
సాక్షి, హైదరాబాద్: బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ప్రత్యేక ఉపప్రణాళిక అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు.. బీసీ కమిటీ సభ్యులు మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనాచారిలకు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ పాలసీ అవసరమని, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ లేదా బీసీ ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన వర్తింపజేయాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు 50శాతం వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు..
చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని తెలు గు రాష్ట్రాల సీఎంలను కోరామని కృష్ణయ్య చెప్పారు. దీనికి ఇద్దరు సీఎంలు అంగీకరించారని, ప్రధాని అపా యింట్‌మెంట్ దొరకగానే వెళ్దామని చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment