తాళం.. ఘోరం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్యను పెంచాల్సింది పోయి.. తక్కువ ఉన్నారనే నెపంతో స్కూళ్లకు తాళం వేస్తుండడం ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. ఇలాగైతే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువుకు నిలయంగా మారిన మన జిల్లాలో ఎక్కువ మంది గ్రామాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచేందుకు ఇష్టపడటం లేదు. చదువుపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి.
విద్యార్థులు లేని కారణంగా ఒకటి, రెండు కాదు ఏకంగా 177 స్కూళ్లు జిల్లాలో మూతపడ్డాయంటే పరిస్థితికి అద్దం పడుతోంది. బోధన సరిగా లేదని.. పేద వర్గాల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళాహీనంగా మారాయి.
ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో వందలాది స్కూళ్లు పిల్లలు లేని కారణంగా మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)-2013 ప్రకారం జిల్లాలో 177 స్కూళ్లు విద్యార్థులు లేక, 10 మందిలోపు విద్యార్థుల సంఖ్య ఉన్న కారణంగా క్లోజ్ చేశారు. బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థీ లేనికారణంగా క్లోజ్ చేశారు.
మూతపడిన ప్రాథమిక పాఠశాలలివే : అగళి మండలం గొల్లహట్టి, లక్ష్మీపురం, బీరనపల్లి, ఎంకె గొల్ల హట్టి, హుళికెరదేవరహ ళ్లి, ఎంఎం పాల్యం. అమడగూరు మండలం బావిచెరువుపల్లి, సీతిరెడ్డిపల్లి, దుడరగుట్టపల్లి, అమరాపురం మండలం కదతడహళి,్ల అనంతపురం మండలం జంగాలపల్లి, ఆత్మకూరు మండలం దొద్దెకొట్టాల, బత్తలపల్లి మండలం చీమలనాగేపల్లి, రామాంజుంపల్లి, కళ్యాణదుర్గం మండలం పింజరికొట్టాల, కూడేరు మండలం మరుట్ల, కనగానపల్లి మండలం కొండ్రెడ్డిపల్లి, బెళుగుప్ప మండలం వీరాంజినేయ కొట్టాల, బ్రహ్మసముద్రం మండలం విఎన్ హళ్లి, గుమ్మగట్ట మండలం మారెమ్మపల్లి తాండ, పామిడి మండలం పామిడి ఆర్‌ఎస్, యల్లనూరు మండలం పిఎం కొండాపురం, బుక్కపట్నం మండలం నాయనవారిపల్లి, నల్లగుట్టపల్లి, బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లి, రామగిరి మండలం ఆకుతోట్ల, రాయదుర్గం మండలం జుంజురాంపల్లి పాఠశాలలు మూతపడ్డాయి.
చిలమత్తూరు మండలంలో 6, ధర్మవరం మండ లంలో 10, గాండ్లపెంటలో 4, గార్లదిన్నెలో 2, గోరంట్లలో 7, గుడిబండలో 2, గుంతకల్లులో 2, కదిరిలో 3, కొత్త చెరువులో 4, కుందిర్పిలో 4, లేపాక్షి మండలం శిరివరం, మడకశిరలో 8, ముదిగుబ్బలో 10, నల్లచెరువులో 4, నల్లమాడలో 2, నంబులపూలకుంటలో 5, నార్పలలో 2, ఓబులదేవచెరువులో 7, పరిగిలో 2, పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లి, పెనుకొండ లో 5, రొద్దంలో 5, రొళ్లలో 10, శెట్టూరులో 3, శింగనమలలో 2, సోమందేపల్లిలో 5, తాడిపత్రిలో 2, తలుపులలో 11, యాడికిలో 4, తనకల్లు మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.