప్రజలు తమ దేశానికి వచ్చిన వారిని ఎంతగా అభిమానిస్తారో మీకే తెలస్తుందని పేర్కొన్నాడు. అయితే మేం ఒక సంవత్సరం తర్వాత భారత పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అదే రీతిలో మాకు స్నేహపూర్వక స్వాగతం లభించిందని చెప్పుకొచ్చాడు. ఇరు దేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని , ఈ విషయంలో తాను ఏ ఒక్కరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని తెలిపాడు. ముస్లిమేతర ఆటగాళ్లను మాతో పాటు తిననివ్వలేదని ఆరోపణలను తాను కొట్టివేస్తున్నానని తెలిపాడు. 2005లో మేము భారత పర్యటనకు రాకముందు తాను సౌరవ్ గంగూలీ కొత్తగా ప్రారంభించనున్న హోటల్‌ను సచిన్‌తో కలిసి హాజరయ్యానని తెలిపాడు. ఆ తర్వాత గంగూలీ తన రెస్టారెంట్ నుంచి చాలా సార్లు పంపించిన ఆహారాన్ని తాను ఎంతో ఇష్టంతో తినేవాడినని ఇంజమామ్ వెల్లడించాడు. (ఇక ఆపండి చాలు: షోయబ్ అక్తర్) (‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్’) -
ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం
లక్నో : కొన్ని మత సంస్థలు వీధుల్లో హనుమాన్ చాలీసా చదవడం, మహా హారతి ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే వార్తలు రావడంతో వీధుల్లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని అలీగఢ్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ముస్లింలు రోడ్లపై నమాజ్ చేస్తుండటంతో అందుకు ప్రతిగా కొన్ని హిందూ సంస్థలు రహదారులపై మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే సమాచారాన్ని అలీగఢ్ జిల్లా మేజిస్ర్టేట్ చంద్ర భూషణ్ సింగ్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దీంతో ఇరు మతాల పెద్దలతో సమావేశమైన జిల్లా మేజిస్ర్టేట్ రోడ్లపై ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వీధుల్లో కాకుండా దేవాలయాలు, మసీదుల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలని ఆయా సంస్థలు, సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలీగఢ్ సమస్యాత్మక ప్రాంతమైనందున ఎలాంటి మతపరమైన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టేముందు నిర్వాహకులు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. -
వేర్వేరు సెక్షన్లలో హిందూ–ముస్లిం విద్యార్థులు
న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్ సెహ్రావత్ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్డీఎంసీ కమిషనర్ మధుప్ వ్యాస్.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. -
సమరయోధులకు కుల, మతాల రంగు పులమొద్దు
ఖిలావరంగల్: స్వాతంత్య్ర, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అసువులు బాసిన పోరాట యోధులకు కులం, మతం రంగు పులమొద్దని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఓరుగల్లు ఉద్యమ కెరటం బత్తిని మొగిలయ్యగౌడ్ 72వ వర్ధంతి, శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఖిలావరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్లో జరిగిన మొగిలయ్య కాంస్య విగ్రహం భూమి పూజకు ఆయన హాజరయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం సమరయోధులను విస్మరించడం బాధాకరమన్నారు. యోధుల కుటుం బాలను ప్రభుత్వం గుర్తించి వారికి సుముచిత స్థానం కల్పించాలన్నారు. మొగిలయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వమే కమ్యూనిటీ హాల్ నిర్మించి దానికి మొగిలయ్య పేరు పెట్టాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ బత్తిని మొగిలయ్య కుటుంబంతో 32 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఆయన పేదలు, బడుగుల దాస్య విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. -
ఏది సహనం ఏదసహనం ఓ మహాత్మా!
సమకాలీనం ఒక్క మతోన్మాదమే కాకుండా ఈరోజు జీవితం అన్ని పార్శ్వాల్లోనూ అసహనం ప్రబలు తోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భాషా, ప్రాంతీయ పరమైన అసహనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా బహుళ సంఖ్యాకుల్లో సహనమే భారత వైవిధ్యానికి రక్షణ. కొన్నేళ్లుగా పెరుగుతున్న పోకడలే ప్రమాదకరంగా ఉన్నాయి. సహనా నికి ప్రతీక భారతదేశం అని చెబుతూ, ‘మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి’ అంటే నడిచే రోజులు కావివి. ఇప్పుడేం జరుగుతోందన్నదే ముఖ్యం. అసాధారణ అసహనం పట్లా అతి సహనంగా ఉన్నామా? మన సహజ సహనం వీడి అసహనంతో ఉంటున్నామా? లేక రెండూనా? అంతుబట్టని స్థితి నెలకొంటోంది. చిత్ర ప్రముఖుడు అమీర్‌ఖాన్ తన భార్య కిరణ్‌రావ్‌కు వచ్చిన ఓ ఆలోచనను ప్రస్తావించి,‘‘..... ఏమిటిది? ఏం జరుగుతోంది?’’ అని తన మనసు పంచుకొని, ఆందోళన వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. లేని ‘అసహనా’న్ని పెద్దది చేసి చూపుతూ భారత ప్రతిష్టను ఆయన మంటగలుపుతున్నాడంటూ ఊగిపోతున్న వారి మాటలు... ‘లేదు లేదు, అసహనం ఉంది, అది తీవ్ర స్థాయిలోనే ఉంద’ని ధృవీకరించేవిగా ఉన్నాయి. అమీర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆయనది దేశద్రోహుల భాష అని, ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం రాకుండా పాక్ పన్నిన కుట్రలో ఇది భాగమనీ, అట్లయితే ఆయన్ని పాకిస్తాన్ వెళ్లమనండని, ఆయన సినిమాల్ని నిషేధించండని ఇలా... చాలా విమర్శలే వచ్చాయి. ‘ఇంతకీ, అమీర్ ఏమి మాట్లాడాడు...?’ అది తెలుసుకొని స్పందించడంలోనే ఈ వ్యాఖ్యాతల ‘సహనం’ లోపించింది. పోనీ, ఏం మాట్లాడి ఉండాల్సింది? ఎవరితోనైనా ముందు సంప్రదించి, అనుమతి తీసుకుని ఆ మేరకే మాట్లాడి ఉండాల్సిందా? ఇదేనా ప్రజా స్వామ్యం? సగటు ఆలోచనాపరులందరిలోనూ ఇప్పుడీ సందేహాలు కలుగు తున్నాయి. ఎందుకంటే, ఆయన మాటల్ని ముక్కలుగా విరిచి, వీలయిన రీతిలో అన్వయించి, పెడార్థాలు తీస్తున్న వారి వాదనలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది! రామునితోక..... పివరుండిట్లనియే అని విడగొట్టి చదవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఇందులో మీడియా పాత్రేం తక్కువది కాదు! ఈ దేశంలో... ప్రభుత్వం, చట్టం, రాజ్యాంగం నీడన రక్షణ పొందుతున్న కొందరు పెద్దలు మాట్లాడినట్టు అమీర్‌ఖాన్ మరీ బాధ్యతా రహితంగా ఏం మాట్లాడలేదే! ‘హిందువులు కాని వారు దేశం వీడిపోవాలి’ అనో, ‘గోవధ నిషేధాన్ని సమర్థించని వారికీ దేశంలో స్థానం లేదు- వారంతా పాకిస్తాన్ వెళ్లాల’నో, ‘పశుమాంసం తినే వారిని ఉరితీయాల’నో అనలేదు. ఇద్దరు దళిత కుర్రాళ్లను దుండగులు సజీవ దహనం చేసినపుడు, ‘దారినపోయే ఎవరో, కుక్కలపై రెండు రాళ్లు విసిరితే అందుకు తమ ప్రభుత్వం బాధ్యత వహించజాలద’నీ అనలేదు. అలా మాట్లాడినవారంతా సహనశీలురయ్యారు. ‘రోజూ వస్తున్న వార్తా కథనాల తీవ్రత చూస్తే... గతంలో కన్నా ఇప్పుడు భయం పెరిగి, అభద్రత నెలకొందని అనిపిస్తోంది.... నేనూ నా భార్య కిరణ్ జీవితమంతా భారత్‌లోనే ఉన్నాం. కానీ, తను మొదటిసారి... భారత్ విడిచి వెళ్దామా? అంది, ఆమెకెందుకా ఆలోచన వచ్చిందో గాని, అలా మాట్లాడటం దురదృష్టకరం...’ అని తన మనసు విప్పి చెప్పిన అమీర్, అసంబద్ధంగా మాట్లాడాడు అన్నది ఇప్పుడీ పెద్దల సూత్రీకరణ! ‘ఈ దేశం అమీర్‌కు ఇంత స్థానం కల్పిస్తే, ఇలా మాట్లాడతాడా?’ అంటారు. దేశంలో ఏం జరుగుతున్నా... నోరు విప్పొద్దనే ఒప్పందం మీద ఆయన్ని స్టార్‌ని చేశారా ఎవరైనా? ఆయన సినీ హీరో అయి సంపాదించిందంతా ఎవరైనా ఉదారంగా విరాళమిస్తే వచ్చిందా? పోనీ, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి సంపాదిస్తే, శిక్షించకుండా దయతో ఉపేక్షించారా? ఏం పెద్ద మనుషులు వీరు? తమకు సరిపోని భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కవులు, రచయితలను మతోన్మాదులు మట్టుపెట్టడం అసహనం కాదా? కర్ణాటకలో కల్బుర్గి, మహారాష్ట్రలో పాండేను హతమార్చడం, సుధీంద్ర కులకర్ణిపై ఇంకు పోయడం దేశ వ్యాప్తంగా కవులు, కళాకారుల్ని కలవరానికి గురి చేసింది. అవార్డులు, గౌరవ పురస్కారాల్ని వెనక్కి ఇచ్చి తమ నిరసన తెలిపారు. ఒక వ్యక్తి గోవును చంపి మాంసం తిన్నాడనే నింద మోపి, ఉన్మాదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్కడికక్కడే ఆయన్ని హతమార్చడం అసహనం అవదా? వీటిని సరైన రీతిలో నియంత్రించాల్సిన పాలనా వ్యవస్థలు చేష్టలుడిగి ఉండటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఇంటింటి వద్ద కాపలా ఉంచో, ప్రతి ఉన్మాది మీద నిఘా పెట్టో రక్షణ కల్పించలేకపోవచ్చు! కానీ, అసహనం పెరిగి, చట్టవ్యతిరేక ఘటనలు చోటు చేసుకున్నపుడు తక్షణం స్పందించడం ద్వారా సరైన సంకేతాలు పంపాలి. మన ప్రధాని నరేంద్ర మోదీ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఇలాంటి స్థితే వచ్చినపుడు ఎలా స్పందించారో తెలీదా! ఒక నల్లజాతి ప్రొఫెసర్‌పై అమెరికా నడిబజారులో దాడి జరిగితే, స్వయంగా అక్కడికి వెళ్లి, ‘ఇది అరుదుగా జరిగే అసాధారణ ఘటన, మేం ఇటువంటివి ఎక్కడా జరుగనివ్వం’ అని విస్పష్టంగా ఖండిస్తూ, సదరు ప్రొఫెసర్‌ను వైట్‌హౌజ్‌కు తెచ్చుకొని సహపంక్తి భోజనం చేశారు. భవిష్యత్ భద్రతా చర్యలపై అమెరికన్లకు ఓ భరోసా కల్పించారు. ఇక్కడ అలా చేయకపోవడం ద్వారా, పెచ్చరిల్లిన మత అసహనం పట్ల పాలకులు అత్యంత సహనం చూపిన వారవుతున్నారు. అదే అలుసుతో పెట్రేగిన ఉన్మాదులు ‘కబడ్దార్’అని ఊగిపోయారు ఒక దశలో! అక్కడక్కడ ముఖ్యమంత్రులకే హెచ్చరికలు చేశారు. ఇక నాలుకల విచ్చలవిడి తనానికి హద్దే లేదు. భారతదేశంలోని ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపిస్తే ఇక్కడ జనాభా తగ్గి, హిందువులంతా హాయిగా ఉంటారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అనడం ఏ రకమైన సహనానికి ప్రతీక? ‘ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురిని కనాలి’ అన్న ఇంకో ఎంపీ, సాక్షీ మహారాజ్, గోవధకు పాల్పడే వారిని ఉరితీసేందుకు ఓ చట్టమే తేవాలనడం సహనమా? అసహనమా? బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు, అస్సాం ప్రస్తుత గవర్నర్ పీబీ ఆచార్య ‘భారత్ హిందువులది, అసంతృప్తి ఉన్న ముస్లింలు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చ’ని బహిరంగంగా ప్రకటించడం ఏ లౌకిక రాజ్యాంగ సూత్రాలకు లోబడి చెప్పిందో ఈ సహనశీలురే వివరించాలి. భారత రాజ్యాంగం కల్పించే హక్కులకు పూచీకత్తుగా ఉంటానని ప్రమాణం చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్, ‘మోదీని వ్యతిరేకించేవారు యథేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అంటారు. అదే గిరిరాజ్ సింగ్, 2014 ఎన్నికలప్పుడు ‘సోనియాగాంధీ ఏ నల్లతోలు నైజీరియనో అయితే ఈ స్థాయికి వచ్చి ఉండేవారా?’ అని వదరుబోతుతనం చాటి, క్షమాపణ చెప్పాలని నైజీరియన్ హై కమిషన్ డిమాండ్ చేస్తే చివరకు తోక ముడిచారు. ఎల్లెడలా పెరుగుతున్న ‘అసహనాలు’ ఒక్క మతోన్మాదమే కాకుండా ఈరోజు జీవితం అన్ని పార్శ్వాల్లోనూ అసహనం ప్రబలుతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భాషా, ప్రాంతీయ పరమైన అసహనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మనిషి మనుగడను తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా బహుళ సంఖ్యాకుల్లో సహనమే భారత వైవిధ్యానికి రక్షణ. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న పోకడలే ప్రమాదకరంగా ఉన్నాయి. సహనానికి ప్రతీక భారతదేశం అని చెబుతూ, ‘మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి’ అంటే నడిచే రోజులు కావివి. ఇప్పుడేం జరుగుతోందన్నదే ముఖ్యం. మానవసంబంధాలు పలుచబారడంతో పెరుగుతున్న సామాజిక అసహనం నుంచి చట్టసభల్లో ప్రత్యర్థులే ఉండొద్దని కుట్రలు-కుతంత్రాలు పన్నే రాజకీయ అసహనం వరకు అంతటా అలముకొందీ జాఢ్యం. అవధుల్లేని అధికారపు రుచి మరిగి, ఇక విపక్షంలో ఉండలేని రాజకీయ అసహనానికి హద్దులే లేవు. రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్లో పటేళ్లు, ఉత్తర భారతంలో జాట్లు జరిపిన సామాజిక ఆందోళనలు వారిలో పెరుగుతున్న అసహనానికి ప్రతీక. నదీ జలాలకోసం ముదురుతున్న వివాదాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యే కాకుండా ఆయా రాష్ట్ర ప్రజల మధ్య అసహనం పెరుగుదలకు కారణమౌతున్నాయి. కేరళ-తమిళనాడు మధ్య ముళ్లపెరియార్ డ్యామ్ వివాదం, తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరీ జలజగడం, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) తుంగభద్ర-కృష్ణా జల పంచాయతీ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య కృష్ణా-గోదావరీ జలాల వివాదం, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య బాబ్లీ నీటి తగాదా.... ఇవన్నీ కూడా పాలకుల్లో, పౌరుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. భాషాపరమైన అసహనాలు పెచ్చుమీరుతున్నాయనడానికి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి ఆందోళన ప్రత్యక్ష ఉదాహరణ. మనుషుల నిత్యావసరాలైన విద్య-వైద్యం వ్యాపారమయం కావడంతో సంబంధీకులందరిలోనూ అసహనం ప్రబలుతోంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు, పెద్ద జీతాలు రావాలనే ఆరాటంలో విద్యార్థులు, వారిపై ఒత్తిడి పెంచుతున్న తల్లిదండ్రులు, ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న విద్యాసంస్థలు... ఇలా అందిరిలోనూ ఏదో ఒక దశలో అసహనం బట్టబయలౌతోంది. సంఘంలో ఆర్థిక అంతరాలు అఘాతాలు సృష్టిస్తున్నాయి. ఆదాయం లేక జీవన ప్రమాణాలు పెరగని చోట ఆర్థిక ఇబ్బందులు, ఇబ్బడి ముబ్బడిగా ‘తేలిక’ సంపాదన పెరిగిన చోట ఆధునిక జీవన సరళి తెచ్చిన కొత్త సమస్యలు.... ఇలా కారణమేదైతేనేం కుటుంబాల్లో అసహనం పెచ్చుమీరుతోంది. అంతిమంగా అది అశాంతికి దారి తీస్తోంది. మిగతా అన్ని రంగాల్లో లాగానే ఇక్కడ కూడా విలువలు నశించడంతో సగటు జీవనం సంక్లిష్టమై అసహనం అసాధారణ స్థాయికి చేరుతోంది. కడకది కుటుంబ కలతలకు, విడాకులకు, ఆత్మహత్యలకు, హత్యలకు దారి తీస్తున్న విపరిణామాలెన్నో! చిన్న తగాదాలు, సూటిపోటి మాటలకే బలవన్మరణాలు మామూలయ్యాయి. ‘నేను ప్రేమిస్తున్నాను, కనుక నువ్వు ప్రేమించాల్సిందే’ ననే ఏకపక్ష ఉన్మాదం యాసిడ్ దాడులకో, హత్యలకో పురిగొల్పేంత అసహ నాలు పెచ్చు మీరాయి. భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ‘సహనం’ ఈ రోజు నవతరానికి పుక్కిట పురాణమైపోతోంది. ఏ వెలుగులకీ ప్రస్థానం? ‘అసహనమే ఒక విధమైన హింస, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎదుగుదలకు పెద్ద అవరోధం’ అంటారు పూజ్య బాపూజీ. సహనమైనా, అసహనమైనా... పాలకుల స్వభావాన్ని బట్టి, వారిచ్చే సంకేతాల్ని బట్టి ఆయా సమాజాల్లో వాటి హెచ్చు-తగ్గులు సహజం. అనారోగ్యకరమైన పోటీలో ప్రసార మాధ్య మాలు బాధ్యత మరచి వ్యవహరిస్తే మరింత ప్రమాదమన్నది సామాజిక వేత్తల భావన. అమీర్‌ఖాన్ వివాదం ఇందుకొక ఉదాహరణ అంటున్నారు. కులం, మతం, వర్గం అన్న భేదాల్ని కాసేపు పక్కన పెడితే, దేశంలో నెలకొన్న ఓ పరిస్థితిపై అభిప్రాయం వ్యక్తం చేస్తే తప్పెలా అవుతుందన్నదే ప్రశ్న. ‘కాలుష్యం పెరిగిపోయి ఈ నగరం నివాసయోగ్యంగా లేదు’ అంటే, ‘పిచ్చోడివా...? ఇదే నగరంలో పుట్టి, ఇక్కడే చదివి, మంచి ఉద్యోగం-ఆస్తి సంపాదించిన నీవు.... నగరం గురించి ఇదేనా మాట్లాడే తీరు? తప్పు!’ అంటే, ఇక భావ ప్రకటనా స్వేచ్ఛకు దిక్కేది? దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
మత మార్పిళ్ళపై అట్టుడికిన సభ