ఒకేరోజు అందించనున్న రోటరీ క్లబ్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే అవకాశం
హైదరాబాద్: 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకేరోజు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల బెంచీలు పంపిణీ చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోబోతున్నామని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (3150) మల్లాది వాసుదేవ్ తెలిపారు. ఆయన ఆది వారం ఫిలించాంబర్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ స్నేహం ద్వారా సేవ అన్న నినాదంతో తాము రోటరీ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 65 వేల బెంచీలు సరఫరా చేశామన్నారు. రోటరీ క్లబ్‌లు కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు మంచినీటిని అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లు, షూస్ కూడా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ హరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ శేషసాయి కుమార్, కమల్ కన్నన్, రాజేష్‌మింది పాల్గొన్నారు.
సర్కారీ బడులకు 25 వేల బెంచీలు
Published Mon, Dec 8 2014 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement