చిన్నారి వయస్సు నాలుగేళ్లు.. ఒళ్లో తమ్ముడు.. చేతిలో పలకాబలపం.. అప్పుడప్పుడు పాలు పడుతూ ఏడిస్తే అమ్మపాట పాడుతుంది. ‘అమ్మ పనికి వెళ్లింది.. వస్తుంది’ అంటూ సముదాయిస్తుంది. అసలు విషయానికి వస్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన లక్ష్మన్న, సుశీల దంపతులు. లక్ష్మన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 11 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రూతు(10), మౌనిక(4), 10 నెలల వయసు గల ఆనంద్ వారి సంతానం. అతని మరణానంతరం పిల్లలను పోషించేందుకు సుశీల కూలిబాట పట్టింది.