
బడిని బతికిద్దాం..
♦ ఈ ఏడాది నుంచే స్కూళ్లలో బయోమెట్రిక్
♦ 25 శాతం పాఠశాలలకు వర్తింపు
♦ బడిబాటలో ఐదు శాతం విద్యార్థుల నమోదు పెరగాలి
♦ ఆ తర్వాత రేషనలైజేషన్‌పై నిర్ణయం డిప్యూటీ సీఎం ప్రకటన
అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ బడు లకు ఊపిరిలూదేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడికి ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఈ యేడు 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి కలెక్టర్లు, డీఈఓలు, ఎంఈఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఈ యేడు బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చే శారు. - పాపన్నపేట
పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యాప్రమాణాలే కాదు విద్యార్థుల సంఖ్యా తగ్గిపోతోందని, ఫలితంగా పాఠశాలలు మూతబడుతున్నాయంటూ ఇటీవల తెలంగాణ పేరెంట్ ఫెడరేషన్ తరఫున సాగర్‌రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో గత నెల 30న జిల్లాలోని సిద్దిపేట, నంగునూర్ మండలాల్లో మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలను సుప్రీం కోర్టు బృందం సందర్శించిం ది. ఈ సందర్భంగా బాగా పనిచేసే టీచర్లను నియమించి, బడులను మళ్లీ తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరు శాతాన్ని, సమయపాలనను క్రమబద్ధం చేసి, పర్యవేక్షణను మెరుగు పరిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం శ ుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యక్తమైంది.
బయోమెట్రిక్‌తో జవాబుదారీతనం...
బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, సమయపాలన మెరుగుపడుతుందని నిజామాబాద్, వరంగల్ కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్‌కు రూ.7,500నుంచి రూ.8వేల వర కు ఖర్చు వస్తుందన్నారు. మొదటివిడతగా 25 శాతం బడుల్లో ఈ యేడు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తామని కడియం ప్రకటించారు. పీఎస్, యూపీఎస్‌లకు సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ రకంగా జిల్లాలో సుమారు 600 పాఠశాలల్లో బయోమెట్రిక్ అమల్లోకి రానుంది.
5 శాతం అదనపు నమోదు లక్ష్యం...
శుక్రవారం నుంచి ప్రారంభమైన బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా నమోదు చేయాలని డిప్యూటీ సీఎం శ్రీహరి సూచించారు. బడిబాటను మొక్కుబడిగా కాకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులను, ఎస్‌ఎంసీలను, స్వచ్ఛంద సంస్థలను, ఎమ్మెల్యేలను, అవసరమై తే మంత్రులను భాగప్వాములను చేయాలని సూచిం చారు. బడిబాట కార్యాచరణను ఖరారు చేసే అధికా రం కలెక్టర్లకు అప్పగించారు. స్కూల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను, జిల్లా డెవలప్‌మెంట్ ప్లాన్ ను జిల్లా అధికారులు రూపొందించాలని ఆదేశించారు.
బడిబాట తర్వాత రేషనలైజేషన్...
పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్ అంశాన్ని మెదక్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రస్తావించగా, బడిబాట తర్వాత విద్యార్థుల నమోదు శాతంపై అవగాహన వస్తుందని, ఆ తర్వాతే రేషనలైజేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని కడియం తెలిపారు. అలాగే ప్రాథమిక స్థాయిలో స్నేహబాల పథకాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
సకాలంలో వీవీల నియామకం
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు త్వరలో విద్యా వలంటీర్లను నియమిస్తామని కడియం తెలిపారు. ఎక్కడైనా సింగిల్ టీచర్ సెలవుపై వెళ్తే సదరు పాఠశాల మూతబడకుండా వెంటనే వీవీలను అక్కడకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరి నియామకంపై కలెక్టర్లకు అధికారాలిస్తామన్నారు.