ప్రజాస్వామ్యం కాదు.. అగ్రకులాల స్వామ్యం
ప్రజాస్వామ్యం కాదు.. అగ్రకులాల స్వామ్యం
Published Sat, Aug 13 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
నిజామాబాద్ నాగారం, వినాయక్‌నగర్ :
దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను ఓట్ల కోసం వాడుకొని ప్రజాస్వామ్యాన్ని అగ్రకులాల స్వామ్యంగా మారుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. సాంస్కృతిక విప్లవం రావాలని, బీసీలు రాజ్యాధికార స్థాపన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో శుక్రవారం బీసీ కుల సంఘాల జిల్లా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అర, ఒక్క శాతం ఉన్న అగ్రకులాల వారు బీసీలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా సుమారు 70 దశాబ్దాలు పాలించారని అన్నారు. బీసీల ఓట్లతో అధికారం చేపట్టి బీసీల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. క్షేత్రస్థాయి నుంచి బీసీలంతా ఏకమై ఉద్యమాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇ. శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌లు పాల్గొన్నారు. బడ్జెట్‌లో రూ. 150 కోట్లు కేటాయిస్తే బీసీలకు సరిపోతాయా.. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చిన ప్రకారం రూ.18 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, 500 గురుకుల పాఠశాలలు నిర్మించాలన్నారు.
Advertisement
Advertisement