hindu students
-
వేర్వేరు సెక్షన్లలో హిందూ–ముస్లిం విద్యార్థులు
న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్ సెహ్రావత్ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్డీఎంసీ కమిషనర్ మధుప్ వ్యాస్.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. -
మదర్సాలో 70 శాతం విద్యార్థులు హిందువులే
-
మదర్సాలో 70శాతం హిందూ విద్యార్థులు
సూరత్ : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో గల మదర్సా ఇస్లామియా హైస్కూల్లో దాదాపు 70 శాతం మంది విద్యార్థులు హిందువులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ మదర్సాలో ఎల్కేజీ నుంచి ఫ్లస్‌టూ వరకు తరగతులు ఉన్నాయి. మిగతా ముప్ఫై శాతం విద్యార్థులు ముస్లింలు. సూరత్‌లోని మోతవరచ్చలో గల ఈ హైస్కూల్లో మత భేదాలు ఉండవు. దాదాపు వందేళ్ల నుంచి ఇదే పద్దతి కొనసాగుతుందని పాఠశాల ప్రిన్స్‌పల్ గులామ్ హుస్సేన్ తెలిపారు. ఇక్కడ వివిధ కుల, మతాల పిల్లలు చదువుకోవడానికి వస్తారని స్థానికులే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వారు కూడా ఇక్కడ చదువుతున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ అన్ని సబ్జెక్టులతో సమానంగా మానవత్వం గురించి విద్యార్థులకు బోధిస్తామని తెలిపారు. -
హిందూ విద్యార్థులకు రిజర్వేషన్ ఎందుకివ్వరు?
కడప: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే రిజర్వేషన్ ను హిందూ విద్యార్థులకు ఎందుకు వర్తింపచేయరని వీహెచ్ పీ అధ్యక్షుడు (విశ్వహిందూ పరిషత్ ) ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు. శుక్రవారం హిందూ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముస్లింల రిజర్వేషన్ అంశాన్ని ఈ సందర్భంగా లేవనెత్తారు. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 12 శాతం రిజర్వేషన్ ను హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. హిందువులు పన్నులు కట్టడం లేదా? అని నిలదీశారు. రామ మందిరం నిర్మాణం జరిగేంతవరకూ హిందువులకు గౌరవం ఉండదని, ఎలాగైనా మందిర నిర్మాణం జరిపి తీరుతామని తొగాడియా పేర్కొన్నారు.