సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఇవ్వాలని, తల్లిదండ్రుల వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఈ చర్యలు చే పట్టాలని పీఆర్‌టీయూ-టీఎస్ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రవీందర్, ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వెంకట్‌రెడ్డి కలసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పూర్తిగా పరీక్ష ఫీజు మినహాయిస్తే పాఠశాలల్లో నమోదు పెరుగుతుందన్నారు.