సూరత్ : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో గల మదర్సా ఇస్లామియా హైస్కూల్‌లో దాదాపు 70 శాతం మంది విద్యార్థులు హిందువులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ మదర్సాలో ఎల్‌కేజీ నుంచి ఫ్లస్‌టూ వరకు తరగతులు ఉన్నాయి. మిగతా ముప్ఫై శాతం విద్యార్థులు ముస్లింలు. సూరత్‌లోని మోతవరచ్చలో గల ఈ హైస్కూల్‌లో మత భేదాలు ఉండవు. దాదాపు వందేళ్ల నుంచి ఇదే పద్దతి కొనసాగుతుందని పాఠశాల ప్రిన్స్‌పల్ గులామ్ హుస్సేన్ తెలిపారు. ఇక్కడ వివిధ కుల, మతాల పిల్లలు చదువుకోవడానికి వస్తారని స్థానికులే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వారు కూడా ఇక్కడ చదువుతున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ అన్ని సబ్జెక్టులతో సమానంగా మానవత్వం గురించి విద్యార్థులకు బోధిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment