BC Committee
-
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు చేయాలి
-
‘చంద్రబాబు మానసిక స్థితి బాగలేదు’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో సోమవారం బీసీ అధ్యయన కమిటీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమనతో పాటు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. భారతదేశ నిర్మాణంలో బీసీలది ప్రధాన పాత్ర అన్నారు. దేశంలో మొదట నుంచి బీసీలకు మంచి స్థానం ఉండేదన్నారు. బంగారు పాలెం సంస్ధానాన్ని పరిపాలించింది కూడా బీసీలనే గుర్తుచేశారు. కుండలు తయారు చేసే చక్రం, నాగలి కనిపెట్టిన వడ్రంగి కులస్తులే మొదటి శాస్త్రవేత్తలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర చేసి నేటితో 15 ఏళ్లు పూర్తైయిందన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు 50 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, రాజశేఖర్‌రెడ్డి ఓ అడుగు వేస్తే, జగన్ రెండు అడుగులు వేయాలనే తపన ఉన్న వ్యక్తి అని తెలిపారు. బీసీ వర్గాల సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అధ్యయం చేస్తామన్నారు. బీసీ మేలు చేసే ప్రతి అడుగులో అడుగేస్తా అని హామీ ఇచ్చారు. 14 ఏళ్లుగా బీసీలకు అన్యాయం రాష్ట్రంలోని 2 కోట్ల బీసీల కుటుంబాలు బాగుండాలని కోరుకున్నది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్ బీసీలకు ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తే చంద్రబాబు వాటిని రూపుమాపారని విమర్శించారు. 14 ఏళ్లుగా చంద్రబాబు బీసీలను మోసగిస్తూనే ఉన్నారన్నారు. ఒక్కసారి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అవకాశం ఇస్తే.. అందరి భవిష్యత్ బాగుపడుతుందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబుకు మానసిక స్థితి బాగలేకపోవడంతో రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించి తప్పు చేశామని, మరోమారు ఆ తప్ప్పు చేయోద్దని అనిల్ పేర్కొన్నారు. -
సబ్ప్లాన్తోనే బీసీలకు సరైన న్యాయం
సాక్షి, హైదరాబాద్: బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ప్రత్యేక ఉపప్రణాళిక అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు.. బీసీ కమిటీ సభ్యులు మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనాచారిలకు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ పాలసీ అవసరమని, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ లేదా బీసీ ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన వర్తింపజేయాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు 50శాతం వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు.. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని తెలు గు రాష్ట్రాల సీఎంలను కోరామని కృష్ణయ్య చెప్పారు. దీనికి ఇద్దరు సీఎంలు అంగీకరించారని, ప్రధాని అపా యింట్మెంట్ దొరకగానే వెళ్దామని చెప్పారన్నారు. -
బీసీల సమస్యల అధ్యయనం కోసం వైఎస్సార్సీపీ కమిటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వెనుకబడిన కులాల(బీసీల) సమస్యలను అధ్యయనం చేసేందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం ‘బీసీ అధ్యయన కమిటీ’ వివరాలను ప్రకటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన బీసీ నాయకుల సమావేశంలో చేసిన తీర్మానాలను అనుసరించి కమిటీని ఏర్పాటుచేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 15 మంది సభ్యులు, ఎనిమిది మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉండే ఈ కమిటీకి గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీ సంఘాలతో, వివిధ వృత్తి సంఘాలతో సమావేశమై వారి సమస్యలను అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నివేదికను అందించనుంది. -
బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడి శ్రీను
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడి శ్రీను నియమితులయ్యారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.దుర్గా, నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు దొమ్మేటి శంకరరావు చేతుల మీదుగా శ్రీను నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి తక్షణం ప్రకటన విడుదల చేయాలన్నారు. -
అర్హులందరికి రిజర్వేషన్ ఫలాలు అందాలి
భద్రాచలం : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారందరికీ రిజర్వేష¯ŒS ఫలాలు అందేలా అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మ¯ŒS వి.గంగాధర్ గౌడ్ కోరారు. ఆయన నేతత్వంలోని ందం శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రూల్ ఆఫ్ రిజర్వేష¯ŒS అమలు తీరును పరిశీలించింది. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులతో సమవేశమైంది. ఆలయంలో రోస్టర్ రిజిస్టర్ ప్రకారంగా ఉద్యోగుల నియామకం జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించింది. సమావేశంలో గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం కల్పించిన రూల్ ఆఫ్ ద రిజర్వేష¯ŒS తప్పక పాటించాలన్నారు. బీసీ వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో 29 శాతం రిజర్వేష¯ŒSను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రై వేటు సంస్థల్లో కూడా బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేష¯ŒS కచ్చితంగా పాటించేలా అధికారులు కషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రై వేట్ సంస్థల్లో రోస్టర్ రిజిస్టర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఔట్ సోర్సింగ్ నియామకంలో కూడా రిజర్వేష¯ŒS పాటించాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ దుర్గాప్రసాద్, ఐటీడీఏ పీఓ/ఇ¯ŒSచా చార్జీ సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దేవస్థానం ఈఓ తాళ్ళూరి రమేష్‌బాబు, తహసీల్దార్ రామకష్ణ, ఎంపీపీ ఊకే శాంతమ్మ, ఎంపీడీఓ ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలుకు శాసనసభ బీసీ కమిటీ రాక
- రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై సమీక్ష కర్నూలు (అర్బన్) : ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో ఏపీ శాసనసభ బీసీ కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కమిటీ చైర్మన్ జి.తిప్పేస్వామి ఆధ్వర్యంలో 28వ తేదీన ఉదయం 8.30 గంటలకు కర్నూలుకు వస్తున్న కమిటీ ముందుగా మల్యాలలో హంద్రీనీవా ఎస్ఈతో బీసీ ఉద్యోగుల సంక్షేమంపై సమావేశం నిర్వహిస్తారన్నారు. 11 గంటల నుంచి 12.45 వరకు కర్నూలులో ఇరిగేషన్ ఎస్ఈతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పథకంలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమంపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బీసీ ప్రజా సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారన్నారు. 3 గంటలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్‌తో సమీక్షిస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లాలోని బీసీ వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం అవుతారన్నారు. రాత్రి 7.30 గంటలకు మంత్రాలయం బీసీ వసతి గృహాన్ని పరిశీలిస్తారని సంజీవరాజు తెలిపారు. అదే రోజు రాత్రి మంత్రాలయంలో బస చేసి 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు బీసీ హెచ్‌డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆదోని నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నంద్యాలకు చేరుకొని అక్కడి ఆర్డీఓ కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి డివిజన్లోని బీసీ వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం అవుతారని చెప్పారు. 4 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి మహానంది చేరుకొని దేవస్థానం ఈఓతో సమావేశం నిర్వహిస్తారని, అక్కడి నుంచి 5 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారని ఆయన వివరించారు.