696 మంది అవసరమని జిల్లా విద్యా శాఖ ప్రతిపాదనలు
ఎందరిని నియమిస్తారన్న అంశంపై రెండు రోజుల్లో స్పష్టత
పాతవారి కొనసాగింపుపై వెల్లడికాని నిర్ణయం
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడ విద్యా వలంటీర్ల నియూమకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం సీఎం కేసీఆర్ పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించేవరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట విద్యా వలంటీర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. జిల్లాకలెక్టర్ అనుమతితో జిల్లా విద్యాశాఖాధికారి విద్యా వలంటీర్లను నియమిస్తారు. అందుకుసంబంధించిన మార్గదర్శకాలు వచ్చాక ప్రక్రియ కొనసాగే అవకాశాలున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 696 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదించారు. ప్రధానంగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. మరికొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉండి ఎస్‌జీటీలు ఎక్కువ ఉన్నారు.
ఏ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందో ముందుగా అక్కడ వర్క్‌అడ్జస్ట్‌మెంట్ చేసే అవకాశాలు ఉన్నారు. ఇంకా తక్కువపడితే విద్యా వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 696 మంది వలంటీర్లనే నియమిస్తారా లేదా ఇంకా కొంత సంఖ్య పెంచుతా రా అనేది వేచి చూడాలి. జిల్లాలో ఎం త మంది విద్యావలంటీర్లు నియూమ కం కానున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది. జిల్లాలో గత విద్యాసంవత్సరంలో 300 మందికిపైగా విద్యా వలంటీర్ల ను కొనసాగించా రు. వారిని మళ్లీ ఈ విద్యాసంవత్సరంలో కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.