The shortage of teachers
-
నిర్వీర్యం !
పదేళ్లలో నాలుగు వేల సర్కారీ పాఠశాలల మూత ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న విద్యార్థులు మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణాలు డీఐఎస్ఈ సర్వేలో వెల్లడి బెంగళూరు : సాంకేతిక పరిజ్ఞానం ఎంత చేరువవుతున్నా దానిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వాలు మీనమేషాలు వేస్తున్నారుు. దీంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతోంది. ఒక వైపు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల ఆకర్షితులు కావడం, అదే సమయంలో సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు తరచూ వేధిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ ఆగమ్యగోచరంగా తయారైంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డిస్టిక్ ్రఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (డీఐఎస్ఈ) పేరుతో జరిపిన సర్వేలో తేలింది. 2006-07 ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల సంఖ్య 52,760 కాగా, 2015-16లో ఆ సంఖ్య 48,760కు పడిపోరుుంది. అంటే పదేళ్లలో సంవత్సరాల్లో మూతబడిన పాఠశాల సంఖ్య అక్షరాల నాలుగువేలు. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో కూడా 22 వేల పాఠశాలల్లో ఒక్కొక్క విద్యాసంస్థలో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువగా ఉంది. ఇక 2006-07 ఏడాదిలో ఒకటో తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 7.69 లక్షలు కాగా, 2015-16లో ఆ సంఖ్య 5.23 లక్షలకు పడిపోరుుంది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాల్లో ఒకటి తరగతి విద్యార్థుల గణనీయంగా పెరిగింది. పదేళ్ల ముందు అన్‌ఎరుుడెడ్ ప్రైవేటు పాఠశాల్లో ఒకటో తరగతి విద్యార్థుల సంఖ్య 3.15 లక్షలు ఉండగా గత విద్యా ఏదాదికి ఆ సంఖ్య 5.11 లక్షలకు చేరింది. మొత్తం పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో (1-10 వరకూ) చదువుకొనే విద్యార్థుల సంఖ్య 64 లక్షల నుంచి 47.45 లక్షలకు పడిపోరుుంది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల సంఖ్య 23 లక్షల నుంచి 36 లక్షలకు పెరగడం గమనార్హం. 19,762 పాఠశాలల్లో ఆటస్థలాలే లేవు... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల లేమి కూడా కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాఠశాలల్లో 22,447 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో 11,277 పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేకపోవడం గమనార్హం. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 70 వేల గదులు బోధనకు అనుకూలంగా లేకపోగా అందులో 33 వేల గదులు శిథిలావస్థకు చేరుకున్నారుు. 10,406 పాఠశాలకు ప్రహరీలు లేవు. మరోవైపు విద్యార్థుల రక్షణ కోసం ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమరాలు కచ్చితమని చెబుతున్న ప్రభుత్వం...ఒక్క ప్రభుత్వ పాఠశాల్లో కూడా కెమరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఆరేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు బంద్... ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ జరగలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 32,888 ప్రాథమిక ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. అదేవిధంగా 5,063 హై స్కూల్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. దీంతో చాలా చోట్ల రెండు మూడు తరగతుల విద్యార్థులను ఒకే చోట చేర్చి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యా బోధన తీరు ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం విద్యా ప్రమాణాలు తగ్గకుండా 15,980 విద్యా వలెంటీర్లను నియమించామని చెబుతోంది. అరుుతే చాలా చోట్ల వీరికి సరిగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు కూడా ఇతర ఉపాధిని చూసుకుంటున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు బసవరాజ గురికార మాట్లాడుతూ... ’మౌలిక సదుపాయాల పెంపుతో పాటు సరిగా జీతాలు ఇస్తే ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరిగుతుంది. అరుుతే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడం లేదు. ఉదాహరణకు కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులే స్వచ్ఛందంగా నెలకు ఇంత మొత్తం అని విద్యా వలెంటీర్లకు ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
పలుకు‘బడి’!
జిల్లాలో 936 మంది వీవీల భర్తీ వీవీల కేటాయింపులో పైరవీలకు పెద్దపీట అవసరమున్న పాఠశాలలకు మొండిచేయి అవసరం లేకపోయినా నియామకం ముందుకు సాగని చదువులు ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యా శాఖలో పారదర్శకత లోపించింది. పైరవీలకే పెద్దపీట వేశారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా చదువులు సాగడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా విద్యా వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో 936 మంది వీవీలను నియమించుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అవసరమున్న బడులకు కేటాయించకపోగా అవసరం లేని చోట వీవీలను నియమించడంతో బోధన సాగకపోగా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదడ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - సంగారెడ్డి మున్సిపాలిటీ జిల్లా వ్యాప్తంగా 3,228 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రక్రియ జాప్యం జరుగుతోండడంతో అత్యవసరంగా విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలో రెండు విడతల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 936 మంది వీవీలను నియమించుకున్నారు. 275 బడుల్లో సింగిల్ టీచర్లు... జిల్లా వ్యాప్తంగా 275 ప్రాథమికోన్నత పాఠశాలలు ఒక టీచర్‌తోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా రెండు విడతలుగా జిల్లాలో 936 విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. వాస్తవానికి అవసరమున్న పాఠశాలలకు విద్యా వలంటీర్లను ఇవ్వకుండా పలుకుబడి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పనిచేస్తున్న బడులకే అదనంగా వీవీలను మంజూరి చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. - పుల్కల్ మండలం మంతూర్ పాఠశాల ఒకటి నుంచి 8 తరగతులున్నాయి. ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. కనీసం ఇక్కడ ఒక వీవీని కూడా నియమించలేకపోయారు. - ముద్దాయిపేట ప్రాథమిక పాఠశాలలో కేవలం 75 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉన్నా అదనంగా ఓ వీవీని కేటాయించారు. - మంతూర్‌లో ఉర్దూ మీడియంలో విద్యార్థులు చదువుకునేందుకు సిద్ధంగా ఉన్నా బోధించేందుకు టీచర్లు లేని కారణంగా తెలుగు మీడియంలోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. - పట్టణంలోని సంజీవ్‌నగర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నా అదనంగా వీవీని నియమించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అవసరమున్న పాఠశాలలను వదిలి అవసరం లేని పాఠశాలలకు పైరవీల ద్వారా వీవీ పోస్టులను మంజూరు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. 936 మంది వీవీల నియామకం: డీఈఓ జిల్లా వ్యాప్తంగా 936 మంది విద్యా వలంటీర్లను నియమించినట్టు డీఈఓ నజీమొద్దీన్ తెలిపారు. జిల్లాకు మొదటి విడతలో 695 మంది, రెండో విడతలో 203మందితోపాటు వికలాంగుల కోటా కింద 38 మంది వీవీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశామన్నారు. 993మందికి గాను 935 మందిని నియమించడం జరిగిందన్నారు. -
ఉపాధ్యాయులు లేని చోట విద్యా వలంటీర్లు
696 మంది అవసరమని జిల్లా విద్యా శాఖ ప్రతిపాదనలు ఎందరిని నియమిస్తారన్న అంశంపై రెండు రోజుల్లో స్పష్టత పాతవారి కొనసాగింపుపై వెల్లడికాని నిర్ణయం విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడ విద్యా వలంటీర్ల నియూమకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం సీఎం కేసీఆర్ పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించేవరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట విద్యా వలంటీర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. జిల్లాకలెక్టర్ అనుమతితో జిల్లా విద్యాశాఖాధికారి విద్యా వలంటీర్లను నియమిస్తారు. అందుకుసంబంధించిన మార్గదర్శకాలు వచ్చాక ప్రక్రియ కొనసాగే అవకాశాలున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 696 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదించారు. ప్రధానంగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. మరికొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉండి ఎస్జీటీలు ఎక్కువ ఉన్నారు. ఏ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందో ముందుగా అక్కడ వర్క్‌అడ్జస్ట్‌మెంట్ చేసే అవకాశాలు ఉన్నారు. ఇంకా తక్కువపడితే విద్యా వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 696 మంది వలంటీర్లనే నియమిస్తారా లేదా ఇంకా కొంత సంఖ్య పెంచుతా రా అనేది వేచి చూడాలి. జిల్లాలో ఎం త మంది విద్యావలంటీర్లు నియూమ కం కానున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది. జిల్లాలో గత విద్యాసంవత్సరంలో 300 మందికిపైగా విద్యా వలంటీర్ల ను కొనసాగించా రు. వారిని మళ్లీ ఈ విద్యాసంవత్సరంలో కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
కార్పొరేషన్ స్కూళ్లలో సర్దుబాట
తొలి విడత హైస్కూళ్లలో.. ప్రధానోపాధ్యాయులతో కమిటీ ఉపాధ్యాయుల కొరతపై ప్రభుత్వం దృష్టికి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో సర్దు‘బాట’కు కమిషనర్ జి.వీరపాండియన్ శ్రీకారం చుట్టారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. తొలి విడతగా హైస్కూళ్లలో క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులతో కమిటీ వేశారు. వారి సూచనల ప్రకారం విద్యాశాఖాధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అంతర్గతంగా బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం 400 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. నగరపాలక సంస్థ పరిధిలో 28 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆరు స్కూళ్లలో 18 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉండగా, ఐదు పాఠశాలల్లో 38 మంది ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా చోట్ల విద్యాప్రమాణాలు కుంటుపడుతున్నాయి. వేధిస్తున్న కొరత సర్దుబాటలో 18 మంది ఉపాధ్యాయుల్ని అవసరమైన స్కూళ్లకు బదిలీ చేసేందుకు ఫైల్ సిద్ధం చేశారు. మరో 20 మంది ఉపాధ్యాయుల్ని నియమించాల్సి ఉంటుంది. జేడీఈటీ, ఏకేటీపీ, ఎస్టీవీఆర్ స్కూళ్లలో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత ఉంది. 28 పాఠశాలలకుగాను 18 మంది తెలుగు పండిట్లు మాత్రమే పనిచేస్తున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లే హైస్కూళ్లలో తెలుగు పాఠాలు బోధిస్తున్నారు. మ్యాథ్స్, పీఎస్ సబ్జెక్ట్స్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 18 సక్సెస్ స్కూళ్లలో నాలుగు ఉపాధ్యాయ పోస్టుల్ని అదనంగా మంజూరుచేయాల్సి ఉంది. హైస్కూళ్లలో 2,356 మంది విద్యనభ్యసిస్తుండగా ఆ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సర్దుబాట అనంతరం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం.