How Many Parents Willing To Send Kids To School, Local Circles Survey On Schools Reopening - Sakshi
Sakshi News home page

పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా ?

Published Wed, Jun 23 2021 1:23 PM | Last Updated on Wed, Jun 23 2021 7:30 PM

How Much Parents Willing To Send Their Children To School If They Are Opened In India And Telangana - Sakshi

భావి భారత పౌరుల చదువులు వ్యాక్సినేషన్‌పై ఆధారపడ్డాయి. కరోనా భయాలు తొలగక పోకపోవడంతో పిల్లలను స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు తటపటాయిస్తున్నారు.  మరోవైపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పిల్లలకు ఎప్పుడు టీకా ఇవ్వాలనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలను స్కూళ్లకు పంపడం, టీకాలు ఇవ్వడంపై భారతీయుల ఆలోచణ ధోరణిని తెలుసుకునే  ప్రయత్నం లోకల్‌సర్వే సంస్థ చేసింది. అందులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 

తెలంగాణలో
జులై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలు తెరుచుకోవడంపై ఇతర రాష్ట్రాలు ముందు వెనుకా ఆలోచిస్తున్న సమయంలోనే తెలంగాణ సర్కారు నిర్ణయం ప్రకటించింది. అయితే పిల్లలను బడులకు పంపడం, టీకాలు ఇవ్వడంపై తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ 1,789 మంది తల్లిదండ్రు అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది.  

►  విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభమైన పిల్లలను చదువుకునేందుకు పంపిస్తామని 26 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. 

► జిల్లాలలో పూర్తిగా కోవిడ్‌ కేసులు తగ్గిపోయినప్పుడే తమ బిడ్డలను విద్యాసంస్థలకు పంపిస్తామని 15 శాతం మంది పేరెంట్స్‌ తెలిపారు.

► తాము నివాసం ఉండే జిల్లాతో పాటు పొరుగు జిల్లాలలో కూడా జీరో కరోనా కేసులు నమోదయితేనే తమ వాళ్లను స్కూళ్లు/ కాలేజీలకు పంపిస్తామని 24 శాతం మంది కుటుంబ పెద్దలు వెల్లడించారు.

► తమ పిల్లలకు టీకాలు అందించేంత వరకు బడులు/ కాలేజీలకు పంపబోమంటూ 33 శాతం మంది తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. కేవలం  2 శాతం మంది మాత్రమే ఎటూ తేల్చుకోలేకపోతున్నామన్నారు.
(చదవండి: కరోనా: లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ)
 
వ్యాక్సిన్‌ విషయంలో
పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించే విషయంపై  ఇటీవల తెలంగాణకు చెందిన 1600ల మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి విశ్లేషించగా  ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

► సెప్టెంబరు నాటికి పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పిల్లలకు వ్యాక్సిన్‌ వేయిస్తామని  49 శాతం మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

►  పిల్లలకు వ్యాక్సిన్‌ వేసే విషయంలో ఒకటి నుంచి మూడు నెలల సమయం వరకు వేచి చూస్తామంటూ 31 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. 

► 14 శాతం మంది తల్లిదండ్రులు ఈ ఏడాది తమ పిల్లలకు అసలు వ్యాక్సిన్‌ వేయించబోమని తేల్చి చెప్పారు. 

► పిల్లలకు వ్యాక్సిన్‌ వేసే విషయంలో ఇంకా ఏమీ తేల్చుకోలేదని 6 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. 

దేశవ్యాప్తంగా 
► పిల్లలను బడికి పంపే విషయంలో దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల నుంచి 10,828 శాంపిల్స్‌ సేకరించగా మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లను బడికి పంంపేందుకు రెడీగా లేమని వెల్లడించారు. 

► తాము నివసించే జిల్లాలో కరోనా కేసులు జీరోకు రావడం లేదా పిల్లలకు టీకాలు అందివ్వడం జరిగితేనే తమ బిడ్డలను కాలేజీ/స్కూళ్లకు పంపిస్తామని 76 శాతం మంది తల్లిదండ్రులు ఘంటాపథంగా తేల్చి చెప్పారు.

► సెకండ్‌వేవ్‌ ప్రారంభానికి ముందు పిల్లలను బడికి పంపేందుకు దేశ వ్యాప్తంగా 69 శాతం మంది తల్లిదండ్రులు రెడీగా ఉండగా ఇప్పుడా సంఖ్య 20 శాతానికే పరిమితమైంది. 

►ఇక సెప్టెంబరులోపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ... తమ పిల్లలకు టీకా ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు 65 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. 
చదవండి : టీకాలందు.. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ వేరయా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement