Benches distribution
-
స్కూళ్లకు సున్నాలు అంటూ నిధులకు కన్నాలు
-
జూకల్‌లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్
► సర్కార్బడి పిల్లలతో సరదాగా కబుర్లు ► పాఠశాలకు బెంచీలు పంపిణీ జూకల్ (శంషాబాద్‌రూరల్) : ‘బాబూ.. పలకపై నీరు పేరు రాసి చూపించూ.. పాఠశాలలో బెంచీలు బాగున్నాయా.. పిల్లలంతా కష్టపడి చదువుకుని బాగా ఎదగాలి’ అని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి మధ్య సరదాగా గడిపారు. సోమవారం ఆయన మండలంలోని జూకల్ గ్రామంలోని పాఠశాలకు చేరుకున్న ఆయన.. దాత రాఘవాచారి సాయంతో స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వితరణ చేసిన బెంచీలు ఉన్న గదిని విద్యార్థుల చేత ప్రారంభింపజేశారు. అనంతరం విద్యార్థులతో పాటు కూర్చుని వారితో కాసేపు మాట్లాడారు. చిన్నారుల పేర్లు, వారి తల్లిదండ్రలు పేర్లు, వారి ఆశయాలు ఏమిటన్నది.. పాఠ శాలలో వసతులపై విద్యార్థులతో ముచ్చంటించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గది, పాత్రలను పరిశీలించిన ఆయన.. గ్యాస్ సిలిండర్‌తో పాటు విద్యార్థులకు ఆట వస్తువులను అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు. గ్రామంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని ఆయన తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆయన వెంట ఇన్చార్జ్ ఎంఈఓ రాంరెడ్డి, ఏసీడీ డీఎస్పీ ప్రభాకర్‌రావు, నాయకులు వేణురెడ్డి, తదితరులు ఉన్నారు. -
సర్కారీ బడులకు 25 వేల బెంచీలు
ఒకేరోజు అందించనున్న రోటరీ క్లబ్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే అవకాశం హైదరాబాద్: 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకేరోజు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల బెంచీలు పంపిణీ చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోబోతున్నామని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (3150) మల్లాది వాసుదేవ్ తెలిపారు. ఆయన ఆది వారం ఫిలించాంబర్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ స్నేహం ద్వారా సేవ అన్న నినాదంతో తాము రోటరీ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 65 వేల బెంచీలు సరఫరా చేశామన్నారు. రోటరీ క్లబ్‌లు కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు మంచినీటిని అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లు, షూస్ కూడా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ హరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ శేషసాయి కుమార్, కమల్ కన్నన్, రాజేష్మింది పాల్గొన్నారు.