జ్యోతిబా పూలే పాఠశాల ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన
వైరారూరల్ : మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలలో సరైన వసతులు లేవంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండో శనివారం కావడంతో తమ పిల్లలను కలిసేందుకు వారు కళాశాలకు రాగా.. కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వైరా – జగ్గయ్యపేట రాష్రీ్టయ రహదారిపై బైఠాయించి 2 గంటలు ఆందోళన చేశారు.
పక్కా భవనాలు లేకపోవడంతో రెబ్బవరంలో మూతబడిన ప్రైవేటు పాఠశాల భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో కొనసాగిస్తున్నారు. ముసలిమడుగు ఎంజీపీ గురుకుల విద్యార్థులు 440 మంది, వైరా ఎంజీపీ విద్యార్థులు 310 మంది.. రెండూ కలిపి 750 మంది విద్యారి్థనులు ఈ భవనంలోనే ఉంటున్నారు. అయితే భవన ఆవరణలో 22 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. పరిమితికి మించి విద్యార్థినులు ఉండడంతో ఇబ్బంది అవుతోందని గురుకులాల నిర్వాహకులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు.
దీంతో పాఠశాలకు వచి్చన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండు గంటలు వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్ వచ్చి ఆందోళన విరమింపజేసేలా ప్రయతి్నంచారు. కానీ వసతుల కల్పనపై అధికారులు హామీ ఇవ్వాల్సిందేనని తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఇన్‌చార్జ్ డిప్యూటీ వార్డెన్ సుధ అక్కడకు చేరుకొని నెల రోజుల్లో మరో కొత్త భవనంలోకి మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment