ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు | Villagers opposed to the private school bus | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

Published Mon, Jun 20 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

నర్సంపేట రూరల్: మండలంలోని ముత్తోజీపేటలో సర్పంచ్, ఎంపీటీ సభ్యురాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి తమ గ్రామం నుంచి నర్సంపేటకు విద్యార్థులను తీసుకెళుతున్న ప్రైవేట్ పాఠశాలల బస్సును సోమవారం నిలిపివేశారు. విద్యార్థులను దింపి, వారందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మండ మహేందర్, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి లావణ్యరాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం తొలిసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారని, చిన్నారులను ఈ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజ లు సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ‘చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించమని, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement