నిర్వీర్యం !
పదేళ్లలో నాలుగు వేల సర్కారీ పాఠశాలల మూత
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న విద్యార్థులు
మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణాలు
డీఐఎస్‌ఈ సర్వేలో వెల్లడి
బెంగళూరు : సాంకేతిక పరిజ్ఞానం ఎంత చేరువవుతున్నా దానిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వాలు మీనమేషాలు వేస్తున్నారుు. దీంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతోంది. ఒక వైపు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల ఆకర్షితులు కావడం, అదే సమయంలో సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు తరచూ వేధిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ ఆగమ్యగోచరంగా తయారైంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డిస్టిక్ ్రఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (డీఐఎస్‌ఈ) పేరుతో జరిపిన సర్వేలో తేలింది. 2006-07 ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల సంఖ్య 52,760 కాగా, 2015-16లో ఆ సంఖ్య 48,760కు పడిపోరుుంది. అంటే పదేళ్లలో సంవత్సరాల్లో మూతబడిన పాఠశాల సంఖ్య అక్షరాల నాలుగువేలు. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో కూడా 22 వేల పాఠశాలల్లో ఒక్కొక్క విద్యాసంస్థలో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువగా ఉంది. ఇక 2006-07 ఏడాదిలో ఒకటో తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 7.69 లక్షలు కాగా, 2015-16లో ఆ సంఖ్య 5.23 లక్షలకు పడిపోరుుంది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాల్లో ఒకటి తరగతి విద్యార్థుల గణనీయంగా పెరిగింది. పదేళ్ల ముందు అన్‌ఎరుుడెడ్ ప్రైవేటు పాఠశాల్లో ఒకటో తరగతి విద్యార్థుల సంఖ్య 3.15 లక్షలు ఉండగా గత విద్యా ఏదాదికి ఆ సంఖ్య 5.11 లక్షలకు చేరింది. మొత్తం పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో (1-10 వరకూ) చదువుకొనే విద్యార్థుల
సంఖ్య 64 లక్షల నుంచి 47.45 లక్షలకు పడిపోరుుంది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల సంఖ్య 23 లక్షల నుంచి 36 లక్షలకు పెరగడం గమనార్హం.
19,762 పాఠశాలల్లో ఆటస్థలాలే లేవు...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల లేమి కూడా కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాఠశాలల్లో 22,447 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో 11,277 పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేకపోవడం గమనార్హం. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 70 వేల గదులు బోధనకు అనుకూలంగా లేకపోగా అందులో 33 వేల గదులు శిథిలావస్థకు చేరుకున్నారుు. 10,406 పాఠశాలకు ప్రహరీలు లేవు. మరోవైపు విద్యార్థుల రక్షణ కోసం ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమరాలు కచ్చితమని చెబుతున్న ప్రభుత్వం...ఒక్క ప్రభుత్వ పాఠశాల్లో కూడా కెమరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
ఆరేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు బంద్...
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ జరగలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 32,888 ప్రాథమిక ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. అదేవిధంగా 5,063 హై స్కూల్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. దీంతో చాలా చోట్ల రెండు మూడు తరగతుల విద్యార్థులను ఒకే చోట చేర్చి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యా బోధన తీరు ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం విద్యా ప్రమాణాలు తగ్గకుండా 15,980 విద్యా వలెంటీర్లను నియమించామని చెబుతోంది. అరుుతే చాలా చోట్ల వీరికి సరిగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు కూడా ఇతర ఉపాధిని చూసుకుంటున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు బసవరాజ గురికార మాట్లాడుతూ... ’మౌలిక సదుపాయాల పెంపుతో పాటు సరిగా జీతాలు ఇస్తే ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరిగుతుంది. అరుుతే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడం లేదు. ఉదాహరణకు కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులే స్వచ్ఛందంగా నెలకు ఇంత మొత్తం అని విద్యా వలెంటీర్లకు ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.