జూకల్‌లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ | acb dg ak khan in jookal govt schools | Sakshi
Sakshi News home page

జూకల్‌లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్

Published Tue, Dec 22 2015 1:38 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

జూకల్‌లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ - Sakshi

జూకల్‌లో ఏసీబీ డీజీ ఏకే ఖాన్

 ►  సర్కార్‌బడి పిల్లలతో సరదాగా కబుర్లు
 ►  పాఠశాలకు బెంచీలు పంపిణీ
 
 జూకల్ (శంషాబాద్‌రూరల్) :
‘బాబూ.. పలకపై నీరు పేరు రాసి చూపించూ.. పాఠశాలలో బెంచీలు బాగున్నాయా.. పిల్లలంతా కష్టపడి చదువుకుని బాగా ఎదగాలి’ అని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి మధ్య సరదాగా గడిపారు. సోమవారం ఆయన మండలంలోని జూకల్ గ్రామంలోని పాఠశాలకు చేరుకున్న ఆయన.. దాత రాఘవాచారి సాయంతో స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వితరణ చేసిన బెంచీలు ఉన్న గదిని విద్యార్థుల చేత ప్రారంభింపజేశారు. అనంతరం విద్యార్థులతో పాటు కూర్చుని వారితో కాసేపు మాట్లాడారు.

చిన్నారుల పేర్లు, వారి తల్లిదండ్రలు పేర్లు, వారి ఆశయాలు ఏమిటన్నది.. పాఠ శాలలో వసతులపై విద్యార్థులతో ముచ్చంటించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గది, పాత్రలను పరిశీలించిన ఆయన.. గ్యాస్ సిలిండర్‌తో పాటు విద్యార్థులకు ఆట వస్తువులను అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు. గ్రామంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని ఆయన తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ ఎంఈఓ రాంరెడ్డి, ఏసీడీ డీఎస్పీ ప్రభాకర్‌రావు, నాయకులు వేణురెడ్డి, తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement