![హిందూ విద్యార్థులకు రిజర్వేషన్ ఎందుకివ్వరు? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41418396924_625x300.jpg.webp?itok=zUuhzDj7)
హిందూ విద్యార్థులకు రిజర్వేషన్ ఎందుకివ్వరు?
కడప: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే రిజర్వేషన్ ను హిందూ విద్యార్థులకు ఎందుకు వర్తింపచేయరని వీహెచ్ పీ అధ్యక్షుడు (విశ్వహిందూ పరిషత్ ) ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు. శుక్రవారం హిందూ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముస్లింల రిజర్వేషన్ అంశాన్ని ఈ సందర్భంగా లేవనెత్తారు. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 12 శాతం రిజర్వేషన్ ను హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
హిందువులు పన్నులు కట్టడం లేదా? అని నిలదీశారు. రామ మందిరం నిర్మాణం జరిగేంతవరకూ హిందువులకు గౌరవం ఉండదని, ఎలాగైనా మందిర నిర్మాణం జరిపి తీరుతామని తొగాడియా పేర్కొన్నారు.